Page Loader
Anti-Hindu parade: టొరంటోలో ఖలిస్తానీల హిందూ వ్యతిరేక కవాతు.. అభ్యంతరకర రీతిలో బోన్ లో మోదీ,అమిత్‌షా, జైశంకర్‌ బొమ్మలు 
టొరంటోలో ఖలిస్తానీల హిందూ వ్యతిరేక కవాతు.. అభ్యంతరకర రీతిలో బోన్ లో మోదీ,అమిత్‌షా, జైశంకర్‌ బొమ్మలు

Anti-Hindu parade: టొరంటోలో ఖలిస్తానీల హిందూ వ్యతిరేక కవాతు.. అభ్యంతరకర రీతిలో బోన్ లో మోదీ,అమిత్‌షా, జైశంకర్‌ బొమ్మలు 

వ్రాసిన వారు Sirish Praharaju
May 05, 2025
12:40 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఖలిస్థానీ వేర్పాటువాదుల దుశ్చర్యలు కెనడాలో ఆగడం లేదు. తాజాగా, టొరొంటో నగరంలోని మాల్టన్ గురుద్వారాలో ఖలిస్థాన్ మద్దతుదారులు ఓ ప్రదర్శన నిర్వహించి వివాదాస్పద చర్యలకు పాల్పడ్డారు. ఈ సందర్భంగా వారు భారత ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌ల బొమ్మలను ఓ బిన్ (పాత్ర)లో పెట్టి దారుణంగా ప్రదర్శించారు. ఇటీవల ఖలిస్థాన్ అనుకూలులు ఓ గురుద్వారాతో పాటు ఓ హిందూ మందిరంపై దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనల తరువాతే తాజా ప్రదర్శన జరగడం గమనార్హం.దీనిపై కెనడాలోని హిందూ సమాజానికి చెందిన ప్రముఖుడు షవన్ బిండా స్పందించారు.

వివరాలు 

హింసాత్మక దాడికి బాధ్యత వహించాల్సింది ఖలిస్థాన్ గ్రూపే

ఈ ప్రదర్శనకు సంబంధించిన వీడియోను ఎక్స్ (మాజీ ట్విట్టర్)లో పోస్ట్ చేసిన ఆయన, "ఇది భారత ప్రభుత్వంపై ఆందోళన చూపించేందుకు నిర్వహించిన కార్యక్రమం కాదు. ఖలిస్థానీ గ్రూప్‌లో ఉన్న హిందువులపై ద్వేషమే దీనికి అసలు కారణం. ఈ హింసాత్మక దాడికి బాధ్యత వహించాల్సింది ఖలిస్థాన్ గ్రూపే" అంటూ తీవ్రంగా విమర్శించారు. అలాగే, గతంలో జరిగిన కనిష్కా విమాన బాంబు దాడిని ఆయన ఈ సందర్భంలో గుర్తు చేశారు. అప్పటికీ, ఇప్పటికీ ఖలిస్థానీ తంతు మారలేదని చెప్పారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

షవన్ బిండా చేసిన ట్వీట్ 

వివరాలు 

 జర్నలిస్ట్ డానియల్ బోర్డమన్ కూడా వీడియోను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు

కెనడాలో పనిచేస్తున్న జర్నలిస్ట్ డానియల్ బోర్డమన్ కూడా ఖలిస్థానీలు నిర్వహించిన ఈ హిందూ వ్యతిరేక కార్యక్రమానికి సంబంధించిన వీడియోను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు. ఖలిస్థాన్ మూకలపై చర్యలు తీసుకోవడంలో నూతన ప్రధాని మార్క్ కార్నీ పాలనలో ఎలాంటి మార్పులు వస్తాయా? లేక మునుపటి ప్రధాని జస్టిన్ ట్రూడో తరహాలోనే కొనసాగుతారా? అన్నదానిపై ఆయన సందేహం వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రులను ఖలిస్థానీలు బెదిరించడం ఇదే మొదటిసారి కాదు.ఇటీవల కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి రవనీత్ సింగ్ బిట్టూ పై హత్యాయత్నానికి ఖలిస్థాన్ మద్దతుదారులు కుట్రలు పన్నుతున్నారన్నఆరోపణలు వచ్చాయి. ఈవిషయాన్ని స్వయంగా ఆయననే వెల్లడించారు. కొందరు తనపై దాడి చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు వచ్చిన స్క్రీన్‌షాట్‌లు తన దృష్టికి వచ్చాయని చెప్పారు.

వివరాలు 

అమిత్ షాపై 'వారిస్ పంజాబ్ దే' వ్యక్తిగత కక్ష

అలాగే కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై కూడా 'వారిస్ పంజాబ్ దే' అనే ఖలిస్థానీ సంస్థ నేతలు వ్యక్తిగత కక్ష పెంచుకున్నారని తెలుస్తోంది. ఖలిస్థాన్ మద్దతుదారుల వల్ల కేంద్ర నాయకులు క్షోభకు లోనవుతున్నారు.