IPL 2025: ఈ ఏడాది ఐపీఎల్ లో వీక్‌గా కనిపిస్తున్న టీమ్స్ ఇవే..
ఈ వార్తాకథనం ఏంటి
మార్చి 22 నుంచి ప్రారంభమవుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025, మే నెలాఖరు వరకు క్రికెట్ అభిమానులకు పూర్తి వినోదాన్ని అందించనుంది.
ఇప్పటికే 10 జట్లు కూడా తమ హోమ్ గ్రౌండ్స్‌లో శిబిరాలను ఏర్పాటు చేసి తీవ్ర కసరత్తులు నిర్వహిస్తున్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకున్న భారత జట్టు ఆటగాళ్లు కూడా తమ తమ ఐపీఎల్ జట్లలో చేరిపోయారు.
రాజస్థాన్ రాయల్స్ - కీలక ఆటగాళ్లను కోల్పోయిన జట్టు
ఈ జాబితాలో రాజస్తాన్ రాయల్స్ ముందు వరుసలో ఉంది.మెగా వేలానికి ముందు జట్టులో కీలకంగా ఉన్న బట్లర్, బౌల్ట్, చహల్, అశ్విన్ వంటి ఆటగాళ్లను వదులుకుంది.
అభిమానులంతా ఇప్పుడు కెప్టెన్ సంజు శాంసన్ , జైస్వాల్‌లపైనే ఆశలు పెట్టుకున్నారు.
వివరాలు
ఆర్సీబీ అంటేనే విరాట్ కోహ్లీ
వీరిద్దరూ మెరుగైన ప్రదర్శన చేయకపోతే రాజస్థాన్ రాయల్స్ చివరి స్థానంలో నిలవడం ఖాయం.
జట్టులో ఆర్చర్, హెట్ మైర్, హసరంగ, తీక్షణ, జురెల్, పరాగ్ వంటి మంచి ఆటగాళ్లు ఉన్నా, వారి ఆటతీరుపై ఇప్పటికీ సందేహమే.
ఇక, కొత్తగా కోచ్ బాధ్యతలు చేపట్టిన రాహుల్ ద్రావిడ్ జట్టును ఎలా నడిపిస్తాడో చూడాల్సిందే.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) గతంలో క్రిస్ గేల్, ఏబీ డివిలియర్స్,మ్యాక్స్‌వెల్, పీటర్సన్ వంటి స్టార్ ప్లేయర్లు ఉన్నా ఒక్కసారి కూడా ఐపీఎల్ ట్రోఫీ గెలుచుకోలేదు. ఈసారి కూడా ఆ జట్టు గెలుస్తుందని ఎవరూ నమ్మడం లేదు.
ఆర్సీబీ అంటేనే విరాట్ కోహ్లీ.అతను లేకుంటే జట్టుకు పెద్దగా క్రేజ్ ఉండదు.ఫిల్ సాల్ట్,లివింగ్‌స్టోన్, హేజిల్‌వుడ్,భువనేశ్వర్ కుమార్ ఉన్నా,వారిపై పెద్దగా నమ్మకం లేదు.
వివరాలు
కేకేఆర్ - డిఫెండింగ్ ఛాంపియన్‌కి ఈసారి కష్టమే?
అభిమానులు కూడా ఈసారి 'ఈసాలా కప్ నమ్‌దే'" అనే నినాదాన్ని మానేశారు.
కెప్టెన్‌గా రజత్ పటిదార్ బాధ్యతలు చేపట్టనున్నాడు. మొత్తంగా ఈసారి ఆర్సీబీ బలహీనమైన జట్లలో ఒకటిగా బరిలోకి దిగుతోంది.
గత సీజన్‌లో టైటిల్‌ను సొంతం చేసుకున్న కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్), ఈసారి డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతోంది.
అయితే, ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ లేరు, శ్రేయస్ అయ్యర్ కూడా గాయాల కారణంగా దూరమయ్యాడు. ఈ పరిస్థితుల్లో జట్టు బలహీనంగా మారినట్టు కనిపిస్తోంది.
ఆండ్రూ రస్సెల్ ఉన్నా అతను నిలకడగా రాణించటం కష్టం. జాతీయ జట్టుకు దూరమైన రహానే, రిటైర్మెంట్ ప్రకటించిన డికాక్, అలాగే సునీల్ నరైన్, వెంకటేశ్ అయ్యర్ వంటి ఆటగాళ్లు ఈ సీజన్‌లో కేకేఆర్ తరఫున ఆడనున్నారు.
వివరాలు
చివరి మూడు స్థానాల కోసం..
అయితే, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా వంటి ప్రతిభావంతమైన బౌలర్లు జట్టుకు అందుబాటులో ఉన్నారు.
బౌలింగ్ విభాగం బలంగా ఉన్నా, బ్యాటింగ్ విభాగంలో మాత్రం పెద్దగా నమ్మకం లేదు.
బలహీనమైన జట్ల జాబితాలో కేకేఆర్ కూడా చేరింది.
ఈ సీజన్‌లో చివరి మూడు స్థానాల కోసం రాజస్థాన్ రాయల్స్, ఆర్సీబీ, కేకేఆర్ జట్లు పోటీ పడే అవకాశం ఉంది!