Indian Cricketers Private Jet: సొంత జెట్‌లు ఉన్న టీంఇండియా క్రికెటర్లు వీళ్ళే..!
భారతదేశంలో క్రికెట్ స్టార్‌ల సంపాదన గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బీసీసీఐ నుంచి శాలరీ, ఐపీఎల్ ఫీజులు, అడ్వర్టైజ్‌మెంట్లు, బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌లతో వారు భారీగా సంపాదిస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచంలో ధనవంతులైన క్రికెటర్ల లిస్ట్ లో తొలి మూడు స్థానాల్లో సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లీ ఉన్నారు. 2024 మార్చి 31న ముగిసిన ఆర్థిక సంవత్సరంలో విరాట్ కోహ్లీ దేశంలో అత్యధిక పన్ను చెల్లించిన క్రికెటర్‌గా నిలిచాడు. కోహ్లీ రూ.66 కోట్ల పన్ను చెల్లించాడు.రెండో స్థానంలో ఎంఎస్ ధోనీ (రూ.38 కోట్లు),మూడో స్థానంలో సచిన్ తెందూల్కర్ (రూ.28 కోట్లు) ఉన్నారు. తర్వాత గంగూలీ రూ.23 కోట్లు,హార్దిక్ పాండ్యా రూ.13 కోట్లు,రిషబ్ పంత్ రూ.10 కోట్ల పన్ను చెల్లించారు.
విరాట్ ప్రైవేట్ జెట్ విలువ రూ.120 కోట్లు.
ఈ స్థాయిలో సంపాదన ఉన్న క్రికెటర్ల వద్ద ఖరీదైన బంగ్లాలు, కార్లు ఉన్నాయి. అయితే ప్రైవేట్ జెట్‌లు కొందరి దగ్గరే ఉన్నాయి. అవి ఎవరి వద్ద ఉన్నాయో చూద్దాం. విరాట్ కోహ్లీ: రన్ మెషీన్‌గా పేరు పొందిన విరాట్ కోహ్లీ చాలా కాలంగా టాప్ క్రికెటర్‌గా కొనసాగుతున్నాడు. ప్రస్తుతం సచిన్, ధోనీ కంటే ఎక్కువ సంపాదిస్తున్నాడు. అతని వద్ద ఖరీదైన కార్లు, ప్రైవేట్ జెట్ ఉన్నాయి. అతడి ప్రైవేట్ జెట్ విలువ రూ.120 కోట్లు. హార్దిక్ పాండ్యా: టీమిండియా స్టార్ ఆల్-రౌండర్ హర్థిక్ పాండ్యా ఆదాయం కూడా భారీగా ఉంది. భారతదేశంలోని అత్యంత ధనిక క్రికెటర్లలో హార్దిక్ ఒకడు. అతడి వద్ద రూ.40 కోట్ల విలువైన ప్రైవేట్ జెట్ ఉంది.
సచిన్ ప్రైవేట్ జెట్ విలువ రూ.250 కోట్లు
ఎంఎస్ ధోనీ: ఇండియాకు మూడు ఐసీసీ ట్రోఫీలు అందించిన ఏకైక కెప్టెన్ ఎంఎస్ ధోనీ. ప్రపంచంలోని రిచెస్ట్ క్రికెటర్ల జాబితాలో ధోనీ కూడా ఉన్నాడు.మహీ ప్రైవేట్ జెట్ విలువ రూ.110 కోట్లు. సచిన్ టెండూల్కర్: సుదీర్ఘకాలం అంతర్జాతీయ క్రికెట్‌లో రాణించి,"క్రికెట్ గాడ్"గా పేరు సంపాదించిన సచిన్ టెండూల్కర్ వద్ద కూడా ప్రైవేట్ జెట్ ఉంది.ప్రపంచంలోని అత్యంత ధనవంతులైన క్రికెటర్లలో సచిన్ ఒకడు. అతడి ప్రైవేట్ జెట్ విలువ రూ.250 కోట్లు. కపిల్ దేవ్: కపిల్ దేవ్ క్రికెట్ చరిత్రలో గొప్ప ఆల్-రౌండర్‌గా గుర్తింపు పొందారు.1983లో భారత్‌కు మొదటిసారి ప్రపంచ కప్ అందించిన ఆయన,స్వాతంత్య్రం తర్వాత ప్రైవేట్ జెట్ కొనుగోలు చేసిన మొదటి క్రికెటర్‌గా నిలిచాడు.కపిల్ దేవ్ ప్రైవేట్ జెట్ విలువ రూ.110 కోట్లు.