LOADING...
Vaibhav Sooryavanshi: బీసీసీఐ వీడియోతో వైభవ్ అరంగేట్రంపై స్పష్టత వచ్చినట్టేనా?
బీసీసీఐ వీడియోతో వైభవ్ అరంగేట్రంపై స్పష్టత వచ్చినట్టేనా?

Vaibhav Sooryavanshi: బీసీసీఐ వీడియోతో వైభవ్ అరంగేట్రంపై స్పష్టత వచ్చినట్టేనా?

వ్రాసిన వారు Moogati Shabari
Jun 26, 2026
03:30 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ అరంగేట్రంపై ఇంకా ఆసక్తి నెలకొని ఉంది. జట్టు కోచింగ్ సిబ్బంది నుంచి ఇప్పటివరకు అతని ఎంపికపై స్పష్టమైన సంకేతాలు రాలేదు. బ్యాటింగ్ కోచ్ సితాన్ష్ కొటక్ మాట్లాడుతూ, వైభవ్ అసాధారణ ప్రతిభ కలిగిన ఆటగాడని, అతని సామర్థ్యంపై ఎలాంటి సందేహం లేదని పేర్కొన్నారు. అయితే, ప్రస్తుతం మంచి ప్రదర్శన చేస్తున్న మరో ఆటగాడిని కేవలం వైభవ్ కోసం పక్కన పెట్టడం సరైన నిర్ణయం కాదని కూడా అభిప్రాయపడ్డారు. దీంతో ఐర్లాండ్‌తో జరిగే తొలి టీ20లో వైభవ్‌కు అవకాశం దక్కుతుందా లేదా అన్న చర్చ కొనసాగుతోంది.

వివరాలు

అభిమానుల్లో కొత్త ఆశలు..

తాజాగా బీసీసీఐ తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో విడుదల చేసిన ఓ వీడియో అభిమానుల్లో కొత్త ఆశలు రేకెత్తించింది. ఆ వీడియోలో వైభవ్ సాధన చేస్తున్న దృశ్యాలు కనిపించడంతో, అతని అరంగేట్రం దాదాపు ఖాయమేననే అభిప్రాయం అభిమానుల్లో వ్యక్తమవుతోంది. ఇదే సమయంలో పలువురు మాజీ క్రికెటర్లు కూడా వైభవ్‌కు తొలి మ్యాచ్‌లోనే అవకాశం ఇవ్వాలని సూచిస్తున్నారు. ఐపీఎల్‌లో జస్‌ప్రీత్ బుమ్రా, జోష్ హేజిల్‌వుడ్, ప్యాట్ కమిన్స్ వంటి అగ్రశ్రేణి బౌలర్లను ధైర్యంగా ఎదుర్కొంటూ వైభవ్ ఆకట్టుకున్నాడు. ఇప్పుడు ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌కు సిద్ధమవుతున్న అతడు, నెట్ ప్రాక్టీస్‌లోనూ తన దూకుడు బ్యాటింగ్‌తో సహచర బౌలర్లపై ఆధిపత్యం చాటాడు. అతని ప్రాక్టీస్‌కు సంబంధించిన వీడియోను బీసీసీఐ సోషల్ మీడియాలో పంచుకుంది.

వివరాలు

మా ప్రణాళికలు మాకు సిద్ధంగా ఉన్నాయి: ఐర్లాండ్ వికెట్ కీపర్

ఐర్లాండ్ వికెట్ కీపర్ బెన్ కాలిట్జ్ మాట్లాడుతూ, ప్రత్యర్థి జట్టులో ఎవరు ఆడినా తమ దృష్టిలో అందరూ సమానమేనని స్పష్టం చేశాడు. విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ లేదా వైభవ్ సూర్యవంశీ అనే తేడా లేకుండా ప్రతి ఆటగాడిని ఒకే విధంగా పరిగణిస్తామని చెప్పాడు. ప్రత్యర్థి ఆటతీరును ముందుగానే విశ్లేషించి, దానికి అనుగుణంగా వ్యూహాలు సిద్ధం చేసుకుంటామని, మ్యాచ్ పరిస్థితులను బట్టి ఆ ప్రణాళికల్లో మార్పులు కూడా చేస్తామని వివరించాడు. టీమిండియా ప్రపంచ ఛాంపియన్ జట్టే అయినప్పటికీ, ప్రతి జట్టులో కొన్ని బలహీనతలు సహజంగానే ఉంటాయని, వాటిని గుర్తించి సద్వినియోగం చేసుకోవడం ద్వారానే విజయాన్ని అందుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నామని బెన్ కాలిట్జ్ పేర్కొన్నాడు.

Advertisement

ట్విట్టర్ పోస్ట్ చేయండి

బీసీసీఐ పోస్టు చేసిన వీడియో ఇదే..

Advertisement