LOADING...
IPL 2026 : ఐపీఎల్ 2026 పాయింట్స్ టేబుల్.. పంజాబ్ టాప్.. చెన్నై, ముంబైకి టెన్షన్!
ఐపీఎల్ 2026 పాయింట్స్ టేబుల్.. పంజాబ్ టాప్.. చెన్నై, ముంబైకి టెన్షన్!

IPL 2026 : ఐపీఎల్ 2026 పాయింట్స్ టేబుల్.. పంజాబ్ టాప్.. చెన్నై, ముంబైకి టెన్షన్!

వ్రాసిన వారు Moogati Shabari
Apr 29, 2026
09:45 am

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్ 2026 సీజన్ ఆసక్తికరంగా కొనసాగుతోంది. లీగ్ దశ సగానికి చేరుకునే సరికి పాయింట్ల పట్టికలో అనేక మార్పులు కనిపిస్తున్నాయి. తాజాగా రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓడినప్పటికీ పంజాబ్ కింగ్స్ అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలోని పంజాబ్ జట్టు ఈ సీజన్‌లో అద్భుత ప్రదర్శన చేస్తూ వరుస విజయాలతో ముందంజ వేసింది. ఎనిమిదో మ్యాచ్‌లో తొలి ఓటమిని ఎదుర్కొన్నా, అంతకుముందు సాధించిన విజయాల వల్ల టేబుల్ టాప్‌లోనే కొనసాగుతోంది. ఇప్పుడు టాప్-4లో ఉన్న జట్లు ఏవి? మిగతా జట్ల పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుందాం.

వివరాలు

టైటిల్ రేసులో పంజాబ్..

ఈ సీజన్‌లో పంజాబ్ కింగ్స్ 8 మ్యాచ్‌లు ఆడి 6 విజయాలు సాధించింది. మరో మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో పాయింట్లు పంచుకుంది. దీంతో మొత్తం 13 పాయింట్లతో మొదటి స్థానంలో నిలిచింది. రాజస్థాన్‌పై ఓటమి ఎదురైనా, ముందుగా సంపాదించిన పాయింట్లు ఆ జట్టుకు ఉపయోగపడ్డాయి. అలాగే +1.043 నెట్ రన్‌రేట్ కూడా పంజాబ్‌కు కలిసొచ్చింది. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో ఈసారి పంజాబ్ టైటిల్ రేసులో బలమైన జట్టుగా కనిపిస్తోంది.

వివరాలు

రెండో స్థానంలో ఆర్సీబీ..

రెండో స్థానంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కొనసాగుతోంది. ఆర్సీబీ 8 మ్యాచ్‌లలో 6 విజయాలు నమోదు చేసి 12 పాయింట్లు సాధించింది. అదనంగా +1.919 నెట్ రన్‌రేట్ ఆ జట్టుకు బలంగా ఉంది. మూడో స్థానంలో రాజస్థాన్ రాయల్స్ ఉంది. రాజస్థాన్ కూడా 12 పాయింట్లు సాధించినప్పటికీ, 9 మ్యాచ్‌లు ఆడటం వల్ల మూడో స్థానంలో నిలిచింది. నాలుగో స్థానంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఉంది. ఈ జట్టు 8 మ్యాచ్‌లలో 5 విజయాలతో 10 పాయింట్లు సంపాదించి ప్లేఆఫ్స్ అవకాశాలను బలపరుచుకుంది.

Advertisement

వివరాలు

ఆరో స్థానంలో సీఎస్కే..

ఐదో స్థానంలో గుజరాత్ టైటాన్స్ ఉంది. ఆ జట్టు 8 మ్యాచ్‌లలో 4 విజయాలతో 8 పాయింట్లు సాధించింది. అయితే నెట్ రన్‌రేట్ మైనస్‌లో ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఐదుసార్లు ఛాంపియన్ అయిన చెన్నై సూపర్ కింగ్స్ ప్రస్తుతం ఆరో స్థానంలో ఉంది. సీఎస్‌కే 8 మ్యాచ్‌లలో కేవలం 3 విజయాలు మాత్రమే సాధించి 6 పాయింట్లతో నిలిచింది. ఢిల్లీ క్యాపిటల్స్ కూడా 8 మ్యాచ్‌లలో 3 విజయాలతో ఏడో స్థానంలో ఉంది. అయితే నెట్ రన్‌రేట్ పరంగా చెన్నై కంటే ఢిల్లీ వెనుకబడి ఉంది.

Advertisement

వివరాలు

ఆఖరి స్థానంలో లక్నో..ముంబైకి టెన్షన్

కోల్‌కతా నైట్ రైడర్స్ పరిస్థితి ఈసారి నిరాశాజనకంగా మారింది. ఆ జట్టు 8 మ్యాచ్‌లలో కేవలం 2 విజయాలు మాత్రమే సాధించింది. మరో మ్యాచ్ రద్దు కావడంతో 5 పాయింట్లతో ఎనిమిదో స్థానంలో ఉంది. ముంబయి ఇండియన్స్ అభిమానులకు కూడా ఈ సీజన్ నిరాశ కలిగిస్తోంది. ముంబై 7 మ్యాచ్‌లలో కేవలం 2 విజయాలు సాధించి 4 పాయింట్లతో తొమ్మిదో స్థానంలో ఉంది. ఇక లక్నో సూపర్జెయింట్స్ పరిస్థితి మరింత దారుణంగా ఉంది. 8 మ్యాచ్‌లలో 6 ఓటములు చవిచూసిన ఆ జట్టు కేవలం 4 పాయింట్లు మాత్రమే సాధించింది. అలాగే -1.106 నెట్ రన్‌రేట్‌తో పట్టికలో చివరి స్థానంలో నిలిచింది.

Advertisement