LOADING...
Jailer 2: 'జైలర్ 2'లో షారుఖ్ స్థానంలో పవన్ కళ్యాణ్? రజినీకాంత్ మూవీపై కొత్త అప్డేట్!
'జైలర్ 2'లో షారుఖ్ స్థానంలో పవన్ కళ్యాణ్? రజినీకాంత్ మూవీపై కొత్త అప్డేట్!

Jailer 2: 'జైలర్ 2'లో షారుఖ్ స్థానంలో పవన్ కళ్యాణ్? రజినీకాంత్ మూవీపై కొత్త అప్డేట్!

వ్రాసిన వారు Moogati Shabari
Apr 11, 2026
12:33 pm

ఈ వార్తాకథనం ఏంటి

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన 'కూలీ' చిత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేకపోవడంతో, ఇప్పుడు ప్రేక్షకుల దృష్టి పూర్తిగా 'జైలర్ 2'పై పడింది. తొలి భాగంలో మోహన్ లాల్, శివరాజ్‌లాంటి నటులను అతిథి పాత్రల్లో చూపించి ఆకట్టుకున్న దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్, ఈ సీక్వెల్‌ను భారీగా తీర్చిదిద్దాలని చూస్తున్నారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్, టాలీవుడ్ ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ పేర్లు ఈ చిత్రానికి సంబంధించి వినిపించాయి. అయితే తాజా సమాచారం ప్రకారం షారుఖ్ ఖాన్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారని ప్రచారం జరుగుతోంది. తన తదుపరి చిత్రం 'కింగ్'లో కనిపించే లుక్ ముందుగా బయటకు రావద్దనే ఉద్దేశంతోనే షారుఖ్ ఈ నిర్ణయం తీసుకున్నారని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.

వివరాలు

ఆ కలయిక అదుర్స్..

ఇదే సమయంలో మరో ఆసక్తికరమైన వార్త ఏమిటంటే, షారుఖ్ స్థానంలో టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను అతిథి పాత్ర కోసం సంప్రదించినట్లు సోషల్ మీడియాలో వార్తలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న పవన్ కళ్యాణ్, షెడ్యూల్స్ సరిపోతే సినిమాల్లో నటిస్తానని ముందుగా పేర్కొన్నారు. ఈ క్రమంలో దర్శకుడు నెల్సన్ స్పష్టమైన ప్రణాళికతో పవన్‌ను ఒప్పించే ప్రయత్నంలో ఉన్నారని తెలుస్తోంది. ఒకవేళ రజినీకాంత్, పవన్ కళ్యాణ్ ఒకే సన్నివేశంలో కనిపిస్తే థియేటర్లలో భారీ స్పందన రావడం ఖాయం అని అభిమానులు ఉత్సాహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ విషయంపై చిత్ర బృందం నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

Advertisement