Trump: ఉక్కు, అల్యూమినియం దిగుమతులపై.. 25 శాతం దిగుమతి సుంకం పెంపు
ఈ వార్తాకథనం ఏంటి
ఇటీవల జరిగిన అమెరికా ఎన్నికల సమయంలోనే డొనాల్డ్ ట్రంప్ తన పాలన ఎలా ఉంటుందో సూచనలు ఇచ్చారు.
గడచిన నెల 20న రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత, ఆయన వివాదాస్పద నిర్ణయాలతో ముందుకు సాగుతున్నారు.
ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు అమెరికా ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి.
ముఖ్యంగా, కెనడా, మెక్సికో, చైనా దేశాలపై దిగుమతి సుంకాలను భారీగా పెంచి, వాణిజ్య యుద్ధానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే.
తాజాగా, ట్రంప్ మరో కీలక ప్రకటన చేశారు. ఈసారి అమెరికా దిగుమతి చేసుకునే ఉక్కు, అల్యూమినియం ఉత్పత్తులపై 25 శాతం అదనపు సుంకాలు విధిస్తున్నట్లు వెల్లడించారు.
ప్రస్తుతం అమలులో ఉన్న సుంకాలకు తోడు ఇవి అదనంగా ఉంటాయని,ఈ వారంలోనే అమల్లోకి రానున్నాయని స్పష్టం చేశారు.
vivaralu
మా నుండి వసూలు చేస్తే, మేము వారి నుండి వసూలు చేస్తాం
న్యూఒర్లియన్స్ వెళ్లే ముందు ఆదివారం మీడియాతో మాట్లాడిన ట్రంప్, మంగళవారం నాటికి పరస్పర సుంకాల విధింపును ప్రకటిస్తానని, ఇవి తక్షణమే అమల్లోకి వస్తాయని తెలిపారు.
అయితే, ఈ సుంకాలు ముఖ్యంగా ఏ దేశాలను లక్ష్యంగా చేసుకున్నాయో ఆయన చెప్పలేదు.
కానీ, అమెరికా కూడా ఇతర దేశాలు విధించే సుంకాల రేట్లను సమానంగా అమలు చేస్తుందని, ఇది అన్ని దేశాలకు వర్తిస్తుందని స్పష్టం చేశారు.
"మా నుండి వసూలు చేస్తే, మేము వారి నుండి వసూలు చేస్తాం" అంటూ తన పరస్పర సుంకాల విధానాన్ని హాస్యస్ఫూర్తితో వివరించారు.
vivaralu
ఇంతకు ముందు ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు:
ట్రంప్ తన మొదటి అధ్యక్ష పదవీకాలంలో కూడా ఉక్కు దిగుమతిపై 25 శాతం,అల్యూమినియంపై 10 శాతం సుంకాలు విధించారు.
అయితే, అప్పట్లో కెనడా, మెక్సికో, బ్రెజిల్ వంటి వాణిజ్య భాగస్వామ్య దేశాలకు మినహాయింపు ఇచ్చారు.
తర్వాత జో బైడెన్ అధికారంలోకి వచ్చాక ఈ కోటాను కొనసాగించారు.
కానీ, ట్రంప్ మరోసారి ఈ సుంకాలను పెంచేందుకు సిద్ధమవుతుండటంతో, కెనడా, మెక్సికో దేశాలపై దీని ప్రభావం తీవ్రంగా పడనుంది.
అధికారిక గణాంకాల ప్రకారం,అమెరికా ఉక్కు దిగుమతుల్లో ప్రధాన భాగం కెనడా, మెక్సికో, బ్రెజిల్ దేశాల నుంచే జరుగుతోంది.
దక్షిణ కొరియా, వియత్నాం తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
అల్యూమినియం విషయానికి వస్తే, కెనడానే ప్రధాన సరఫరాదారు.
వివరాలు
ఇక ట్రంప్ కొత్త వ్యూహంపై స్పష్టత ఎప్పుడొస్తుంది?
2024లోని మొదటి 11 నెలల్లో అమెరికా దిగుమతులలో 79 శాతం అల్యూమినియం కెనడా నుంచే వచ్చింది. మెక్సికో తర్వాతి స్థానంలో ఉంది.
పరస్పర సుంకాల విధింపు గురించి మంగళవారం లేదా బుధవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి పూర్తి వివరాలు వెల్లడిస్తానని ట్రంప్ తెలిపారు.
ముఖ్యంగా, ఆటోమొబైల్ దిగుమతుల విషయంలో ఐరోపా సమాఖ్య విధిస్తున్న 10 శాతం సుంకాలు, అమెరికన్ కార్లపై ఉన్న 2.5 శాతం సుంకాలతో పోల్చితే చాలా ఎక్కువగా ఉన్నాయని ట్రంప్ పదే పదే అంటున్నారు.
"ఐరోపా దేశాలు అమెరికా కార్లను పెద్దగా కొనడం లేదు, కానీ అట్లాంటిక్ మహాసముద్రం మీదుగా లక్షల సంఖ్యలో తమ కార్లను అమెరికాలో అమ్ముతున్నాయి" అని ఆయన తరుచూ ఆరోపిస్తున్నారు.