యూవీ, ధోనీ తర్వాత ఆ స్థానాన్ని భర్తీ చేసే ప్లేయర్ అతడే: అశ్విన్
భారత జట్టుకు మిడిలార్డర్ బ్యాటింగ్ లైనప్ పై ఎప్పుడూ చర్చ సాగుతూనే ఉంది. టీమిండియా మాజీ ప్లేయర్లు యువరాజ్ సింగ్, ఎంఎస్ ధోని అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత ఆ స్థానాన్ని భర్తీ చేసే ప్లేయర్ కోసం ఇప్పటికీ భారత యాజమాన్యం ఎదురుచూస్తోంది. 5 స్థానంలో ఏ బ్యాటర్ ను ఆడించాలో ఆర్థం కాక బీసీసీఐ తలలు పట్టుకుంటోంది. ఇటీవల ఆసియా కప్ నేపథ్యంలో టీమిండియా భారత ఆటగాళ్లను ఎంపిక చేసింది. అయితే భారత ప్లేయర్ల ఎంపికపై టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ స్పందించాడు. టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ నెంబర్ 5 స్థానంలో అద్భుతంగా రాణించగలడని అశ్విన్ చెప్పుకొచ్చాడు.
కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ పై భారీ అంచనాలు
మిడిల్ ఆర్డర్‌లో కేఎల్ రాహుల్ ని ఆడించడం వల్ల అతన్ని వికెట్ కీపర్ గా కూడా ఉపయోగించుకొనే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇషాన్ కిషాన్ రెండో వికెట్ కీపర్ గా తనకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడని, తిలక్ వర్మ ఆసియా కప్ జట్టులో చేరినప్పటికీ, శ్రేయస్ అయ్యర్ ని మ్యాచ్ లోకి తీసుకొని అవకాశం ఉంటుందన్నారు. అయితే టీమిండియా మేనేజ్‌మెంట్ కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ ఇద్దరూ ఫిట్‌గా ఉండాలని భావిస్తోంది. వన్డే వరల్డ్ కప్ కు ముందు ఈ ఇద్దరు ప్లేయర్లు ఫామ్ లోకి వస్తే భారత జట్టుకు మిడిలార్డర్ కష్టాలు తీరనట్లే అని చెప్పొచ్చు.