Page Loader
Team India:ICC ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు ఇవే!
ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు ఇవే!

Team India:ICC ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు ఇవే!

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 10, 2025
05:02 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఛాంపియన్స్ ట్రోఫీ-2025కు పట్టుమని పది రోజులు కూడా లేదు. అన్ని జట్లు ఈ ప్రతిష్ఠాత్మక టైటిల్‌ను గెలుచుకునేందుకు ఉత్సాహంగా సిద్ధమవుతున్నాయి. రెండు సార్లు ఛాంపియన్స్‌గా నిలిచిన టీమిండియా కూడా ముచ్చటగా మూడోసారి ట్రోఫీని అందుకోవాలని ఎదురుచూస్తోంది. ఈ సందర్భంగా, ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో టీమిండియాకు ప్రాతినిధ్యం వహిస్తూ అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన కనబరిచిన ఆటగాళ్లను ఒకసారి పరిశీలిద్దాం. టీమిండియా తరఫున ఒకే ఇన్నింగ్స్‌లో అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన చేసిన ఆటగాళ్లలో రవీంద్ర జడేజా ప్రథమ స్థానంలో ఉన్నాడు. 2013 ఛాంపియన్స్ ట్రోఫీలో వెస్టిండీస్‌పై పోరులో జడేజా 10 ఓవర్లు బౌలింగ్ చేసి కేవలం 36 పరుగులే ఇచ్చి 2 కీలక వికెట్లు సాధించాడు.

వివరాలు 

పాకిస్తాన్‌పై ఆసీస్ నెహ్రా 4 వికెట్లు

రెండో స్థానంలో దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ఉన్నాడు. 1998 ఛాంపియన్స్ ట్రోఫీలో ఆస్ట్రేలియాపై జరిగిన మ్యాచ్‌లో సచిన్ 9.1 ఓవర్లు వేసి 38 పరుగులే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. భారత మాజీ పేసర్ జహీర్ ఖాన్ 2002 ఛాంపియన్స్ ట్రోఫీలో జింబాబ్వేపై 4 వికెట్లు తీసి టీమిండియాకు కీలక విజయాన్ని అందించాడు. అలాగే, 2009 ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్‌పై ఆసీస్ నెహ్రా కూడా 4 వికెట్లు సాధించాడు. మునాఫ్ పటేల్, ప్రవీణ్ కుమార్, రమేష్ పవార్, వీరేంద్ర సెహ్వాగ్, బీకేవీ ప్రసాద్, హర్భజన్ సింగ్‌లు మూడు మూడు వికెట్లు సాధించి తమ ప్రాభవాన్ని చాటుకున్నారు.

వివరాలు 

అత్యధిక వికెట్లు తీసిన రవీంద్ర జడేజా

ఓవరాల్‌గా, ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో టీమిండియా తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ కూడా రవీంద్ర జడేజానే. 10 ఇన్నింగ్స్‌ల్లో 16 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. జహీర్ ఖాన్ 15 వికెట్లతో రెండో స్థానంలో నిలవగా, సచిన్ టెండూల్కర్ 14 వికెట్లతో మూడో స్థానంలో ఉన్నాడు. ఇక ఇషాంత్ శర్మ, భువనేశ్వర్ కుమార్‌లకు 13 వికెట్లు తీసుకున్నారు.