Page Loader
Champions Trophy 2025: కెప్టెన్ల ఫొటోషూట్ రద్దు.. పాకిస్తాన్ పర్యటనకు కెప్టెన్‌ రోహిత్ వెళ్లాల్సిన అవసరం లేదు!
పాకిస్తాన్ పర్యటనకు కెప్టెన్‌ రోహిత్ వెళ్లాల్సిన అవసరం లేదు!

Champions Trophy 2025: కెప్టెన్ల ఫొటోషూట్ రద్దు.. పాకిస్తాన్ పర్యటనకు కెప్టెన్‌ రోహిత్ వెళ్లాల్సిన అవసరం లేదు!

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 31, 2025
09:35 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రతిష్ఠాత్మక ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫిబ్రవరి 19న ప్రారంభం కానుంది. ఈ ట్రోఫీ ఆరంభోత్సవాన్ని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ), అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) సంయుక్తంగా ఫిబ్రవరి 16న లాహోర్‌లో నిర్వహించనున్నారు. ఈ వేడుక లాహోర్ కోటలోని హుజూరి బాగ్ వేదికగా జరుగుతుంది. అయితే, ఈసారి ఐసీసీ టోర్నీ ప్రారంభానికి ముందు సాంప్రదాయంగా జరుగే అన్ని జట్ల కెప్టెన్ల ఫొటోషూట్, మీడియా సమావేశం నిర్వహించమని పీసీబీ వెల్లడించింది.

వివరాలు 

ట్రోఫీకి ముందు ప్రధాన జట్లు బిజీ

ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ప్రధాన జట్లు ఇతర మ్యాచ్‌లతో బిజీగా ఉండడంతో కెప్టెన్ల ఫొటోషూట్‌ను నిర్వహించడాన్ని రద్దు చేయడం జరిగిందని పీసీబీ వర్గాలు తెలిపాయి. "ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు అన్ని జట్లకు సమయం లేదు. భారత్‌తో ఇంగ్లండ్ వన్డే సిరీస్ జరగాలి, శ్రీలంకలో పర్యటనలో ఆస్ట్రేలియా ఉంది. టోర్నీ ప్రారంభానికి ముందు ఇంగ్లండ్, ఆస్ట్రేలియా పాకిస్థాన్‌కు చేరుకుంటాయి. ఈ కారణంగా సమయం లేకపోవడంతో కెప్టెన్ల ఫొటోషూట్, విలేకర్ల సమావేశం నిర్వహించడాన్ని రద్దు చేస్తున్నాం" అని పీసీబీ వర్గాలు పేర్కొన్నాయి. కెప్టెన్ల ఫొటోషూట్ రద్దు కావడంతో, టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పాకిస్థాన్‌కు వెళ్లాల్సిన అవసరం లేకపోయింది.

వివరాలు 

ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో ఎనిమిది జట్లు

ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం అయ్యే ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో ఎనిమిది జట్లు పోటీపడనున్నాయి. దాదాపు ఎనిమిది సంవత్సరాల తర్వాత ఈ టోర్నీ జరుగుతోంది. పాకిస్థాన్ ఈ టోర్నీకి ఆతిథ్యం ఇస్తోంది. గ్రూప్ Aలో భారత్, పాకిస్థాన్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ జట్లు ఉన్నాయి. ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్‌తో, ఫిబ్రవరి 23న పాకిస్థాన్‌తో, మార్చి 2న న్యూజిలాండ్‌తో భారత్ దుబాయ్ వేదికగా పోటీపడుతుంది. 2013లో ఎంఎస్ ధోని నాయకత్వంలో భారత్ ఈ ట్రోఫీని గెలుచుకున్న విషయం తెలిసిందే.