Asian Games : బంగ్లాపై 9 వికెట్ల తేడాతో విజయం.. ఆసియా గేమ్స్ ఫైనల్లోకి భారత్
ఆసియా గేమ్స్‌లో భారత పురుషుల క్రికెట్ జట్టు ఫైనల్లోకి దూసుకెళ్లింది. నేడు ఉదయం జరిగిన మ్యాచులో బంగ్లాదేశ్‌పై 9 వికెట్ల తేడాతో భారత జట్టు గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్‌ను 96 పరుగులకే భారత బౌలర్లు కట్టడి చేశారు. స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా కేవలం 9.2 ఓవర్లలోనే టార్గెట్‌ను చేధించింది. మొదటి మ్యాచులో సెంచరీతో చెలరేగిన యశస్వీ జైస్వాల్ ఈ మ్యాచులో డకౌట్ అయ్యాడు. మరో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ 26 బంతుల్లో (3 సిక్సులు, 4 ఫోర్లు) 40, తిలక్ వర్మ 26 బంతుల్లో (6 సిక్సులు, 2 ఫోర్లు) 55 రన్స్ చేశారు. భారత బౌలర్లలో కిషోర్ 3 వికెట్లు, సుందర్ రెండు వికెట్లు పడగొట్టాడు.