LOADING...
India's COVID-19 surge: దేశంలో 4300 దాటిన కరోనా కేసులు- ఏ రాష్ట్రంలో ఎక్కువ అంటే?
దేశంలో 4300 దాటిన కరోనా కేసులు- ఏ రాష్ట్రంలో ఎక్కువ అంటే?

India's COVID-19 surge: దేశంలో 4300 దాటిన కరోనా కేసులు- ఏ రాష్ట్రంలో ఎక్కువ అంటే?

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 04, 2025
11:56 am

ఈ వార్తాకథనం ఏంటి

దేశవ్యాప్తంగా కోవిడ్‌ కేసులు క్రమంగా పెరుగుతున్ననేపథ్యంలో తాజా గణాంకాలు ఆందోళన కలిగిస్తున్నాయి. దేశంలో ప్రస్తుతం క్రియాశీల కేసుల(యాక్టివ్‌ కేసులు)సంఖ్య 4,302కి పెరిగింది. గడిచిన 24గంటల వ్యవధిలో 276కొత్త కేసులు నమోదవగా,మరోవైపు 3,281 మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి విడుదలయ్యారని కేంద్ర ఆరోగ్య,కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. ఇందులో ముఖ్యంగా ఢిల్లీ,ఉత్తర్‌ప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌, కేరళ, గుజరాత్‌ రాష్ట్రాల్లో కేసుల సంఖ్య ఇతర ప్రాంతాలతో పోలిస్తే గణనీయంగా ఉంది. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాల వైద్యశాఖలు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. తాజా గణాంకాల ప్రకారం,దేశంలో మొత్తం ఏడు కోవిడ్‌ సంబంధిత మరణాలు సంభవించాయి. ఇందులో ఒక్క మహారాష్ట్రలోనే నలుగురు ప్రాణాలు కోల్పోయారు. అయితే ఆస్పత్రుల్లో చేరుతున్నవారి సంఖ్య తక్కువగానే ఉందని ఆరోగ్య శాఖ అధికారులు పేర్కొన్నారు.

వివరాలు 

భారత్‌లో కొత్త వేరియంట్లు వ్యాప్తి చెందుతుండటమే కేసుల పెరుగుదలకు ప్రధాన కారణం 

ఇంకా, హిమాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రంలో మంగళవారం తొలి కోవిడ్‌ కేసు నమోదైంది. సిర్మూర్‌ జిల్లాలోని నహాన్ ప్రాంతానికి చెందిన 82 సంవత్సరాల వృద్ధ మహిళకు కరోనా సోకినట్లు వైద్యాధికారులు ధృవీకరించారు. వైద్య నిపుణుల అంచనాల ప్రకారం, భారత్‌లో కొత్త వేరియంట్లు వ్యాప్తి చెందుతుండటమే కేసుల పెరుగుదలకు ప్రధాన కారణమని చెబుతున్నారు. అయితే ఈ కొత్త వేరియంట్ల లక్షణాలు స్వల్పంగానే ఉండటంతో ప్రజలు అధికంగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేస్తున్నారు. అయితే వృద్ధులు, చిన్నపిల్లలు, అలాగే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు మరింత అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

దేశంలో 4300 దాటిన కరోనా కేసులు