NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / లైఫ్-స్టైల్ వార్తలు / Tourism : మన దేశంలో ఉన్నన్ని రూరల్ టూరిస్ట్ స్పాట్లు.. మరే దేశంలోనూ లేవు
    తదుపరి వార్తా కథనం
    Tourism : మన దేశంలో ఉన్నన్ని రూరల్ టూరిస్ట్ స్పాట్లు.. మరే దేశంలోనూ లేవు
    మన దేశంలో ఉన్నన్ని రూరల్ టూరిస్ట్ స్పాట్లు.. మరే దేశంలోనూ లేవు

    Tourism : మన దేశంలో ఉన్నన్ని రూరల్ టూరిస్ట్ స్పాట్లు.. మరే దేశంలోనూ లేవు

    వ్రాసిన వారు Sirish Praharaju
    Oct 15, 2024
    07:07 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    భారతదేశ టూరిజం అంటే సాధారణంగా గోవా, ఊటీ, షిమ్లా వంటి ప్రసిద్ధ పర్యాటక స్థలాలను సందర్శించడం అనుకుంటారు.

    కానీ, సాంప్రదాయ భారతదేశాన్ని మరింత లోతుగా అనుభవించాలంటే ప్రజలు ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలకు కాకుండా గ్రామాలకు ప్రయాణం చేయాలి. దీన్నే "రూరల్ టూరిజం" అంటారు.

    ఈ కొత్త కాన్సెప్ట్ ఇప్పుడు బాగా ప్రాచుర్యం పొందుతోంది. విదేశీ పర్యాటకులు పెద్ద సంఖ్యలో మనదేశంలోని పల్లెలను సందర్శిస్తూ, భారతదేశ సాంస్కృతిక మూలాలను తెలుసుకుంటున్నారు.

    వివరాలు 

    పెరుగుతున్న పర్యాటకుల సంఖ్య

    గ్రామాలలో ప్రకృతి అందాలను, కళలను, సంప్రదాయాలను అనుభవించేందుకు ప్రభుత్వం రూరల్ టూరిజాన్ని అభివృద్ధి చేస్తోంది.

    ప్రపంచంలో ఏ ఇతర దేశంలోనూ ఇన్ని రూరల్ టూరిస్ట్ స్పాట్స్ లేవు. అందుకే ప్రపంచం నలుమూలల నుంచి మన గ్రామాలను సందర్శించే పర్యాటకుల సంఖ్య పెరుగుతోంది.

    పల్లె జీవనాన్ని అనుభవించి, సాంప్రదాయ వంటకాలను రుచి చూసే అవకాశాన్ని ఈ పర్యాటకులు ఆస్వాదిస్తున్నారు.

    "భారతదేశపు ఆత్మ పల్లెలో ఉంది" అనే గాంధీ గారి మాటను నిజం చేస్తూ, సిటీలను వదిలి గ్రామాలను సందర్శించేందుకు చాలామంది ముందుకు వస్తున్నారు.

    ఇప్పుడే కొన్ని పాపులర్ రూరల్ టూరిస్ట్ స్పాట్స్ గురించి తెలుసుకుందాం:

    #1

    మలానా

    హిమాచల్ ప్రదేశ్‌లోని కులు లోయలో ఉన్న మలానా గ్రామం ఒక పురాతన,ఆచార సంప్రదాయాలతో కూడిన ప్రాంతం.

    ఇది మనాలికి దగ్గరగా ఉండే,జనావాసాలకు దూరంగా ఒంటరిగా ఉన్న గ్రామం.మలానాకు ట్రాన్స్ పోర్ట్ సౌకర్యాలు కూడా తక్కువగా ఉన్నాయి.

    ఈ గ్రామం ప్రత్యేకత దాని వేర్వేరు సంస్కృతి. ఇక్కడి ప్రజలు పాటించే జీవన శైలి,మాట్లాడే భాష "కనిషి" ఇతర ప్రాంతాల్లో కనిపించదు, ఇది కేవలం ఇక్కడి ప్రత్యేకత.

    భిన్నమైన సంస్కృతి కారణంగా ఈ గ్రామంపై ఎన్నో డాక్యుమెంటరీలు కూడా రూపొందించబడ్డాయి.

    ఇక్కడి ప్రజలు తమ సంప్రదాయాలను గట్టిగా పాటిస్తూ,ప్రాచీన ఆచారాలను పూర్వీకుల నుండి మరచిపోకుండా కొనసాగిస్తున్నారు.

    మనాలికి వచ్చే పర్యాటకులు ఈ విభిన్న గ్రామాన్ని సందర్శించడానికి ఉత్సాహంగా ఉంటారు, మలానా విలేజ్ చూడకుండానే తిరిగి వెళ్లరు.

    #2

    హర్షిల్

    ఉత్తరాఖండ్‌లోని హర్షిల్ గ్రామం భాగీరథి నది ఒడ్డున, హిమాలయాలలోని బాపాసా లోయలో ఉంది.

    ఈ గ్రామం చుట్టూ ఎత్తైన హిమాలయ పర్వత శిఖరాలు దూరంగా కనిపిస్తూ, మనసుకు హాయినిచ్చే ప్రకృతి దృశ్యాలను అందిస్తాయి.

    హర్షిల్ ప్రాంతం నుండి మాత్రి, కేదార్​నాథ్ వంటి ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు దగ్గరలోనే ఉన్నాయి.

    ఈ ప్రాంతం చుట్టూ సహజసిద్ధంగా పెరిగిన ఆపిల్ తోటలు, శుభ్రమైన నదీ ప్రవాహాలు, మనోహరమైన జలపాతాలు, పర్వతాలతో కలిసి ప్రకృతి మూర్తిని ఆరాధించేలా ఒక అందమైన వాతావరణాన్ని కల్పిస్తాయి.

    #3

    అనెగుండి

    కర్ణాటకలోని ఈ గ్రామం రామాయణ కాలానికి చెందినది. కర్ణాటక రాష్ట్రం, కొప్పల్ జిల్లాలో ఉన్న అనెగుండి కోతుల రాజ్యం లేదా 'కిష్కింద' అని పిలుస్తారు.

    ఈ ప్రదేశం కర్ణాటకలోని ప్రసిద్ధమైన హెరిటేజ్ సైట్ అయిన హంపి కంటే కూడా పాతది.

    తుంగభద్ర నది తీరంలో ఉన్న ఈ గ్రామంలో అనేక పురాతన కట్టడాలు, దేవాలయాలు ఉన్నాయి.

    ఈ ఊరు చూడడానికి ఎంతో అందంగా ఉంటే, చరిత్రలోని అనేక ఆసక్తికర విషయాలు తెలుసుకోవడానికి ఒక మంచి ప్రదేశం.

    అనెగుండికి వచ్చే టూరిస్టులకు ఇక్కడి ఆతిథ్యం కూడా ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది.

    #4

    పుత్తూరు 

    ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఈ చిన్న గ్రామం పట్టు వ్యాపారానికి ఎంతో ప్రసిద్ధి. ఈ ప్రాంతంలో ప్రధానంగా పట్టు వ్యాపారం, వ్యవసాయం ప్రధాన జీవన మార్గాలుగా ఉన్నాయి.

    గ్రామం చుట్టూ పక్కల ఉన్న మడ అడవులు, అక్కడి సంప్రదాయ పాత ఇళ్లు ఎంతో సొగసుగా ఉంటాయి.

    ఈ గ్రామాన్ని తొలిసారి సందర్శించే వారికి ఇది ఒక ప్రత్యేకమైన అనుభూతినిస్తుంది.

    ఈ ప్రాంతం అందమైన పల్లెటూరు వాతావరణం,ఆరోగ్యకరమైన జీవనశైలి కలిగి ఉంటుంది.

    ఇక్కడి ప్రజలు అందించే ఆతిథ్యం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. చేనేత కార్మికుల జీవన విధానం ప్రత్యేకంగా ఉంటుంది.

    పట్టు చీరల తయారీని దగ్గరగా చూడాలని ఇష్టపడేవారు పుత్తూరికి తప్పక వెళ్లాలి.

    #5

    తీర్థమలై

    తమిళనాడులోని ధర్మపురి జిల్లాలో ఉన్న తీర్ధమలై, భారతదేశంలోని అత్యుత్తమ గ్రామీణ పర్యాటక ప్రాంతాలలో ఒకటి.

    'తీర్ధమలై' అనగా పవిత్రమైన నీటి కొండ అని అర్థం. ఈ గ్రామంలో ఉన్న ఆలయాలు ఏడవ శతాబ్దానికి చెందినవిగా గుర్తించబడ్డాయి.

    ఇక్కడ రామ తీర్థం, హనుమాన్ తీర్థం అనే రెండు జలపాతాలు ప్రసిద్ధం. ఈ గ్రామం తన అందమైన కొండలు, జలపాతాలతో పర్యాటకులను ఆకర్షిస్తుంది.

    #6

    చిత్రకోట్

    ఛత్తీస్గఢ్‌లోని చిత్రకోట్ గిరిజన సంప్రదాయానికి ప్రసిద్ధి. ఇక్కడ నివసించే ప్రజలు జనావాసాలకి దూరంగా, అడవుల్లో గిరిజన సంప్రదాయాలతో జీవనం సాగిస్తారు.

    చిత్రకోట్ గ్రామంలోని జానపద కళలు, హస్తకళలు ఎంతో పేరుపొందాయి. అడవుల మధ్యనున్న జలపాతాలతో కూడిన చిత్రకోట్ పర్యాటకులను ఆకట్టుకుంటుంది.

    ఈ ప్రాంతానికి వెళితే, దగ్గర్లోని జగదల్పూర్ ప్యాలెస్, దంతేశ్వరి ఆలయాలను కూడా సందర్శించవచ్చు.

    #7

    హోడ్కా

    గుజరాత్ కచ్ జిల్లాలో ఉన్న ఈ గ్రామం ఒక అద్భుతమైన,అందమైన ప్రాంతం.

    కచ్ జిల్లా మొత్తం తెల్లటి ఎడారితో కప్పబడి ఉంటుంది.ఇది చూసిన వారికి ప్రత్యేకమైన ఆకర్షణగా అనిపిస్తుంది.

    ఇక్కడి వాతావరణం కాలానికి అనుగుణంగా మారుతుందనేది మరో విశేషం.ముఖ్యంగా చలికాలంలో ఈ ప్రాంతం మరింత ప్రత్యేకతను సంతరించుకుంటుంది, ఎందుకంటే 100కుపైగా పక్షుల జాతులు ఇక్కడకు వలస వస్తాయి.

    ప్రతి ఏటా చలికాలంలో జరిగే 'రన్ ఉత్సవ్' ఈ ప్రాంతపు ప్రత్యేకమైన సంస్కృతికోత్సవాలలో ఒకటి.

    హోడ్కా

    హోడ్కా

    'రన్ ఉత్సవ్' మన దేశంలోని ప్రముఖ సాంస్కృతిక ఉత్సవాలలో ఒకటిగా ప్రసిద్ధి పొందింది.

    ఈ ఉత్సవానికి దేశం నలుమూలల నుండి టూరిస్టులు విచ్చేస్తారు. వారు రాత్రి వేళలో తెల్లటి ఎడారిలో టెంట్లు వేసుకుని అక్కడ ఉంటారు.

    ఆకాశంలో విస్తరించి ఉన్న పాలపుంతలు అందంగా కనిపిస్తాయి, ఆ క్షణం కనుల ముందు కనిపించే అపూర్వ దృశ్యం ఉంటుంది.

    ఈ ప్రాంతాన్ని ఒకసారి దర్శిస్తే, ప్రతి సంవత్సరం తిరిగి రావాలనిపించేలా ఉంటుంది.

    #8

    శ్యాం గావ్​ 

    అస్సాంలోని జోర్తాటి జిల్లాలో ఉన్న చిన్న బౌద్ధ ప్రాంతం శ్యాంగావ్​. ఈ గ్రామం అస్సాం గ్రామీణ జీవితాన్ని సజీవంగా చూపిస్తుంది.

    అస్సాం సంస్కృతి ఇతర సంస్కృతులతో పోల్చుకుంటే భిన్నంగా, ప్రత్యేకంగా ఉంటుంది.

    ఈశాన్య భారతదేశంలో ప్రతి రాష్ట్రానికి సంస్కృతి వేర్వేరు రీతుల్లో అభివృద్ధి చెందుతుంది.

    శ్యాంగావ్​ ఒక ప్రాచీన గిరిజన గ్రామం. ఇక్కడ నివసించే గిరిజనులు థేరావాద బౌద్ధ మతాన్ని అనుసరిస్తారు.

    ఈ ప్రాంతం అడవుల మధ్యలో అందమైన మరియు ప్రశాంతమైన వాతావరణంలో ఉంది.

    #9

    కుంబలంగి

    కుంబలంగి కేరళ బ్యాక్ వాటర్స్ లో ఉన్న ఒక చిన్న ఐల్యాండ్ లోని గ్రామం. ఇక్కడ జనాభా చాలా తక్కువ.

    ఈ ప్రాంతం విదేశీ టూరిస్టులను బాగా ఆకట్టుకుంటుంది. కేరళకు వచ్చే టూరిస్టుల్లో చాలా మంది కుంబలంగికి కూడా వస్తుంటారు.

    ఈ చిన్న గ్రామంలో స్టే చేసేందుకు అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. బ్యాక్ వాటర్స్ పై బోట్ లో ఉండడం, బోట్లో షికారుకెళ్ళడం ఇక్కడ వాళ్లకు ఓ హాబీ.

    ఇక్కడ నివసించే వాళ్లంతా కళాకారులే. కేరళలోని సాంప్రదాయ కళల్లో నైపుణ్యం ఉన్నవాళ్లు. ఇక్కడకు వచ్చే విదేశీ టూరిస్టులకు ఇక్కడి డ్యాన్స్‌లు, కళలు, వంటలు నేర్పిస్తూ ఉంటారు.

    సమాచారం 

    తెలంగాణలో రూరల్ టూరిస్ట్ స్పాట్స్ 

    తెలంగాణలో కూడా చాలా అందమైన రూరల్ టూరిస్ట్ స్పాట్స్ ఉన్నాయి. నల్లమల అడవుల్లోని మన్ననూరు ఒక విశేషమైన ప్రదేశం.

    అక్క మహాదేవి గుహలు, ఉమామహేశ్వరం, ఫరాబాద్, మల్లెల తీర్థం వంటి ప్రాంతాలు ఇక్కడి సంస్కృతి, సాంప్రదాయాలను ప్రతిబింబిస్తాయి.

    అదే విధంగా, గోదావరి ఒడ్డున ఉన్న ఏటూరు నాగారం, తాడ్వాయి, జంపన్నవాగు లాంటి ప్రదేశాలు కూడా ప్రకృతి అందాలతో, పచ్చటి వాతావరణంతో కళ్యాణాన్ని అందిస్తాయి.

    ఈ ప్రదేశాలు కల్బర్​తో పాటు పల్లె అందాలను, అందమైన ప్రకృతిని సందర్శకులకు అందిస్తాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పర్యాటకం

    తాజా

    Rajinikanth: వివేక్ ఆత్రేయకు రజనీ కాంత్ గ్రీన్ సిగ్నల్  రజనీకాంత్
    Dry fruit lassi: పిల్లల నుంచి పెద్దల వరకు ఇష్టపడే డ్రై ఫ్రూట్ లస్సీ ఇలా తయారు చేసుకోండి! జీవనశైలి
    Tabu: మళ్లీ వార్తల్లో కృష్ణజింక కేసు.. సైఫ్‌, టబు, నీలం, సోనాలీపై విచారణ కొనసాగుతోంది బాలీవుడ్
    Neeraj Chopra: 90 మీటర్ల మార్క్ దాటిన నీరజ్‌ చోప్రా.. అభినందనలు తెలిపిన నరేంద్ర మోదీ నీరజ్ చోప్రా

    పర్యాటకం

    ట్రావెల్: వర్షాకాలంలో అందమైన అనుభూతిని పంచే భారతదేశంలోని పర్యాటక ప్రదేశాలు  వర్షాకాలం
    400 మీటర్ల లోతులో హోటల్ గదులు: ప్రపంచంలోనే అత్యంత లోతులో ఉన్న హోటల్ గురించి తెలుసుకోండి  జీవనశైలి
    కిడ్నీ సమస్యలు ఉన్నవారు పర్యాటక ప్రదేశాలు సందర్శించాలనుకుంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు  లైఫ్-స్టైల్
    ట్రావెల్: వాటికన్ సిటీ నుండి గుర్తుగా ఇంటికి తెచ్చుకోవాల్సిన వస్తువులు  జీవనశైలి
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025