Team India : టీ20ల్లో ఓపెనింగ్ జోడిపై సునీల్ గవాస్కర్ కీలక వ్యాఖ్యలు
వన్డే వరల్డ్ కప్ ముగిసిన తర్వాత టీమిండియా(Team India) వరుస సిరీస్‌లతో బిజీగా ఉంది. ఇప్పటికే ఆసీస్‌తో టోర్నీ దిగ్విజయంగా ముగించుకున్న భారత్ జట్టు.. ప్రస్తుతం సౌతాఫ్రికా పర్యటనలో ఉంది. ఈ సిరీస్‌లో భాగంగా భారత్ 3 టీ20లు, 3 వన్డేలు, రెండు టెస్టు మ్యాచులు ఆడనుంది. రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా గాయం కారణంగా జట్టుకు దూరం కావడంతో టీ20 జట్టుకు సూర్యకుమార్ యాదవ్ నాయకత్వం వహిస్తున్నాడు. దక్షిణాఫ్రికా టూర్‌లో సూర్య స్థానంలో జట్టు కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాలంటూ రోహిత్ శర్మను బీసీసీఐ కోరగా, విరామం కావాలని హిట్ మ్యాన్ సూచించనట్లు పలు రిపోర్టులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో టీ20 వరల్డ్ కప్‌లో రోహిత్ శర్మ(Rohit Sharma) ఆడడం కచ్చితమేనని చెప్పొచ్చు.
గిల్, యశస్వి జైస్వాల్ జోడి ఉత్తమం : సునీల్ గవాస్కర్
ఈ తరుణంలో టీ20 జట్టుపై టీమిండియా మాజీ దిగ్గజం సునీల్ గవాస్కర్(Sunil Gavaskar) కీలక వ్యాఖ్యలు చేశాడు. ఓపెనింగ్ కోసం శుభమాన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, యశస్వీ జైస్వాల్ పోటీ పడుతున్నారని పేర్కొన్నాడు జట్టుకు ఎడమ చేతి, కుడిచేతి కాంబినేషన్ అవసరం అనుకుంటే శుభమాన్ గిల్, యశస్వి జైస్వాల్ ఉత్తమ జోడి అని పేర్కొన్నాడు. రోహిత్ శర్మ కూడా ఆడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఓపెనింగ్ కాంబినేషన్ టీమిండియాకు పాజిటివ్ సమస్యగా మారినట్లు ఆయన చెప్పుకొచ్చాడు. అయితే రోహిత్ టీ20 వరల్డ్ కప్‌కు అందుబాటులో ఉంటాడో లేదో వేచిచూడాలని స్టార్ స్పోర్ట్స్‌తో సునీల్ గావాస్కర్ వెల్లడించారు.
రోహిత్ శర్మపై గంభీర్ ప్రశంసలు
మరోవైపు రోహిత్ శర్మ కెప్టెన్సీ పై భారత మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) ప్రశంసలు కురిపించాడు. రోహిత్ శర్మ గొప్ప కెప్టెన్ అని, ఐపీఎల్‌లో ఐదు ట్రోఫీలు గెలవడం అంత సులువైన విషయం కాదన్నారు. ఒక ఫైనల్ మ్యాచ్ ఓటమితో రోహిత్ ను బ్యాడ్ కెప్టెన్ అనడం సరికాదని పేర్కొన్నాడు. వచ్చే ఏడాది జరగనున్న టీ20 ప్రపంచ కప్‌లో రోహిత్ టీమిండియాకు కెప్టెన్‌గా వ్యవహరించాలని గంభీర్ సూచించాడు.