
Dasara Navaratri 2025: భారతదేశంలో వివిధ రాష్ట్రాల్లో దసరా నవరాత్రి ఉత్సవాలను జరుపుకునే విధానాలు
ఈ వార్తాకథనం ఏంటి
దసరా నవరాత్రులు వచ్చేస్తున్నాయి. నవరాత్రుల్లో దుర్గామాత అమ్మవారిని పూజిస్తారు. ఈ సంవత్సరం సెప్టెంబర్ 22వ తేదీ నుండి నవరాత్రులు ప్రారంభమయ్యి అక్టోబర్ 2వ తేదీన ఉత్సవాలు ముగుస్తాయి. భారతదేశంలో ఒక్కో రాష్ట్రంలో నవరాత్రి ఉత్సవాలు ఒక్కో విధంగా జరుగుతాయి. ప్రస్తుతం ఏయే రాష్ట్రాల్లో ఎలా జరుగుతుందో ఇక్కడ తెలుసుకుందాం. తెలంగాణ: తెలంగాణలో నవరాత్రి ఉత్సవాల్లో బతుకమ్మ పండగ జరుపుకుంటారు. తొమ్మిది రోజులపాటు రకరకాల పూలతో బతుకమ్మను పేర్చి ఆటలు ఆడుతూ దగ్గర్లోని చెరువులో బతుకమ్మను నిమజ్జనం చేస్తారు. తొమ్మిది రోజుల బతుకమ్మ పూర్తయిన తర్వాత దసరా పండుగను జరుపుకుంటారు.
వివరాలు
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్ లో దుర్గామాత అమ్మవారి ఆలయాల్లో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. ముఖ్యంగా విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో ఉత్సవాలు అంబరాన్ని అంటుతాయి. తొమ్మిది రోజులపాటు తొమ్మిది అవతారాల్లో కనకదుర్గ దర్శనమిస్తుంది. తమిళనాడు: తమిళనాడులో దసరా నవరాత్రి ఉత్సవాల్లో దుర్గ మాత, లక్ష్మీ, సరస్వతి దేవతలను పూజిస్తారు. బంధువులు, స్నేహితులను ఇంటికి ఆహ్వానించి పండగను జరుపుకుంటారు. తమిళనాడులో ప్రత్యేకంగా కోలు అలంకరణ చేస్తారు. కోలు అంటే 9మెట్లు. ఒక్కో మెట్టు ఒక్కో రాత్రిని సూచిస్తుంది. ఈ మెట్ల మీద రకరకాల బొమ్మలు, దేవుడి ప్రతిమలు ఉంచుతారు.
వివరాలు
కర్ణాటక
కర్ణాటకలో దసరా రోజున పురాణాల్లోని కథలను యక్షగానం రూపంలో చెబుతుంటారు. ఈ సాంప్రదాయం ఎన్నో ఏళ్లుగా ఇక్కడ అలవాటుగా ఉంది. కేరళ: కేరళలో విజయదశమిని విద్యారంభం పర్వదినంగా జరుపుకుంటారు. ఈరోజున చిన్నపిల్లలకు చదువు నేర్పించడం మొదలుపెడతారు. గుజరాత్: గుజరాత్ 'లో నవరాత్రి ఉత్సవాలు దుర్గామాత అమ్మవారిని పూజిస్తారు. నవరాత్రుల సమయంలో గార్బా డ్యాన్స్, దాండియా ఆటలు ఆడతారు. పశ్చిమ బెంగాల్, అస్సాం: పశ్చిమ బెంగాల్, అస్సాం రాష్ట్రాల్లో దసరా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. దుర్గాపూజ నిర్వహించడం, సింహం మీద కూర్చున్న దుర్గామాత విగ్రహాలను ప్రతిష్టించి పూజించడం చేస్తారు.