LOADING...
China-USA: అమెరికాకు స్ట్రాంగ్ వార్నింగ్‌ ఇచ్చిన చైనా.. తమ విషయంలో జోక్యం చేసుకోవదంటూ హెచ్చరికలు .. 
తమ విషయంలో జోక్యం చేసుకోవదంటూ హెచ్చరికలు ..

China-USA: అమెరికాకు స్ట్రాంగ్ వార్నింగ్‌ ఇచ్చిన చైనా.. తమ విషయంలో జోక్యం చేసుకోవదంటూ హెచ్చరికలు .. 

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 11, 2025
09:55 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికాకు చైనా కఠిన హెచ్చరికలు జారీ చేసింది. తమ దేశీయ విషయాల్లో ఎవరూ జోక్యం చేసుకోవద్దని, ఇతర దేశాలు వారి స్వతంత్ర నిర్ణయాలను గౌరవించాల్సిందని చైనా స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో బుధవారం అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సేత్, చైనా రక్షణ మంత్రి డాంగ్ జున్ వర్చువల్ సమావేశంలో పాల్గొని కీలక అంశాలపై సంభాషించారు. ముఖ్యంగా ఇటీవల నేపాల్‌లో ఏర్పడిన పరిస్థితులు, అంతర్జాతీయ స్థితిగతులపై వివిధ అంశాలను విపులంగా చర్చించారు.

వివరాలు 

దక్షిణ చైనా సముద్రంలో ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టే చర్యలు 

డాంగ్ జున్ తైవాన్‌ను చైనా భూభాగంగా స్పష్టంగా పేర్కొనగా, ఇతర దేశాలు ఈ విషయం మీద వ్యతిరేక ప్రవర్తనలు చూపకుండా ఉండాలని అమెరికాకు సూచించారు. స్వాతంత్ర్యానికి మద్దతు ఇస్తున్నామంటూ చైనాను అదుపు చేసేందుకు తైవాన్‌ను పావుగా ఉపయోగించుకోవాలని చూడొద్దని డాంగ్‌ పేర్కొన్నారు. కొన్ని విదేశీ దేశాలు దక్షిణ చైనా సముద్రంలో ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టే చర్యలను చేపడుతున్నాయని ఆయన విమర్శించారు. ఈ విధమైన ప్రవర్తన ద్వారా ప్రపంచ శాంతిని భంగపరచడానికి ప్రయత్నిస్తున్నారని తీవ్రంగా ఖండించారు.

వివరాలు 

 చైనా-అమెరికా చర్చలు అద్భుతంగా జరిగాయి: సీన్ పార్నెల్

చైనా,అమెరికాకు మధ్య సైనిక సంబంధాలు సమానమైన, గౌరవప్రదమైన, శాంతియుతమైనదిగా ఉండాలని డాంగ్ జున్ అభిలషించారు. పరస్పరం ప్రయోజనాలు గౌరవించాలని ఆయన పిలుపునిచ్చారు. పెంట్‌గాన్ ప్రతినిధి సీన్ పార్నెల్ మాట్లాడుతూ చైనా-అమెరికా చర్చలు అద్భుతంగా జరిగాయని తెలిపారు. ఏ విధమైన వివాదాన్నీ కోరుకోవడం లేదని, చైనాలో పాలన మార్పులపై ఎలాంటి ఆదేశాలు ఇవ్వడం లేదని స్పష్టం చేశారు. అమెరికా రక్షణ మంత్రి హెగ్సేత్ ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో చైనా ఆధిపత్యాన్ని ఖండిస్తూ, తైవాన్ సముద్రంలో శాంతిని కాపాడే విధంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అంతర్జాతీయ జలాల్లో ప్రతి దేశానికి సమాన హక్కులు ఉండాలని స్పష్టం చేశారు. రెండు దేశాల మధ్య భవిష్యత్ చర్చలు కొనసాగించాలని ఇద్దరు మంత్రులు అంగీకరించారు.

వివరాలు 

చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో ద్వైపాక్షిక భేటీ

ఇదే సమయంలో, రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు భారత్‌తో పాటు చైనాపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో చైనా, అమెరికా నేతల మధ్య చర్చలు జరగడం గమనార్హం. మరోవైపు అక్టోబరులో దక్షిణ కొరియాలో జరగనున్న ఆసియా-పసిఫిక్ ఆర్థిక సహకార (APEC) వాణిజ్య మంత్రుల సమావేశానికి ట్రంప్ హాజరు అవ్వనున్నారు. ఈ సందర్బంగా, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో ద్వైపాక్షిక భేటీ కూడా జరిగే అవకాశముంది అని వైట్ హౌస్ వర్గాలు వెల్లడించాయి.