Page Loader
AP-TG: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా 12 రాష్ట్రాలకు కేంద్రం భారీ ప్రణాళిక
AP-TG: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా 12 రాష్ట్రాలకు కేంద్రం భారీ ప్రణాళిక

AP-TG: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా 12 రాష్ట్రాలకు కేంద్రం భారీ ప్రణాళిక

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 27, 2024
09:36 am

ఈ వార్తాకథనం ఏంటి

కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా 12 రాష్ట్రాల్లో పారిశ్రామిక నగరాలను అభివృద్ధి చేయడానికి రూ.25 వేల కోట్ల బడ్జెట్‌ను కేటాయించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్రతిపాదనకు వచ్చే కేబినెట్‌ సమావేశంలో ఆమోదం లభించే అవకాశం ఉంది. ఈ పారిశ్రామిక నగరాల ద్వారా మొత్తం రూ.1.5 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించవచ్చని ఓ అంచనాకు వచ్చారు. పారిశ్రామిక అభివృద్ధి, ఆర్థికాభివృద్ధికి ఈ నగరాలు కీలక పాత్ర పోషిస్తాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Details

ప్రయివేటు రంగంలో కలిసి అభివృద్ధి చేయాలని ప్రణాళికలు

విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ఈ పారిశ్రామిక నగరాలను నివాస, వాణిజ్య మండళ్లుగా రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రయివేటు రంగంతో కలిసి అభివృద్ధి చేయాలని కేంద్రం యోచిస్తోంది. ఈ నగరాల అభివృద్ధి కోసం తెలుగు రాష్ట్రాలతో పాటు బిహార్, ఉత్తర్‌ప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, కేరళ తదితర రాష్ట్రాలు ఉండడం గమనార్హం. గ్రేటర్‌నోయిడా, గుజరాత్‌లోని ధొలేరా పారిశ్రామిక నగరాల మాదిరిగా, ఈ నగరాలు కూడా జౌళి, ఫ్యాబ్రికేషన్, విద్యుత్తు వాహనాలు, విమానయాన, ఆహారశుద్ధి, పర్యాటక రంగాలకు సంబంధించిన పార్క్‌ల ఏర్పాటుకు అవకాశం కల్పించనున్నాయి.