
Terror Attack: టెర్రరిస్ట్‌ల దెబ్బకు.. సైనికులను చూసి ఉగ్రవాదులుగా భయపడ్డ టూరిస్ట్‌లు.. వీడియో
ఈ వార్తాకథనం ఏంటి
జమ్ముకశ్మీర్ లోని అనంత్‌నాగ్ జిల్లాలో ఉగ్రవాదుల కాల్పుల్లో కొంతమంది పర్యాటకులు తీవ్ర భయంతో వణికిపోవడంతో, కొందరు కొండలపై, గుట్టల్లో పరిగెత్తి కుప్పకూలిపోయారు.
ఈ సమయంలో వారు తమ కుటుంబ సభ్యులు, భర్తలు, పిల్లలు, తోబుట్టువులు, స్నేహితులను కోల్పోయిన బాధతో గుండెలవిసేలా ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ హృదయ విదారకమైన దృశ్యాలను చూసి, వారిని కాపాడటానికి వచ్చిన భారత సైనికులను కూడా చూసి వారు భయాందోళనకు గురయ్యారు.
సైనికులను ఉగ్రవాదులు అనుకుని "మమ్మల్ని చంపొద్దు, దయచేసి!" అని వారిని వేడుకున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతుంది.
వివరాలు
మీరు భయపడాల్సిన అవసరం లేదు..
భయంతో వణికిపోతున్న పర్యాటకులకు సైనికులు ధైర్యం చెప్పుతూ, "మేము మిమ్మల్ని కాపాడటానికి వచ్చాం. మీరు భయపడాల్సిన అవసరం లేదు" అని తెలిపారు.
ఈ వీడియోలో ఇదే ప్రతిధ్వనిస్తుంది. బైసరన్ లోయలో ఉన్న ఉగ్రవాదులు సైనిక దుస్తుల్లో రావడం, విచక్షణారహితంగా కాల్పులు జరపడం గుర్తించారు.
హనీమూన్ కోసం వచ్చి, పెళ్లైన ఐదు రోజులకే నవ వధువు తన భర్తను కోల్పోయింది.
ఈ దాడిలో ఇప్పటి వరకు 28 మంది ప్రాణాలు కోల్పోగా, 20 మంది గాయపడినట్టు తెలుస్తోంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతున్న వీడియో ఇదే..
सुबह उठते ही ये क्लिप देखी
— V A S H I S T H A (@sushilvashisth) April 23, 2025
आँसू आ गए ...
सरकार से निवेदन है कठोरतम कार्यवाही करे । स्थानीय सहायता के बिना ये हमला नहीं किया जा सकता था । #PahalgamTerroristAttack pic.twitter.com/QEduiPMOjN
వివరాలు
దాడిలో ఐదుగురు ఉగ్రవాదులు
పహల్గాంలో జరిగిన ఈ కాల్పుల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు.
హైదరాబాద్‌లో ఇంటెలిజెన్స్ బ్యూరోలో పనిచేసే మనీష్ రంజన్, విశాఖపట్నానికి చెందిన చంద్రమౌళి చనిపోయారు.
చంద్రమౌళి పారిపోయే ప్రయత్నం చేసినప్పుడు, ఉగ్రవాదులు అతన్ని వెంబడించి కాల్పులు జరిపి హత్య చేశారంటూ సమాచారం అందింది.
చంద్రమౌళి రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి కాగా, ఆయన కుటుంబసభ్యులు కశ్మీర్‌కి బయలుదేరినట్టు తెలిసింది.
ఈ దాడిలో ఐదుగురు ఉగ్రవాదులు పాల్గొన్నట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
పాకిస్థాన్ ఆధారిత ఉగ్రవాద సంస్థ "లష్కరే తొయిబా" అనుబంధ సంస్థ "ది రెసిస్టెంట్ ఫ్రంట్" ఈ దాడికి బాధ్యులమని ప్రకటించింది.
వివరాలు
భద్రతా వ్యవహరాల కమిటీ అత్యవసర సమావేశం
13 ఏళ్ల తర్వాత కశ్మీర్‌లో జరిగిన అతిపెద్ద ఉగ్రదాడి ఇది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఈ దాడిని తీవ్రంగా ఖండించారు.
ఉగ్రవాదంపై పోరాటానికి తమ మద్దతు ఉంటుందని వారు ప్రకటించారు. భారత పర్యటనలో ఉన్న అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఆయన భార్య కూడా ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు.
పహల్గాంలోని పర్యాటకులే ఉగ్రవాదుల దాడికి లక్ష్యమయ్యారు. ఈ ఉగ్రదాడి నేపథ్యంలో, ప్రధాని నరేంద్ర మోదీ సౌదీ అరేబియాలోని పర్యటనను అర్ధాంతరంగా ముగించి బుధవారం ఉదయం ఢిల్లీకి చేరుకున్నారు.
విమానాశ్రయంలో ఉన్నతాధికారులతో ఈ ఘటనపై చర్చలు జరిపారు. బుధవారం ఉదయం, ప్రధాన మంత్రి అధ్యక్షతన భద్రతా వ్యవహరాల కమిటీ అత్యవసర సమావేశం నిర్వహించనుంది.
వివరాలు
పాకిస్థాన్ యుద్ధ విమానాలను సరిహద్దుల వైపు
మరోవైపు, పాకిస్థాన్ సరిహద్దుల్లో అప్రమత్తమైనట్టు సమాచారం.
ఈ ఉగ్రదాడి తరువాత 2019 పుల్వామా దాడి తరహాలో భారత్ మరోసారి దాడులు చేయాలనే అవకాశం ఉందని పాకిస్థాన్ భావిస్తున్నట్టు సమాచారం.
అందుకే, పాకిస్థాన్ యుద్ధ విమానాలను సరిహద్దుల వైపు తరలించినట్టు తెలుస్తోంది.