NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / లైఫ్-స్టైల్ వార్తలు / Navratri 2024: నవరాత్రుల వేళ ఆయుధ పూజ ఎందుకు చేస్తారు? దీని వెనుక ఉన్న కారణాలు
    తదుపరి వార్తా కథనం
    Navratri 2024: నవరాత్రుల వేళ ఆయుధ పూజ ఎందుకు చేస్తారు? దీని వెనుక ఉన్న కారణాలు
    నవరాత్రుల వేళ ఆయుధ పూజ ఎందుకు చేస్తారు? దీని వెనుక ఉన్న కారణాలు

    Navratri 2024: నవరాత్రుల వేళ ఆయుధ పూజ ఎందుకు చేస్తారు? దీని వెనుక ఉన్న కారణాలు

    వ్రాసిన వారు Sirish Praharaju
    Sep 27, 2024
    05:49 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    హిందూ మత విశ్వాసాల ప్రకారం,మన దేశంలోని వివిధ రాష్ట్రాల్లో అశ్విని మాసం శుక్ల పక్షంలో మహా నవమి అంటే తొమ్మిదో రోజున ఆయుధాలను పూజించడం జరిగే ప్రత్యేక పద్ధతి.

    హిందూ మతంలో ఆయుధాల పూజకు చాలా ప్రాముఖ్యత ఉంది.ఈ పూజ దసరా పండుగకు ఒక రోజు ముందే నిర్వహించబడుతుంది.

    కొన్ని ప్రాంతాల్లో విజయ దశమి రోజున కూడా ఆయుధాలకు పూజ చేస్తారు.

    పురాణాల ప్రకారం, పాండవులు తమ విజయాన్ని కోరుతూ ఆయుధాలకు పూజ చేశారు.

    అందువల్ల, చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా ఆయుధ పూజలు చేస్తారనే విషయం పండితులు చెబుతున్నారు.

    ఈ నేపథ్యంలో, మహా నవరాత్రుల సమయంలో ఆయుధ పూజలు ఎందుకు జరుగుతాయో, వాటి ప్రాముఖ్యత గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

    వివరాలు 

    మహానవమి రోజున 

    ప్రస్తుత టెక్నాలజీ యుగంలో ప్రతి వ్యక్తి ఎక్కడో ఒక పనిలో బిజీగా ఉంటున్నారు.

    అలాంటి వారు నవరాత్రుల సమయంలో ప్రతి రోజు పూజలు చేయలేని వారు, చివరి మూడు రోజులలో దుర్గాదేవిని పూజిస్తే అమ్మవారి అనుగ్రహం పొందుతారని దేవీ భాగవతంలో సూచించబడింది.

    అందువల్ల, సప్తమి, దుర్గాష్టమి, మహానవమి రోజులు త్రిమూర్త్యాత్మక దేవీ స్వరూపానికి ప్రతీకలు.

    మహిషాసుర మర్దిని రాక్షసుని ఓడించి విజయం సాధించిన స్ఫూర్తితో, పూర్వ కాలంలో రాజులు ఈ శుభ ముహూర్తాన్ని దండయాత్రలకు ఎంచుకుంటున్నారని పురాణాలు చెబుతున్నాయి.

    తెలుగు పంచాంగం ప్రకారం, ప్రతి సంవత్సరం ఆశ్వయుజ మాసంలో వచ్చే శుక్లపక్ష నవమిని మహానవమి అంటారు.

    దుర్గాష్టమి, విజయదశమి వంటి 'మహర్నవమి' కూడా దుర్గా మాతకు ప్రత్యేకమైన రోజు.

    వివరాలు 

    నిమజ్జన వేడుకలు 

    నవరాత్రుల చివరి రోజున, తొమ్మిది మంది కన్యలు శక్తి స్వరూపాలను ప్రతినిధ్యం వహిస్తూ ప్రత్యేకంగా ఆరాధించబడతారు.

    తెలంగాణ రాష్ట్రంలో, మహా నవమి రోజున బతుకమ్మ పూజతో పాటు సరస్వతీ పూజ కూడా జరుపుకుంటారు.

    ఆ తరువాత, బతుకమ్మ నిమజ్జన వేడుకలను అతి ఘనంగా నిర్వహిస్తారు.

    తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో కూడా నిమజ్జన వేడుకలు జరుగుతాయి.

    ప్రత్యేకంగా, పశ్చిమ బెంగాల్‌లో ఈ వేడుకలను అత్యంత భక్తిశ్రద్దలతో జరుపుకుంటారు.

    వివరాలు 

    పనిముట్లకు ప్రత్యేక పూజలు 

    దక్షిణ భారతదేశంలో,ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు,కర్ణాటక,తమిళనాడులో ఆయుధ పూజ ప్రత్యేకంగా నిర్వహించబడుతుంది.

    ఈ పవిత్ర రోజున,ఇంట్లో,దుకాణాల్లో కార్యాలయాల్లో ఉన్న పనిముట్లకు ప్రత్యేక పూజలు అందించబడతాయి. ఈ ఏడాది, అక్టోబర్ 11,శుక్రవారం,ఆయుధ పూజ జరుపుకోనున్నారు.

    ఆయుధ పూజ ప్రాముఖ్యత

    మరోవైపు,తమ పూర్వీకులను పునీతులుగా మార్చడానికి భగీరథుడు కఠోరమైన తపస్సు చేసి గంగమ్మ తల్లి నింగి నుండి నేలకు తీసుకురావడం కూడా ఈ రోజున జరిగింది.

    అందుకే,నవరాత్రుల్లో మహానవమిని అత్యంత ముఖ్యమైనదిగా భావిస్తున్నారు.ఆయుధ పూజ రోజున, కార్మికులు,వాహనదారులు,కులవృత్తి నిపుణులు,ఇతర రంగాల్లో పనిచేసే వారు తమ ఆయుధాలకు కచ్చితంగా పూజలు చేస్తారు.

    ఈ విధంగా పూజలు చేయడం వల్ల,వారు ఎలాంటి ప్రమాదాలకు గురి కాకుండా సురక్షితంగా ఉంటారని,అలాగే చేపట్టబోయే ప్రతి పనిలో విజయాన్ని సాధిస్తామని చాలా మంది నమ్ముతారు.

    వివరాలు 

    సిద్ధిదాత్రీ పూజ 

    నవరాత్రుల తొమ్మిదో రోజైన మహార్నవమి నాడు, కొంతమంది ముక్తేశ్వరీ దేవిని పూజిస్తారు.

    ఈ రోజున దశ మహావిద్య, సప్తమాత్రిక, అష్టమాత్రిక పూజలు నిర్వహించడం జరుగుతుంది.

    నవదుర్గ శాక్తేయ సాంప్రదాయాలు సిద్ధిదాత్రీ పూజ చేస్తాయి. ఈ పండుగ పర్వదినానికి పిండి వంటలతో ప్రసాదాలను నైవేద్యంగా సమర్పిస్తారు.

    ఉత్తర భారతంలో మహా నవమి రోజున కన్య పూజలు చేయడం పట్ల ప్రత్యేక ప్రాధాన్యత ఉంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    దసరా

    తాజా

    KKR vs RCB : బెంగళూరులో మ్యాచ్ రద్దు.. కేకేఆర్ ఫ్లే ఆఫ్ ఆశలు గల్లంతు బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్
    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ

    దసరా

    DUSERA : దేవి నవరాత్రుల షెడ్యూల్.. అక్టోబర్‌‌లో వచ్చే పండుగల లిస్ట్ ఇదే పండగలు
    దసరా నవరాత్రి 2023: దసరా నవరాత్రుల సమయంలో మీ పిల్లల్లో క్రియేటివిటీని పెంచే ఫన్ యాక్టివిటీస్  దసరా నవరాత్రి 2023
    తెలుగు సినిమా: దసరా సందర్భంగా విడుదలవుతున్న సినిమాల రన్ టైమ్స్, ఇతర విషయాలు  తెలుగు సినిమా
    Dasara Navaratri 2023: కొలెస్ట్రాల్ తక్కువగా ఉండే స్వీట్స్ తినాలనుకుంటే ఇవి ట్రై చేయండి  దసరా నవరాత్రి 2023
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025