
Mothers Day 2025: మదర్స్ డే ఎప్పుడు ప్రారంభమైంది? మదరింగ్ సండే ఏ దేశం నుంచి వచ్చిందీ తెలుసా?
ఈ వార్తాకథనం ఏంటి
తల్లికి ప్రత్యేకమైన గౌరవం ఇచ్చే ఉత్సవంగా ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే వేడుక మదర్స్ డే.
ఈ రోజును మనం ప్రత్యేకంగా అమ్మకు అంకితం చేస్తాం.
ఈ వేడుకకు ఆరంభం దాదాపు 117 సంవత్సరాల క్రితం,అమెరికాలో జరిగింది.
అమెరికన్ మహిళ అన్నా జార్విస్ ఈ భావనకు పునాది వేశారు. 1907 మే 12న ఆమె తల్లి జ్ఞాపకార్థంగా ఓ ప్రత్యేక ప్రార్థనా సభను నిర్వహించారు.
ఇదే మదర్స్ డే ఆవిర్భావానికి మొదటి అడుగు. తర్వాత ఈ ఆలోచన అమెరికాలో విస్తరించి, ప్రతి ఏడాది మే రెండో ఆదివారాన్ని తల్లుల్ని స్మరించుకునే రోజుగా పాటించసాగారు.
చివరకు 1914లో అమెరికా అప్పటి అధ్యక్షుడు ఉడ్రో విల్సన్ దీనిని జాతీయ సెలవు దినంగా అధికారికంగా ప్రకటించారు.
వివరాలు
తల్లి ప్రేరణతో వచ్చిన ఆలోచన
జార్విస్‌కి ఈ ఆలోచన తన తల్లి నుంచే వచ్చింది. ఆమె తల్లి ఇతర తల్లులకు మార్గనిర్దేశం చేస్తూ, పిల్లల భవిష్యత్తుపై దృష్టి పెట్టేలా చైతన్యవంతులుగా మారేందుకు కృషిచేశారు.
తల్లులు చేసే పనులకు గుర్తింపు అవసరమనే నమ్మకంతో, 1858లో ఆమె 'మదర్స్ డే వర్క్ క్లబ్' అనే ఉద్యమాన్ని ప్రారంభించారు.
ఈ క్లబ్ ముఖ్యంగా శిశుమరణాలను తగ్గించడంపైనే దృష్టి పెట్టింది. అప్పట్లో గ్రాఫ్టన్ ప్రాంతంలో ప్లేగు వంటి అంటువ్యాధుల వల్ల చిన్నపిల్లలు మృతిచెందటం సామాన్యం.
వివరాలు
జార్విస్ కుటుంబంలో తల్లిపిల్లల పరిస్థితి
అన్నా జార్విస్ 13 మంది సంతానంలో ఒకరు.అయితే,వారిలో 9 మంది చిన్నతనంలోనే చనిపోయారు.
మిగిలిన నలుగురిలో జార్విస్ పెద్దన్న ఒక్కరికే పిల్లలు ఉన్నారు. వారిలో కూడా చాలామంది చిన్న వయసులో మరణించారు.
ఇది అన్నా జార్విస్‌ను తీవ్రంగా కలచివేసింది. 1905లో తల్లి మరణించాక, జార్విస్ తన తల్లి సేవలకు గుర్తింపు దక్కించాలనే సంకల్పంతో మదర్స్ డేను స్థాపించారు.
కానీ ఆమె తల్లి మాత్రం ఈ రోజును సమాజం మొత్తం తల్లుల పనిని గౌరవించేలా ఉండాలని కోరింది.
జార్విస్ మాత్రం ఈ వేడుకను "మీరెవరి తల్లైనప్పటికీ, మీ తల్లి మాత్రమే అత్యుత్తమ మాతృమూర్తి" అనే భావనతో ప్రారంభించారు.
అందుకే దీనిని "Mothers' Day" అని కాకుండా, "Mother's Day" అనే ఏకవచన రూపంలో ఉల్లేఖిస్తారు.
వివరాలు
మే రెండో ఆదివారమే ఎందుకు?
జార్విస్ తల్లి 1905 మే 9న కన్నుమూశారు. ఆ తేదీకి సమీపమైన రెండో ఆదివారాన్ని జార్విస్ తల్లిని గుర్తు చేసుకునే దినంగా ఎంచుకున్నారు.
మొదటిసారిగా 1908లో గ్రాఫ్టన్ మెథడిస్ట్ చర్చిలో ఈ వేడుక జరిగింది. 1910లో వెస్ట్ వర్జీనియాలో దీనికి అధికారిక సెలవు ఇవ్వగా, 1914లో అమెరికా మొత్తంలో జాతీయ సెలవుగా గుర్తించబడింది.
వాణిజ్యానికి వ్యతిరేకంగా పోరాటం
అన్నా జార్విస్ మదర్స్ డేను పూర్తిగా భావోద్వేగంతో కూడిన గౌరవచర్యగా చూడాలని కోరారు.
కానీ కొంతకాలంలోనే ఇది పూలు,గ్రీటింగ్ కార్డులు, బహుమతుల మధ్య వాణిజ్యముఖంగా మారిపోయింది.
ఈ పరిస్థితిపై అసహనం వ్యక్తం చేసిన జార్విస్ 1920 నాటికి ప్రజలకు పూలు,బొకేలు కొనవద్దని విజ్ఞప్తి చేశారు.
వివరాలు
వాణిజ్యంగా మార్చిన సంస్థలపై కేసులు
తాను కోరిన అసలైన ఉద్దేశ్యం మరిచి, ఈ వేడుకను వాణిజ్య సంస్థలు లాభదాయకంగా మార్చడంపై ఆమె తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఫ్లవర్ వ్యాపారులు ఆమెకు డబ్బు ఇచ్చి మౌనంగా ఉండమని యత్నించినప్పటికీ, ఆమె అంగీకరించలేదు.
తన సోదరి లిలియన్‌తో కలిసి వారసత్వ ఆస్తిపై ఆధారపడుతూ సాదా జీవితాన్ని గడిపారు. పైగా వాణిజ్యంగా మార్చిన సంస్థలపై ఆమె స్వయంగా కేసులు వేశారు.
కాపీరైట్, చట్టపరమైన పోరాటాలు
మదర్స్ డే పేరును కాపీరైట్ చేసుకోవడానికి జార్విస్ ముందంజ వేశారు.
1944 నాటికి ఆమె వేసిన 33 కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం.
వాణిజ్య సంస్థలు "Mothers Day" అనే బహువచనాన్ని ఉపయోగించి ఈ కాపీరైట్‌ను దాటి పోవడానికి ప్రయత్నించేవారు.
వివరాలు
భారతదేశంలో మదర్స్ డే
ఆమె 80 ఏళ్ల వయసులో ఫిలడెల్ఫియాలోని శానిటోరియంలో నివసించేవారు.
ఆ సమయంలో ఆమె చూసుకోటానికి కొన్ని వ్యాపార సంస్థలే డబ్బు చెల్లించేవన్న ప్రచారం ఉంది. చివరికి 1948లో గుండెపోటుతో కన్నుమూశారు.
భారతదేశంలో కూడా మే రెండో ఆదివారాన్ని మదర్స్ డేగా జరుపుకుంటారు.
ఉద్యోగాలు, విద్య కోసం దేశంలో ఇతర ప్రాంతాలకు వెళ్లిన పిల్లలు, విదేశాల్లో ఉన్నవారు అమ్మకు ఫోన్ చేయడం, బహుమతులు పంపడం, సెల్ఫీలు తీసుకుని సోషల్ మీడియాలో షేర్ చేయడం వంటి పద్ధతులు మరింత పెరిగాయి.
భారతీయుల తల్లిదండ్రులతో బంధం పాశ్చాత్య దేశాల కంటే మరింత గాఢంగా ఉంటుంది.
పిల్లలు యువకులయ్యే వరకు తల్లితో ఎక్కువ సమయం గడిపే భారతీయ సంస్కృతి వల్ల, ఈ రోజు భావోద్వేగానికి నిదర్శనంగా మారింది.
వివరాలు
మదరింగ్ సండే - బ్రిటన్‌కు ప్రత్యేకమైన ఆచారం
బ్రిటన్‌లో మదర్స్ డేను "మదరింగ్ సండే"గా పిలుస్తారు. ఇది అమెరికా మాదిరిగా కాకుండా క్రైస్తవ పండుగ "లెంట్"లతో అనుసంధానమై ఉంటుంది.
మధ్యయుగంలో పనిచేయడానికి తల్లిదండ్రుల ఇళ్లను వదిలిన పిల్లలు, లెంట్ పండుగలో నాల్గవ ఆదివారం తమ ఇంటికి తిరిగివచ్చి మదర్ చర్చ్‌ను దర్శించేవారు.
ఈ రోజునే మదరింగ్ సండేగా గుర్తించారు. ప్రతి ఏడాది ఈ పండుగ తేదీ మారుతూ ఉంటుంది. బ్రిటన్‌లో ఈ ఏడాది మదర్స్ డే మార్చి 10న జరుపుకున్నారు.