LOADING...
US Elections 2024:  డిక్స్‌విల్లే నాచ్‌లో తొలి ఫలితం.. ట్రంప్,కమలా హారిస్ కి చెరో మూడు ఓట్లు  
డిక్స్‌విల్లే నాచ్‌లో తొలి ఫలితం.. ట్రంప్,కమలా హారిస్ కి చెరో మూడు ఓట్లు

US Elections 2024:  డిక్స్‌విల్లే నాచ్‌లో తొలి ఫలితం.. ట్రంప్,కమలా హారిస్ కి చెరో మూడు ఓట్లు  

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 05, 2024
05:18 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికాలో అధ్యక్ష ఎన్నికల (US Elections) పోలింగ్‌ ప్రారంభమైంది. పోలింగ్‌ తేదీ (నవంబర్‌ 5) మొదలైన కొద్ది గంటలకే అక్కడి ఓ చిన్న కౌంటీలో కౌంటింగ్‌ కూడా పూర్తయింది. న్యూహ్యాంప్‌షైర్‌ రాష్ట్రంలోని డిక్స్‌విల్లే నాచ్‌లో తొలి ఫలితం వెలువడింది. ఇక్కడ మొత్తం ఆరుగురు ఓటర్లు ఉన్నారు. వీరిలో డెమోక్రటిక్‌ అభ్యర్థి కమలా హారిస్‌ (Kamala Harris)కు మూడు, రిపబ్లికన్‌ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump)కు మూడు ఓట్లు వచ్చాయి. 2020లో మాత్రం డిక్స్‌విల్లే నాచ్‌ లోని ఓటర్లు డెమోక్రటిక్‌ అభ్యర్థి జో బైడెన్‌ (Joe Biden)కు మద్దతు ఇచ్చారు, అతనే ఆ ఎన్నికల్లో గెలిచాడు.

వివరాలు 

1960 నుంచి అర్ధరాత్రి ఓటు హక్కు

డిక్స్‌విల్లే నాచ్‌ (Dixville Notch) అమెరికా-కెనడా సరిహద్దులో ఉన్న చిన్న గ్రామం. ఇక్కడ ప్రస్తుతం ఆరుగురు ఓటర్లు మాత్రమే ఉన్నారు, వారిలో నలుగురు రిపబ్లికన్‌ పార్టీ తరఫున నమోదు చేసుకున్నారు, మరో ఇద్దరు మాత్రం ఎలాంటి పార్టీకి చెందినవారు కారు. ఎలక్షన్‌ డే (US Election Day) ప్రారంభమైన వెంటనే, ఈవేళ ఆరుగురు ఓటర్లు స్థానిక పోలింగ్‌ కేంద్రంలో జాతీయ గీతం ఆలపించి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 15 నిమిషాల తరువాత ఫలితాలను ప్రకటించారు. 1960 నుంచి అర్ధరాత్రి ఓటు హక్కు వినియోగించే సంప్రదాయం ఇక్కడ కొనసాగుతోంది. దీంతో, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తొలితెలుపు ఫలితం ఇక్కడ నుండే వెలువడుతుంది.