Page Loader
Fastest Fifty In Test: టెస్టు క్రికెట్‌లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ సాధించిన టాప్‌ ప్లేయర్ల జాబితా.. భారత్ ప్లేయర్లకు దక్కని చోటు
టెస్టు క్రికెట్‌లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ సాధించిన టాప్‌ ప్లేయర్ల జాబితా

Fastest Fifty In Test: టెస్టు క్రికెట్‌లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ సాధించిన టాప్‌ ప్లేయర్ల జాబితా.. భారత్ ప్లేయర్లకు దక్కని చోటు

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 23, 2024
05:48 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇండియన్ క్రికెట్ జట్టులో వీరేంద్ర సెహ్వాగ్, రోహిత్ శర్మ, రిషబ్ పంత్ వంటి భారీ హిట్టర్లు ఉన్నారు. అయితే టెస్టు క్రికెట్‌లో అత్యంత వేగంగా అర్ధశతకం సాధించిన ఆటగాళ్ల జాబితాలో ఎవరి పేరూ కనిపించడం లేదు. భారత ఆటగాళ్లు పలు అరుదైన రికార్డులు సొంతం చేసుకున్నప్పటికీ ఈ ప్రత్యేక ఘనత మాత్రం వారి ఖాతాలో లేకపోవడం గమనార్హం. టెస్ట్ క్రికెట్‌లో వేగంగా హాఫ్ సెంచరీ సాధించిన టాప్ బ్యాటర్ల గురించి తెలుసుకుందాం మిస్బాఉల్‌హక్(పాకిస్థాన్) టెస్టు క్రికెట్‌లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ సాధించిన ఆటగాళ్ల జాబితాలో పాకిస్థాన్ ప్లేయర్ మిస్బాఉల్‌హక్ అగ్రస్థానంలో ఉన్నాడు. 2014లో అబుదాబిలో ఆస్ట్రేలియాపై కేవలం 21 బంతుల్లోనే మిస్బా హాఫ్ సెంచరీ బాదాడు. ఈ రికార్డును ఇంతవరకు ఎవరూ అధిగమించలేదు.

Details

2. డేవిడ్ వార్నర్ (ఆస్ట్రేలియా)

ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ 2017లో సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో పాకిస్థాన్‌ పై 23 బంతుల్లో ఫిఫ్టీ బాదాడు. ఇది ఈ జాబితాలో రెండో వేగవంతమైన ఫిఫ్టీగా నిలిచింది. 3. జాక్వెస్ కలిస్ (దక్షిణాఫ్రికా) దక్షిణాఫ్రికా దిగ్గజ ఆల్‌రౌండర్ జాక్వెస్ కలిస్ 2005లో కేప్‌టౌన్‌లో జింబాబ్వేపై 24 బంతుల్లో అర్థశతకం సాధించాడు. ఫాస్టెస్ట్ ఫిఫ్టీ సాధించిన జాబితాలో అతనికి మూడో స్థానం లభించింది.

Details

4. బెన్ స్టోక్స్ (ఇంగ్లాండ్)

ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ 2024లో వెస్టిండీస్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో 24 బంతుల్లోనే అర్థశతకం సాధించాడు. ఈ ఫీట్‌ను కలిస్‌తో సమంగా స్టోక్స్ కూడా సాధించాడు. 5. షేన్ షిల్లింగ్‌ఫోర్డ్ (వెస్టిండీస్) 2014లో వెస్టిండీస్ బౌలర్ షేన్ షిల్లింగ్‌ఫోర్డ్ 25 బంతుల్లో అర్థశతకాన్ని నమోదు చేశాడు. కింగ్‌స్టన్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్ట్‌ మ్యాచ్‌లో షేన్‌ ఈ ఘనత సాధించాడు. 6. షాహిద్ అఫ్రిది (పాకిస్తాన్) పాక్ క్రికెట్‌కు సంబంధించిన మరో మేజర్ ఇన్నింగ్స్ 2005లో భారత్ పర్యటనలో చోటు చేసుకుంది. బెంగళూరులో పాకిస్తాన్‌పై జరిగిన టెస్ట్‌లో అఫ్రిది 26 బంతుల్లోనే హాఫ్ సెంచరీని నమోదు చేశాడు.