Champions Trophy 2025: భారత ఛాంపియన్స్ ట్రోఫీ 2025 స్క్వాడ్ ప్రకటన ఎప్పుడంటే? ICC నిర్దేశించిన గడువు ఎంత?
ఈ వార్తాకథనం ఏంటి
ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2023-25 ఫైనల్‌కు చేరడంలో విఫలమైన భారత జట్టుకు మరో కఠిన సవాలు ఎదుర్కోవాల్సి ఉంది.
పాకిస్థాన్, యూఈఏ వేదికలలో హైబ్రిడ్ మోడల్‌లో జరగనున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో పాల్గోనడానికి టీమిండియా సిద్ధమవుతోంది.
50 ఓవర్ క్రికెట్ ఫార్మాట్‌లో జరగనున్న ఈ మెగా ఈవెంట్‌లో టీమిండియా రన్నరప్ హోదాలో బరిలోకి దిగనుంది.
ఈ ఐసీసీ మెగా టోర్నీ ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానుంది. టీమిండియా తమ అన్ని మ్యాచ్‌లను దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో ఆడనుంది.
వివరాలు
భారత జట్టు ప్రకటన ఎప్పుడంటే?
ఈ మెగా టోర్నీలో భారత జట్టు తమ తొలి మ్యాచ్‌ను ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్‌తో ఆడనుంది.తర్వాత, ఫిబ్రవరి 23న పాకిస్తాన్‌తో తలపడనుంది.
ఈ ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించి భారత జట్టు ప్రకటన కోసం ముహూర్తం ఖరారైనట్లు సమాచారం.
ఈ మెగా ఈవెంట్‌లో పాల్గొనే దేశాల క్రికెట్ బోర్డులు తమ జట్ల వివరాలను ఐసీసీకి జనవరి 12 నాటికి సమర్పించాలి.
ఈ నేపథ్యంలో, బీసీసీఐ (BCCI) ఐసీసీ నిర్ణయించిన గడువు ఒక రోజు ముందు, అంటే జనవరి 11న భారత జట్టును ప్రకటించేందుకు సిద్ధమవుతుంది.
వివరాలు
కెప్టెన్‌గా రోహిత్ శర్మ.. అయ్యర్‌కు ఛాన్స్
బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ ఆస్ట్రేలియా నుండి తిరిగి వచ్చిన వెంటనే జట్టు ఎంపికపై కసరత్తు మొదలు పెట్టనున్నారు.
ఇంగ్లండ్‌తో పరిమిత ఓవర్ సిరీస్‌లకు, ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించి ఒకేసారి భారత జట్లను బీసీసీఐ సెలక్షన్ కమిటీ ప్రకటించనుందంటూ వార్తలు వస్తున్నాయి.
ఈ మెగా టోర్నీలో భారత కెప్టెన్‌గా రోహిత్ శర్మను నియమించనున్నట్లు పలు రిపోర్టులు సూచిస్తున్నాయి.
అలాగే, గత కొంతకాలంగా జాతీయ జట్టుకు దూరంగా ఉన్న మహ్మద్ షమీ కూడా ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడేందుకు ఎంపికవుతారని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.
అంతకంటేముందు, స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగే వైట్‌బాల్ సిరీస్‌లలో షమీ పునరాగమన చేసే అవకాశం ఉంది.
వివరాలు
దేశవాళీ క్రికెట్‌లో శ్రేయస్ అయ్యర్ ఉత్తమ ప్రదర్శన
ఇంగ్లండ్ జట్టుతో టీ20 లేదా వన్డే సిరీస్‌లకు ఈ వెటరన్ ఫాస్ట్ బౌలర్‌ను ఎంపిక చేసే అవకాశం ఉందని వినికిడి.
మరోవైపు, మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌ను కూడా సెలక్టర్లు జట్టులో తిరిగి పిలిచే అవకాశాన్ని పరిశీలిస్తున్నారు.
అయ్యర్ ప్రస్తుతం దేశవాళీ క్రికెట్‌లో ఉత్తమ ప్రదర్శనను కనబరుస్తున్నాడు, దీంతో సెలక్టర్లు అతడిని తిరిగి జట్టులోకి తీసుకోవాలని నిర్ణయించారు.