Yashasvi Jaiswal: హాఫ్ సెంచరీతో రికార్డుల వర్షం కురిపించిన యశస్వీ జైస్వాల్
పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా భారీ స్కోరు దిశగా సాగుతోంది. ఓపెనర్లు యశస్వీ జైస్వాల్, రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీలు సాధించారు. తొలిరోజు ఆట ముగిసే సమయానికి భారత్ 288/4 స్కోరు చేసింది. ఈ మ్యాచులో అర్ధ సెంచరీతో రాణించిన యశస్వీ ఓ అరుదైన రికార్డును సృష్టించాడు. ఓపెనర్‌గా తొలి రెండు టెస్టు ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు చేసిన రెండో భారత క్రికెటర్‌గా నిలిచాడు. మొదట టెస్టులో 171 పరుగులు, రెండు టెస్టు తొలి ఇన్నింగ్స్ లో 57 పరుగులు చేశాడు. దీంతో మొత్తం మీద 228 పరుగులను సాధించాడు. ఈ జాబితాలో కెప్టెన్ రోహిత్ (303) అందరికంటే ముందు వరుసలో ఉన్నాడు.
రోహిత్ శర్మ, యశస్వీ జైస్వాల్ రికార్డు
అరంగ్రేటం చేసిన తొలి ఇన్నింగ్స్ లోనే అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా శిఖర్ ధావన్(187 పరుగులు) నిలిచాడు. ఒకే టెస్టు సిరీస్‌లో ఓపెనింగ్ జోడి వరుసగా సెంచరీ ప్లస్ భాగస్వామ్యం నమోదు చేయడం 24 ఏళ్లలో ఇదే మొదటిసారి. ఈ ఘనత సాధించిన ఏకైక భారత ఓపెనింగ్ జోడీ సదాగోపాల్ రమేష్ , దేవాంగ్ గాంధీ పేరిట ఉంది. న్యూజిలాండ్‌తో జరిగిన 1999 హోమ్ సిరీస్‌లో వారు ఈ మైలురాయిని సాధించారు. యశస్వీ జైస్వాల్ కలిసి, రోహిత్ శర్మ రెండో సారి వంద పరుగుల(139) పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. దీంతో విండీస్ పై పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా ఓపెనింగ్ బ్యాటర్లు సాధించిన అత్యధిక పరుగుల జాబితాలో వీరిద్దరికి మూడో స్థానం లభించింది.
అగ్రస్థానంలో సచిన్ టెండుల్కర్
అదే విధంగా రెండో టెస్టులో 80 పరుగులు సాధించిన రోహిత్ శర్మ పలు రికార్డులను బద్దలు కొట్టాడు. టీమిండియా తరుపున అత్యధిక పరుగులు సాధించిన మూడో క్రికెటర్ గా నిలిచారు. అదే విధంగా టెస్టుల్లో ఓపెనర్ గా 2వేల రన్స్ పూర్తి చేసిన ఆటగాడిగా రికార్డు క్రియేట్ చేశారు. ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ టెస్టుల్లో 150 సిక్సర్లు బాదాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 25వేలకు పైగా పరుగులు చేసిన ఐదో బ్యాటర్‌గానూ విరాట్ కోహ్లీ నిలిచాడు. ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్ (34357 పరుగులు) అగ్రస్థానంలో నిలిచాడు.
తొలి ఇండియన్ ప్లేయర్ గా హిట్ మ్యాన్ రికార్డు
WTC లో 2వేలు పరుగులు చేసిన తొలి ఇండియన్ ప్లేయర్ గా హిట్ మ్యాన్ నిలిచాడు. ప్రస్తుతం క్రీజులో విరాట్ కోహ్లీ (87), రవీంద్ర జడేజా(36) ఉన్నారు. మరోవైపుఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన శుభ్‌మాన్ గిల్ 10, అంజిక్యా రహానే 8 పరుగులు చేసి పెవిలియానికి చేరారు. ఇక 500వ అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతున్న కోహ్లీ ఈ మ్యాచులో సెంచరీ సాధించాలని గట్టి పట్టుదలతో ఉన్నాడు. వెస్టిండీస్ బౌలర్లలో జాసన్ హోల్డర్, గాబ్రియెల్, కెమర్ రోచ్, వారికన్ తలో వికెట్ తీశారు.