Page Loader
Shubman Gill : టీమ్ఇండియా కెప్టెన్ శుభ్‌మ‌న్ గిల్ అరుదైన ఘ‌న‌త.. ఆసియా ప్లేయ‌ర్ల‌లో ఒకే ఒక్క‌డు..
ఆసియా ప్లేయ‌ర్ల‌లో ఒకే ఒక్క‌డు..

Shubman Gill : టీమ్ఇండియా కెప్టెన్ శుభ్‌మ‌న్ గిల్ అరుదైన ఘ‌న‌త.. ఆసియా ప్లేయ‌ర్ల‌లో ఒకే ఒక్క‌డు..

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 03, 2025
10:42 am

ఈ వార్తాకథనం ఏంటి

టీమిండియా కెప్టెన్ శుభమన్ గిల్ ఓ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇంగ్లండ్ గడ్డపై వరుసగా రెండు శతకాలు కొట్టిన అత్యంత పిన్న వయస్కుడైన (25 సంవత్సరాలు 297 రోజులు) ఆసియా కెప్టెన్‌గా చరిత్రలో నిలిచాడు. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో శతకాన్ని సాధిస్తూ ఈ కీర్తి పతాకాన్ని ఎగురవేశాడు. గిల్ సాధించిన ఈ ఘనతకు ముందు,దక్షిణాఫ్రికా దిగ్గజ ఆటగాడు గ్రేమ్ స్మిత్ 2003లో ఇంగ్లాండ్ పర్యటన సందర్భంగా పర్యాటక జట్టు కెప్టెన్‌గా 22 ఏళ్లు 180 రోజుల వయసులో ఇంగ్లాండ్ గడ్డపై రెండు శతకాలు సాధించాడు. ఆయన తరువాత జాబితాలో పాకిస్థాన్‌కు చెందిన జావేద్ బుర్కీ, ఆస్ట్రేలియాకు చెందిన బిల్లీ ముర్డోక్ ఒక్కో సెంచరీలతో నిలిచారు.

వివరాలు 

ఇంగ్లాండ్ గడ్డపై 25 ఏళ్లు లేదా అంతకంటే తక్కువ వయసులో శతకాలు చేసిన విదేశీ కెప్టెన్ల జాబితా ఈ విధంగా ఉంది: 

గ్రేమ్ స్మిత్ (దక్షిణాఫ్రికా) - 2 సెంచరీలు శుభ్‌మన్ గిల్ (భారతదేశం) - 2 సెంచరీలు జావేద్ బుర్కీ (పాకిస్థాన్) - 1 సెంచరీ బిల్లీ ముర్డోక్ (ఆస్ట్రేలియా) - 1 సెంచరీ ఈ ఇంగ్లాండ్ సిరీస్ నుంచే గిల్ టీమిండియా కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు.మొదటి టెస్టులో, లీడ్స్‌లోని హెడింగ్లీ వేదికగా జరిగిన మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో గిల్ 147 పరుగులతో అద్భుత శతకాన్ని నమోదు చేశాడు. ఆ తర్వాత రెండో టెస్టులో,ఎడ్జ్‌బాస్టన్ వేదికగా మొదటి ఇన్నింగ్స్‌లో గిల్ 114 పరుగులు చేసి ఇంకా క్రీజులోనే ఉన్నాడు. ఇంగ్లాండ్ గడ్డపై ఒకటి కంటే ఎక్కువ శతకాలు చేసిన మూడవ భారత కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్ అరుదైన గుర్తింపు పొందాడు.

వివరాలు 

మ్యాచ్ ప్రస్తుత స్థితి: 

అతని ముందు మహమ్మద్ అజారుద్దీన్, విరాట్ కోహ్లీలు ఒక్కొక్కరుగా రెండు శతకాలు సాధించారు. రెండో టెస్టు మ్యాచ్‌లో తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 85 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 310 పరుగులు చేసింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (114 నాటౌట్),రవీంద్ర జడేజా(41 నాటౌట్)క్రీజులో ఉన్నారు. ఇతర బ్యాట్స్‌మెన్ విషయానికి వస్తే,యశస్వి జైస్వాల్ 107 బంతుల్లో 13 ఫోర్లతో 87 పరుగులు చేసి కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. కరుణ్ నాయర్ 31,రిషభ్ పంత్ 25 పరుగులు చేశారు. కేఎల్ రాహుల్ 2,నితీశ్ కుమార్ రెడ్డి 1 పరుగుతో విఫలమయ్యారు. ఇంగ్లాండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్ రెండు వికెట్లు పడగొట్టాడు.బెన్ స్టోక్స్, షోయబ్ బషర్ చెరో వికెట్ తీశారు.