
ODI WC 2023: వరల్డ్ కప్‌లో ప్లేయింగ్ ఎలెవన్ ఎంపికే అతిపెద్ద సవాల్ : రవిశాస్త్రి
ఈ వార్తాకథనం ఏంటి
భారత గడ్డపై జరగనున్న ఐసీసీ వన్డే ప్రపంచ కప్ 2023 ప్రారంభానికి ఒక్క రోజు మాత్రమే ఉంది. మరికొద్ది గంటల్లో ఈ మెగా టోర్నీ సంగ్రామం మొదలు కానుంది.
మొదటి మ్యాచ్ అహ్మబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గురువారం మధ్యాహ్నం 2 గంటలకు ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య ఆరంభం కానుంది.
అక్టోబర్ 8న ఆస్ట్రేలియాతో భారత్ తొలి మ్యాచులో తలపడనుంది. అయితే అన్ని జట్లకు ప్లేయింగ్ ఎలెవన్‌ను ఎంచుకోవడం అతిపెద్ద సవాల్ అని టీమిండియా మాజీ దిగ్గజం రవిశాస్త్రీ పేర్కొన్నాడు.
భారత తుది జట్టులో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌కు చోటు దక్కే అవకాశాలు చాలా తక్కువని చెప్పాడు.
Details
కుల్దీప్ బౌలింగ్ పై ఎలాంటి సందేహాలు లేవు
జట్టు కోసం ప్రతిఒక్కరూ ఎల్లవేళలా సిద్ధంగా ఉండాలని, స్క్వాడ్‌లో రవిచంద్రన్ అశ్విన్ చేరడంతో తుది జట్టు ఎంపిక ఆసక్తికరంగా మారిందని రవిశాస్త్రి చెప్పుకొచ్చాడు.
కుల్దీప్‌యాదవ్ తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని రాణిస్తే, తర్వాతి మ్యాచుల్లో స్థానం మాత్రం సుస్థిరం కాదని, అయితే అతడి బౌలింగ్‌పై ఎలాంటి సందేహాలు లేవన్నారు.
చాలా రోజుల తర్వాత జట్టులోకి వచ్చిన కుల్దీప్ ఇటీవల సిరీసుల్లో నాణ్యమైన బౌలింగ్ చేస్తున్నాడని, పిచ్ పొడిగా ఉంటే మాత్రం కేవలం ఇద్దరు పేసర్లు బరిలోకి దిగాలని, అప్పుడు ముగ్గురు స్పిన్నర్లను ఆడించే అవకాశం ఉంటుందని రవిశాస్త్రి వెల్లడించారు.
ఈ ప్రపంచకప్‌లో భారత్ తరుఫున అత్యధిక వికెట్లు తీసే బౌలర్ కుల్దీప్ అని మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ జోస్యం చెప్పాడు.