Page Loader
NITI Aayog: కొనసాగుతున్న నీతి ఆయోగ్ సమావేశం.. నీతీష్‌-సోరెన్ డుమ్మా
కొనసాగుతున్న నీతి ఆయోగ్ సమావేశం.. నీతీష్‌-సోరెన్ డుమ్మా

NITI Aayog: కొనసాగుతున్న నీతి ఆయోగ్ సమావేశం.. నీతీష్‌-సోరెన్ డుమ్మా

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 27, 2024
11:24 am

ఈ వార్తాకథనం ఏంటి

నీతి ఆయోగ్ 9వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం ఢిల్లీలో కొనసాగుతోంది. ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశాన్ని ఇండియా కూటమి సీఎంలు బహిష్కరించారు. తెలంగాణ సీఎంతో సహా ఆరు రాష్ట్రాల సీఎంలు ఈ సమావేశానికి హాజరు కాలేదు. బడ్జెట్‌లో వివక్ష చూపుతున్నారని ఆరోపిస్తూ జార్ఖండ్ సీఎం నీతీష్ సోరెన్ ఈ సమావేశానికి దూరంగా ఉన్నారు.

Details

అభివృద్ధి చెందిన దేశంగా తయారు చేసేందుకు చర్చలు

అయితే ఈ సమావేశానికి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ హాజరయ్యారు. మరోవైపు బీహార్ సీఎం నితీశ్ కుమార్ హాజరు కాకపోవడం గమనార్హం. ఇక నీతి ఆయోగ్ సమావేశానికి హాజరయ్యేందుకు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ, చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయి రాష్ట్రపతి భవన్ చేరుకున్నారు. ఈ సమావేశానికి 'వికసిత్ భారత్-2047' థీమ్‌తో అభివృద్ధి చెందిన దేశంగా తయారు చేసేందుకు తీసుకోవాల్సిన చర్చలపై చర్చించే అవకాశం ఉంది.

Details

తెలంగాణ ముఖ్యమంత్రి దూరం

ఇక 2047 నాటికి 30 ట్రిలియన్ డాలర్ల కంటే ఎక్కువ జీడీపీతో ప్రపంచంలోనే ఇండియా మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలవాలని భావిస్తోంది. మరోవైపు కేంద్ర, రాష్ట్రాల మధ్య సమన్వయం ఉండేలా రోడ్ మ్యాప్ రూపొందించనున్నారు. విపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలకు బడ్జెట్‌లో వివక్ష చూపించారనే కారణంతో ఈ సమావేశాన్ని బాయ్‌కాట్ చేస్తున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించాడు. సిద్దరామయ్య, ఎంకే స్టాలిన్, పినరయి విజయన్ కూడా ఈ సమావేశానికి దూరమయ్యారు.