LOADING...
Team India: ఆ ముగ్గురు స్టార్‌లు రూ.100 కోట్లకుపైగా సంపాదిస్తున్నారు: రవిశాస్త్రి 
ఆ ముగ్గురు స్టార్‌లు రూ.100 కోట్లకుపైగా సంపాదిస్తున్నారు: రవిశాస్త్రి

Team India: ఆ ముగ్గురు స్టార్‌లు రూ.100 కోట్లకుపైగా సంపాదిస్తున్నారు: రవిశాస్త్రి 

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 25, 2025
11:06 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచవ్యాప్తంగా క్రికెట్‌ ఆడే దేశాల సంఖ్య తక్కువైనా, ఈ ఆటకు ఉన్న ఆదరణ మాత్రం అపారమైనది. భారతదేశంలో అయితే క్రికెట్‌కు ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భారత క్రికెట్‌ అభిమానులు తమ ఆటగాళ్లను భుజాల మీద ఎక్కించుకుంటారు. ఫలితంగా, ఆటగాళ్లు కేవలం క్రికెట్‌ ఆడి మాత్రమే కాకుండా,ప్రకటనల ద్వారా కూడా భారీ స్థాయిలో డబ్బులు సంపాదిస్తున్నారు. ఈ తరహా ఆదాయాల్లో సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లీలు ఇతరులతో పోల్చితే అత్యధికంగా ఆర్జిస్తున్నారు. వీరిలో కొందరు ఇప్పటికీ యాడ్స్‌లో కనిపిస్తూ ఉన్నారు.ప్రస్తుతం భారత జట్టు ఇంగ్లండ్ పర్యటనలో ఉంది. ఈ క్రమంలో మాజీ క్రికెటర్‌, మాజీ భారత కోచ్ రవిశాస్త్రి వ్యాఖ్యాతగా పనిచేస్తున్నారు.

వివరాలు 

భారత స్టార్ క్రికెటర్లు ఎంత మొత్తాన్ని సంపాదిస్తారు?

ఇటీవలి కాలంలో ఇంగ్లండ్ మాజీ క్రికెటర్లతో కలిసి జరిగిన ఓ చర్చా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఆ కార్యక్రమంలో మైకెల్ వాన్ రవిశాస్త్రిని ఒక ఆసక్తికరమైన ప్రశ్న అడిగాడు . ''భారత స్టార్ క్రికెటర్లు ఎంత మొత్తాన్ని సంపాదిస్తారు?'' అని. దీనికి రవిశాస్త్రి సమాధానమిస్తూ ఆసక్తికరమైన విషయాలను వెల్లడించాడు.

వివరాలు 

ఎండార్స్‌మెంట్ల ద్వారానే వారి ఆదాయం రూ.100 కోట్లు

''వారు చాలా సంపాదిస్తారు.ముఖ్యంగా ఎండార్స్‌మెంట్ల ద్వారానే వారి ఆదాయంలో పెద్ద భాగం ఉంటుంది. కనీసం పది మిలియన్ల పౌండ్లకు పైగానే వారి వార్షిక ఆదాయం ఉంటుంది. మా కరెన్సీలో అది సుమారు రూ.100 కోట్లు.సచిన్‌, ధోనీ‌, విరాట్‌లాంటి ఆటగాళ్లు తమ కెరీర్ సమయంలో కనీసం 15 నుంచి 20 ప్రకటనల్లో నటించేవారు. ఇంకా చాలా చేసే అవకాశం ఉండేది. కానీ, వారు చాలా మ్యాచులు ఆడటంతో కుదరలేదు.లేకపోతే వారి ఆదాయం మరింతగా ఉండేదని చెప్పొచ్చు. అయినా ఇప్పటికీ వారు యాడ్స్ ద్వారా మంచి ఆదాయం అందుకుంటున్నారు'' అని రవిశాస్త్రి వివరించాడు. రవిశాస్త్రి చెప్పిన ఈ సమాచారం విన్న ఇంగ్లండ్ మాజీ క్రికెటర్లు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు.

వివరాలు 

సచిన్‌ను అధిగమించే అవకాశం జో రూట్‌కే 

ప్రస్తుతం టెస్టుక్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా సచిన్ ముందున్నాడు. అతడు 15,921 పరుగులతో అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు.అయితే ఈ రికార్డును బద్దలు కొట్టే అవకాశం జో రూట్‌కి మాత్రమే ఉంది. ఇప్పటి వరకు రూట్ 157టెస్టుల్లో 13,270పరుగులు చేశాడు.ఇంకా 109పరుగులు చేస్తే రికీ పాంటింగ్‌ను అధిగమించి రెండో స్థానాన్ని రూట్ దక్కించుకుంటాడు. అదేవిధంగా, ఇంకా 19పరుగులు చేసినా మూడో స్థానానికి చేరుకుంటాడు.ఈనేపథ్యంలో మాట్లాడుతూ రవిశాస్త్రి, ''జో రూట్ వయసు,అతడు ఇప్పటివరకు ఆడిన టెస్టులు చూస్తే సచిన్ రికార్డును అందుకోవడం సాధ్యమే.రూట్ ఇంకా నాలుగేళ్లపాటు టెస్టు క్రికెట్ ఆడే అవకాశం ఉంది.ప్రస్తుతం సచిన్ కంటే 47టెస్టులు వెనుకబడి ఉన్నాడు.కనీసం మరో 3వేల పరుగులు చేయగలడు.అతడి రికార్డును తిరగరాయడం ఇతరుల వల్ల సాధ్యపడదు''అని వ్యాఖ్యానించాడు.