China: హిందూ మహాసముద్రం భద్రతపై ఆందోళన పెరిగిన వేళ.. పాక్ తో కలిసి నౌకాదళ విన్యాసాల్లో పాల్గొన్న చైనా
ఈ వార్తాకథనం ఏంటి
పాకిస్థాన్ (Pakistan) నిర్వహిస్తున్న అమన్-2025 యుద్ధ విన్యాసాల్లో తాజాగా చైనా (China) కూడా భాగస్వామి అయింది.
హిందూ మహాసముద్రంలో చైనా ప్రభావం పెరుగుతున్న ఈ తరుణంలో, ఈ పరిణామాలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి.
ఫిబ్రవరి 7-12 మధ్య జరుగుతున్న ఈ విన్యాసాల్లో మొత్తం 32 దేశాలు పాల్గొన్నాయి. ఇందులో అమెరికా, జపాన్, ఇటలీ, మలేషియా వంటి దేశాలతో పాటు చైనా కూడా ఉంది.
ఈ విన్యాసాల్లో చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ నేవీకి చెందిన గైడెడ్ మిసైల్ డెస్ట్రాయర్,హెలికాప్టర్, మెరైన్ దళాలు పాల్గొన్నాయి.
అంతేకాక,చైనా సీనియర్ మిలిటరీ అధికారులు కూడా హాజరయ్యారు.
హిందూ మహాసముద్రంలో దొంగిలింపులు అరికట్టడం,సముద్ర మార్గాల భద్రతను మెరుగుపర్చడం వంటి కార్యక్రమాలకు ఈ విన్యాసాలు తోడ్పడతాయని అధికారులు తెలిపారు.
వివరాలు
అరేబియా సముద్రంలో చైనాకు చెందిన రెండు భారీ నౌకలు
ఇటీవలే,మత్స్య పరిశోధన పేరుతో చైనాకు చెందిన రెండు భారీనౌకలు అరేబియా సముద్రంలో ప్రవేశించాయి.
వీటిని లాన్‌హై 101,లాన్‌హై 201గా గుర్తించారు.ఈఅంశాన్ని ఓపెన్ ఇంటెలిజెన్స్ నిపుణుడు డామియన్ సైమన్ తన ఎక్స్ ఖాతాలో వెల్లడించారు.
మాల్దీవుల్లోని చైనా అనుకూల ప్రభుత్వ అనుమతితోనే ఈనౌకలు అక్కడకి వెళ్లినట్లు సమాచారం.
నిపుణుల అభిప్రాయానికి అనుసరించి,మారిటైమ్ ఇంటెలిజెన్స్ సేకరణ కోసమే బీజింగ్ వీటిని పంపినట్లు అనుమానిస్తున్నారు.
ఈ నౌకలు మత్స్యకారుల బోట్ల ద్వారా మిలిటరీకి అవసరమైన సమాచారాన్నిసేకరిస్తున్నట్లు భావిస్తున్నారు.
లాన్‌హై 101 నౌకలో అండర్ వాటర్ డ్రోన్లు,రిమోట్ వెస్సల్స్ కూడా ఉన్నట్లు అనుమానిస్తున్నారు.
ఇవి సముద్ర గర్భాన్ని మ్యాపింగ్ చేసే సామర్థ్యం కలిగినవని చెబుతున్నారు.ఇప్పటికే చైనా ఫిషింగ్ బోట్ల ప్రవేశాన్ని నిరోధించాలని పాకిస్తాన్,శ్రీలంకల మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేశారు.