World Cup 2023 : వరల్డ్ కప్‌లో సగం మ్యాచులు పూర్తి.. సెమీస్ రేసులో ఎవరు ఉన్నారంటే?
ఇండియా వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ రసవత్తరంగా సాగుతోంది. పసికూన జట్లు కూడా ఈ మెగా టోర్నీలో సంచనాలను నమోదు చేస్తున్నాయి. వన్డే ప్రపంచ కప్ దాదాపు సగం పూర్తియింది. దీంతో సెమీ ఫైనల్స్ కు వెళ్లే జట్టు ఏవీ అనే ప్రశ్న అందరిలోనూ మొదలైంది. ఇప్పటికే 23 మ్యాచులు పూర్తి అయ్యాయి. భారత్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా ప్రస్తుతం పాయింట్ల పట్టికలో టాప్-4లో నిలిచిపోయాయి ఇండియా ఆడిన ఐదు మ్యాచుల్లోనూ గెలిచి 10 పాయింట్లు, 1.353 నెట్ రన్ రేట్ తో తొలి స్థానంలో ఉంది. ఇక ఇంగ్లండ్, శ్రీలంక, దక్షిణాఫ్రికా, నెదర్లాండ్స్‌తో తలపడనుంది.
నాలుగో స్థానం కోసం పోటీ!
ఐదింట్లో నాలుగు మ్యాచులు గెలిచి సౌతాఫ్రికా, ఇంగ్లండ్ వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. ఇక భారత్ తో ఓడిన న్యూజిలాండ్ ఈ టోర్నీలో నిలకడగా రాణిస్తోంది. ఆ జట్టు మిగిలిన నాలుగు మ్యాచుల్లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, పాకిస్థాన్, శ్రీలంకతో తలపడనుంది. మరోవైపు కివీస్ కూడా ఈ టోర్నీలో ఆసాధారణమైన ప్రతిభతో ముందుకెళ్తుతోంది. పాకిస్థాన్, న్యూజిలాండ్, ఇండియా, బంగ్లాదేశ్ జట్లతో సౌతాఫ్రికా పోటీ పడనుంది. టాప్ 4 లో ఇక్కడ టఫ్ ఫైట్ కొనసాగుతోంది. ప్రస్తుతం నాలుగో స్థానంలో ఆస్ట్రేలియా ఉంది. ఈ స్థానం కోసం పాకిస్థాన్, ఆఫ్గాన్ జట్లు కూడా పోటీపడుతున్నాయి.