
Pahalgam terror attack: ఉగ్రవాదంపై కఠిన చర్యలు తీసుకుంటామని అఖిలపక్ష నేతలకు సర్కారు హామీ: కిరణ్ రిజిజు
ఈ వార్తాకథనం ఏంటి
ఉగ్రవాదాన్ని ఎదుర్కొనడంలో కఠినమైనచర్యలు తప్పనిసరని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఇటీవల జరిగిన పహల్గాం ఉగ్రదాడిపై అఖిలపక్ష సమావేశం నిర్వహించిన అనంతరం,దాని వివరాలను కేంద్ర మంత్రి కిరెణ్ రిజిజు మీడియాతో పంచుకున్నారు.
"జమ్ముకశ్మీర్ ఆర్థికంగా పునరుజ్జీవించుతూ,పర్యాటకం గణనీయంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో ఈ దాడి జరిగింది.ఈ దాడి లక్ష్యం అక్కడి శాంతియుత పరిస్థితులను దెబ్బతీయడమే.ఈ ఘటనకు సంబంధించిన సమాచారం,దానిని తక్షణమేఎదుర్కొనడంలో తీసుకున్నచర్యలపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్ని పార్టీల నేతలకు వివరించారు.దాడికి దారితీసిన భద్రతాపరమైన లోపాలు,తద్వారా పునరావృతం కాకుండా తీసుకుంటున్న జాగ్రత్తల గురించి ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు,హోంశాఖ అధికారులు సమగ్రంగా వివరించారు.అన్ని రాజకీయ పార్టీల నేతలు ఉగ్రవాదంపై పోరాటంలో కేంద్రానికి తమ సంపూర్ణ మద్దతు ఉందని హామీ ఇచ్చారు,"అని రిజిజు తెలిపారు.
వివరాలు
సమావేశం ప్రారంభానికి ముందు.. రెండు నిమిషాల పాటు మౌనం
ఈ అఖిలపక్ష సమావేశం పార్లమెంట్ భవన సముదాయంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలో నిర్వహించారు.
సమావేశం ప్రారంభానికి ముందు,పహల్గాం దాడిలో అమరులైన వారికి ఘనంగా నివాళులు అర్పిస్తూ, నేతలంతా రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు.
ఈ సమావేశంలో హాజరైన ప్రముఖులలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు ఎస్. జైశంకర్, నిర్మలా సీతారామన్, కిరణ్ రిజిజు, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీతో పాటు వివిధ పార్టీలకు చెందిన కీలక నాయకులు ఉన్నారు.
వివరాలు
కేంద్రం తీసుకునే ప్రతీ చర్యకు మా పూర్తి మద్దతు: రాహుల్
ఈ సందర్భంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ, "పహల్గాం ఉగ్రదాడిని మేమంతా ఒక్క మాటగా తీవ్రంగా ఖండిస్తున్నాం. కేంద్రం తీసుకునే ప్రతీ చర్యకు మేము పూర్తిగా మద్దతు ఇస్తాం" అని స్పష్టం చేశారు.
అదే విధంగా, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ, "కశ్మీర్‌లో శాంతియుత వాతావరణాన్ని పునరుద్ధరించేందుకు కేంద్రం తగిన చర్యలు తీసుకోవాలని మేము కోరుతున్నాం" అన్నారు.
టీఎంసీ నేత సుదీప్ బందోపాధ్యాయ మాట్లాడుతూ, "ఉగ్రవాదానికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం తీసుకునే చర్యల్లో మేము పూర్తిగా వెన్నంటి నిలుస్తాం. అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్ని పార్టీల నేతలతో త్వరితగతిన సమావేశం నిర్వహించాలని మా డిమాండ్" అని పేర్కొన్నారు.