LOADING...
Sanju Samson: ఆసియా కప్‌లో కొత్త పాత్రకు సిద్ధమవుతున్న సంజు శాంసన్‌?
ఆసియా కప్‌లో కొత్త పాత్రకు సిద్ధమవుతున్న సంజు శాంసన్‌?

Sanju Samson: ఆసియా కప్‌లో కొత్త పాత్రకు సిద్ధమవుతున్న సంజు శాంసన్‌?

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 22, 2025
12:10 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆసియా కప్ కోసం ప్రకటించిన భారత జట్టులో సంజు శాంసన్‌కు అవకాశం దక్కింది. అభిషేక్ శర్మతో కలిసి ఇప్పటికే కొన్ని సిరీసుల్లో ఇన్నింగ్స్‌ను ప్రారంభించాడు. ఇప్పుడు కూడా ఓపెనర్‌గానే వస్తాడని అంతా భావిస్తున్నారు. కానీ, ఇటీవల కేరళ క్రికెట్ లీగ్‌లో సంజు శాంసన్ బ్యాటింగ్ ఆర్డర్ చూస్తే, అభిమానుల్లో కొత్త సందేహాలు ఏర్పడుతున్నాయి. ఎందుకంటే, తాజాగా జరిగిన మ్యాచ్‌లో సంజు ఓపెనర్‌గా ప్లేయింగ్‌కి రాలేదు. కోచి బ్లూ టైగర్స్ జట్టును ప్రాతినిధ్యం వహిస్తున్న సంజు రెండు వికెట్లు పడినా, క్రీజ్‌లోకి రాలేదు. ప్రత్యర్థి నిర్ధేశించిన 98 పరుగుల లక్ష్యాన్ని అతని జట్టు కేవలం 11.5 ఓవర్లలోనే అధిగమించింది. ఫలితంగా, సంజుకు ఒక్క బంతి కూడా ఆడే అవకాశం రాలేదు.

వివరాలు 

బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పు? 

శుభమన్ గిల్ వైస్‌ కెప్టెన్‌గా రావడంతో, సంజు శాంసన్ బ్యాటింగ్‌ ఆర్డర్‌ కూడా మారిపోయే అవకాశం లేకపోలేదని క్రికెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఐపీఎల్‌లో శుభ్‌మన్ గిల్ ఓపెనర్‌గా గుజరాత్ టైటాన్స్ కోసం ఆడాడు. అందువల్ల, ఆసియా కప్‌లో కూడా అతను ఇన్నింగ్స్ ప్రారంభించినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఈ సందర్భంలో, సంజు వన్-డౌన్ లేదా మిడ్‌లార్డర్‌లో బ్యాటింగ్‌ చేయాల్సి ఉంటుంది. అందుకే, ఇప్పుడు కేరళ క్రికెట్ లీగ్‌లో ఓపెనింగ్‌పై కాకుండా తర్వాత స్థానాల్లో బ్యాటింగ్‌ చేసేందుకు సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి.

వివరాలు 

సెంచరీ చేసిన రింకు సింగ్ 

ఆసియా కప్ ముందు,హార్డ్ హిట్టర్ రింకు సింగ్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. మొన్నటివరకు పరుగులు సృష్టించడంలో కొంత ఇబ్బందులు ఎదుర్కొన్నా,ఇ ప్పుడు మాత్రం చెలరేగిపోయాడు. యూపీ టీ20 లీగ్‌లో మేరఠ్ మావెరిక్స్ జట్టును ప్రాతినిధ్యం వహిస్తున్న రింకు సింగ్ సెంచరీ కొట్టాడు. గౌర్ గోరఖ్‌పుర్ లయన్స్ నిర్ధేశించిన 168 పరుగుల లక్ష్యానికి, 38 పరుగులకే మేరఠ్ జట్టు 4 వికెట్లు కోల్పోయింది. క్రీజ్‌లోకి వచ్చిన రింకు సింగ్ (48 బంతుల్లో 108 నాటౌట్) దూకుడుగా ఆడాడు.అతను సాహబ్ యువ్‌రాజ్ (22*) తో కలిసి కేవలం 19 ఓవర్లలో జట్టును గెలిపించాడు. రింకు సింగ్ సెంచరీలో 7 ఫోర్లు,8 సిక్స్‌లు కొట్టడం గమనార్హం.ముఖ్యంగా, చివరి ఆరు బంతుల్లో ఐదు సిక్స్‌లు కొట్టడం గమనార్హం.