LOADING...
Nepal protests: నేపాల్‌లో ఆందోళనలు.. గతంలో శ్రీలంక,పాకిస్తాన్,బంగ్లాదేశ్‌లో కూడా ఇదే పరిస్థితి..
నేపాల్‌లో ఆందోళనలు.. గతంలో శ్రీలంక,పాకిస్తాన్,బంగ్లాదేశ్‌లో కూడా ఇదే పరిస్థితి..

Nepal protests: నేపాల్‌లో ఆందోళనలు.. గతంలో శ్రీలంక,పాకిస్తాన్,బంగ్లాదేశ్‌లో కూడా ఇదే పరిస్థితి..

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 09, 2025
05:17 pm

ఈ వార్తాకథనం ఏంటి

గత మూడేళ్లుగా, భారత్ మాత్రమే కాకుండా భారత్ సరిహద్దులో ఉన్న అన్ని దేశాల్లో కూడా హింసాత్మక సంఘటనలు క్రమంగా జరుగుతున్నాయి. ఈ సంఘటనల వల్ల ఆ దేశాలలో ప్రభుత్వ మార్పులు చోటుచేసుకున్నాయి. శ్రీలంక, పాకిస్థాన్, బంగ్లాదేశ్, మయన్మార్, తాజాగా నేపాల్ వంటి దేశాలు ఇలా వరసగా అల్లర్లతో అట్టుడుకుతున్నాయి.

వివరాలు 

నేపాల్: 

నేపాల్‌లో ప్రభుత్వం కొన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్‌లను నిషేధించగా,యువత పెద్ద ఎత్తున దీనిపై నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నిరసనలు మొదట శాంతియుతంగా ప్రారంభమైనప్పటికీ, తర్వాత హింసాత్మక అల్లర్లుగా మారాయి. ఆందోళనకారులు దేశ సుప్రీంకోర్టు, పార్లమెంట్, అలాగే అధ్యక్షుడు, ప్రధానిమంత్రి నివాసాలను చుట్టుముట్టి దాడులు చేశారు. ఈ అల్లర్లలో ఇప్పటివరకు 20 మంది నిరసనకారులు మరణించారు. చివరికి, తీవ్ర ఆందోళనల కారణంగా నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ రాజీనామా చేయాల్సి వచ్చింది. కొన్ని వర్గాల ప్రకారం, ఆయన దేశం విడిచి పారిపోయే పరిస్థితి కూడా ఏర్పడినట్టు చెప్పారు.

వివరాలు 

బంగ్లాదేశ్:

2024లో బంగ్లాదేశ్‌లో, ప్రధాని షేక్ హసీనా ప్రభుత్వాన్ని విరోధిస్తూ, విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. ఆందోళనకారులు ప్రధానిమంత్రి నివాసాన్ని చుట్టుముట్టడంతో, షేక్ హసీనా భారతదేశానికి పారిపోయి రావాల్సి వచ్చింది అయితే, ఈ అల్లర్లను పూర్తిగా మతోన్మాద శక్తులు ఆధీనంలోకి తీసుకున్నాయి షేక్ హసీనా దేశం వదిలిన తరువాత, హిందువులతో పాటు మైనారిటీలపై పెద్ద ఎత్తున హత్యలు, అత్యాచారాలు చోటు చేసుకున్నాయి అంతేకాకుండా వారి ఆలయాలు, ఆస్తులు, వ్యాపారాలను రాడికల్ ఇస్లామిస్టులు దాడి చేసి ధ్వంసం చేశారు.

వివరాలు 

శ్రీలంక 

2022లో ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో, శ్రీలంకలో పెద్ద ఎత్తున ఉద్యమాలు ప్రారంభమయ్యాయి. అప్పటి అధ్యక్షుడు గొటబయ రాజపక్సే దేశం వదిలి పారిపోయే స్థితికి రావడంతో పరిస్థితి తీవ్రతరమైంది. నేపాల్‌ తరహా పరిస్థితిలో, ఈ దేశంలోనూ యువత నేతృత్వంలో ఆందోళనలు జరిగాయి. అధ్యక్షుడి నివాసంలోకి చేరిన ఆందోళనకారులు ఆస్తులను దోచుకొని వెళ్లారు. ఈ విధంగా, నేపాల్, బంగ్లాదేశ్‌లో జరిగినట్లే శ్రీలంకలో కూడా యువత ప్రధానంగా ఉద్యమాలను నడిపించారు.

వివరాలు 

పాకిస్థాన్ 

పాకిస్థాన్ లో ప్రజాస్వామ్యం బయటకు కనిపించినా, వాస్తవంలో ప్రధానంగా సైన్యాధిపత్యమే కొనసాగుతుందన్న నిజం అందరికి తెలిసిందే. 2022లో ఇమ్రాన్ ఖాన్‌ను అవిశ్వాస తీర్మానంతో గద్దె దించారు. అప్పటినుండి ఆయన పార్టీ, పాకిస్తాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ (పీటీఐ) కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసనలు చేపడుతున్నారు. అయితే, ఎప్పటికప్పుడు అక్కడి సైన్యం ఈ నిరసనలను అణిచివేసే ప్రయత్నాలు చేస్తోంది.