LOADING...
'Act of war': పొరుగు దేశం గగనతలంలో రష్యా డ్రోన్లు.. హై అలర్ట్‌లో పోలాండ్
పొరుగు దేశం గగనతలంలో రష్యా డ్రోన్లు.. హై అలర్ట్‌లో పోలాండ్

'Act of war': పొరుగు దేశం గగనతలంలో రష్యా డ్రోన్లు.. హై అలర్ట్‌లో పోలాండ్

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 10, 2025
11:24 am

ఈ వార్తాకథనం ఏంటి

రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం సంవత్సరాలుగా తరబడి హోరాహోరీగా కొనసాగుతోంది. 2022 ఫిబ్రవరి 24వ తేదీన ఆరంభమైన ఈ యుద్ధానికి అంతం అనేది ఉండట్లేదు. ఇన్ని రోజులుగా నిరాటంకంగా ఈ రెండు దేశాలు తలపడుతూనే వస్తోన్నాయి. నువ్వా-నేనా అన్నట్లు సాగుతున్న ఈ పోరులో ఉక్రెయిన్‌లోని పలు నగరాలు ధ్వంసం అయ్యాయి. వందలవేల మంది ప్రాణాలు కోల్పోడమే కాకుండా, భారీ స్థాయిలో ఆస్తి నష్టం కూడా సంభవించింది. అయ్యినప్పటికీ ఏ దేశం కూడా వెనక్కి తగ్గడానికి సిద్దంగా లేదు. ఉక్రెయిన్ తూర్పు ప్రాంతంలోని అనేక నగరాలు ఇప్పటికే రష్యా సైనికుల నియంత్రణలోకి వచ్చాయి. అయితే, రష్యా సైన్యం కూడా ఉక్రెయిన్‌ను సులభంగా జయించలేకపోతుంది.

వివరాలు 

పోలాండ్ గగనతలంలోకి రష్యా డ్రోన్లు,యుద్ధ విమానాలు

అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్, ఆస్ట్రేలియా,యూరోపియన్ యూనియన్ దేశాలు అందిస్తున్న అత్యాధునిక ఆయుధాలు, యుద్ధ సామాగ్రి రష్యా దూకుడుకు అడ్డుపడుతున్నాయి. ఈ కారణంగా, రష్యా ఆధీనంలోని కొన్ని కీలక నగరాలను ఉక్రెయిన్ తిరిగి స్వాధీనం చేసుకోవడం సాధ్యమయ్యింది. ఈ యుద్ధం మరింత విస్తరించినట్టే తాజా సూచనలు చెబుతున్నాయి. పోలాండ్ గగనతలంలోకి రష్యా డ్రోన్లు,యుద్ధ విమానాలు ప్రవేశించడమే దీనికి సాక్ష్యంగా ఉంది. పోలెండ్ సైన్యం వీటిని కూల్చివేసినట్లు ప్రకటించింది. తమ గగనతలాన్ని పలు సందర్భాలలో డ్రోన్ తరహా వస్తువులు ఉల్లంఘించాయని, వాటిని నిరోధించడంలో కొనసాగుతున్నట్లు పోలండ్ ఆపరేషనల్ కమాండ్ తెలిపింది.

వివరాలు 

పోలెండ్'లో మూతపడిన  నాలుగు ప్రధాన విమానాశ్రయాలు 

పోలెండ్,ఉక్రెయిన్‌తో సరిహద్దులు పంచుకుంటూ ఉంది.ఈ సరిహద్దుల్లో పశ్చిమ ఉక్రెయిన్ ప్రాంతాలపై వైమానిక దాడులు జరుగుతూ,కొన్ని డ్రోన్లు పోలెండ్ ప్రాంతంలోకి ప్రవేశించాయి. వాటిని వెంటనే ధ్వంసం చేసినట్లు పోలండ్ సైన్యం వెల్లడించింది.తమ దేశ గగనతలను రక్షించేందుకు ఈ చర్యలు అవసరమైందని వారు వివరించారు. అంతేకాదు, రష్యా డ్రోన్లను అడ్డుకోవడానికి మిత్ర దేశాల ఎయిర్ క్రాఫ్ట్‌లను కూడా మోహరించినట్టు పేర్కొన్నారు. ఈ క్రమంలో పోలెండ్'లో నాలుగు ప్రధాన విమానాశ్రయాలు మూతపడ్డాయి. వార్సా అంతర్జాతీయ విమానాశ్రయం,రెస్జోవ్-జాసియోంకా,వార్సా మోడ్లిన్,లబ్లిన్ ఎయిర్ పోర్టులు అందులో భాగం. యూఎస్ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్(FAA)కూడా ఎయిర్‌మెన్ నోటీసులు(NOTAM)జారీ చేసింది. నాటో కూడా రష్యా డ్రోన్లు పోలెండ్ గగనతలంలోకి ప్రవేశించడం తగదు అని పేర్కొంది.జామోస్క్ నగరం పరిస్థితి ముప్పుగా మారినట్లు ఆందోళన వ్యక్తం చేసింది.