IND Vs PAK : ప్రపంచ కప్‌లో పాక్‌పై టీమిండియాదే పైచేయి.. ఎలాగంటే?
వన్డే వరల్డ్ కప్ 2023లో అసలుసిసలు సమరానికి సమయం అసన్నమైంది. క్రికెట్ ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్-పాకిస్థాన్ మ్యాచ్ రేపు ఆహ్మదాబాద్ వేదికగా జరగనుంది. ఇప్పటివరకూ వన్డే ప్రపంచ కప్‌లో ఇరు జట్లు ఏడుసార్లు (1992, 1996, 1999, 2003, 2011, 2015, 2019) పోటీపడ్డాయి. ఈ ఏడు మ్యాచుల్లోనూ భారత్ విజయం సాధించింది. మరి రేపటి రోజున జరిగే మ్యాచుల్లో టీమిండియా ఎలాంటి ప్రదర్శన కనబర్చానుందో చూడాలి. సిడ్నిలో విజయకేతనం ఎగరేసిన భారత్ వన్డే ప్రపంచ కప్‌లో భారత్-పాక్ మొదటిసారిగా 1992లో తలపడ్డాయి. ఈ మ్యాచులో భారత్ 49 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసింది.
రెండో క్వార్టర్ ఫైనల్లో పాక్ పై భారత్ గెలుపు
ఓపెనర్ అజయ్ జడేజా (46), సచిన్ టెండూల్కర్ (54) హాఫ్ సెంచరీతో రాణించారు. ఇక లక్ష్య చేధనలో పాక్ 173 అలౌట్ కావడంతో భారత్ 43 పరుగుల తేడాతో గెలుపొందింది. కపిల్‌దేవ్, మనోజ్ ప్రభాకర్, శ్రీనాథ్ రెండేసి వికెట్లు తీసి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించారు. బెంగళూరులో పాక్‌పై అద్భుత విజయం 1996 ప్రపంచ కప్‌లో భారత్, పాక్ మధ్య రెండో క్వార్టర్ ఫైనల్ జరిగింది. బెంగళూరులో జరిగిన ఈ మ్యాచులో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 287 పరుగులు చేసింది. నవ్యజ్యోత్ సింగ్ సిధు (93) త్రుటీలో సెంచరీని చేజార్చుకున్నాడు. లక్ష్య చేధనలో వెంకటేశ్ ప్రసాద్ (3/45), అనిల్ కుంబ్లే (3/48) రాణించడంతో పాక్ 248 పరుగులకే పరిమితమైంది.
పాక్ పై ఐదు వికెట్లు తీసిన వెంకటేష్ ప్రసాద్
మాంచెస్టర్‌లో 5 వికెట్లతో చెలరేగిన ప్రసాద్ 1999 ప్రపంచకప్‌లో భారత్, పాక్ మధ్య మూడో మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచులో భారత్ 47 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 227 పరుగులు చేసింది. భారత్ బ్యాటర్లలో సచిన్(45), రాహుల్ ద్రావిడ్(61), అజారుద్దీన్(59) రాణించారు. భారత్ ఫాస్ట్ బౌలర్ వెంకటేశ్ ప్రసాద్ 5 వికెట్లతో పాక్ బ్యాటర్లను దడదడలాడించడంతో దాయాది జట్టు 180 పరుగులకు ఆలౌటైంది. త్రుటీలో సెంచరీని చేజార్చుకున్న సచిన్ టెండూల్కర్ 2003 ప్రపంచ కప్‌లో భారత్, పాక్ మరోసారి తలపడ్డాయి. ఈ మ్యాచులో మొదట బ్యాటింగ్ చేసిన పాక్ 273 పరుగులు చేసింది.
సెమీస్ లో పాక్ ను ఓడించిన భారత్
పాక్ బ్యాటర్ సయీద్ అన్వర్(101) శతకంతో కదం తొక్కాడు. ఇక లక్ష్య చేధనకు దిగిన భారత్ 26 బంతులు మిగిలి ఉండగానే టార్గెట్‌ను చేధించింది. సచిన్ టెండూల్కర్ (98) త్రుటిలో సెంచరీని మిస్ చేసుకున్నాడు. యువరాజ్ సింగ్ (50)హాఫ్ సెంచరీతో ఫర్వాలేదనిపించాడు. 2011లో మొహాలీ వేదికగా జరిగిన సెమీస్‌లో పాక్‌ను ఓడించి భారత్ సెమీఫైనల్లో అడుగుపెట్టింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 260 పరుగులు చేసింది. లక్ష్య చేధనలో పాక్ 49.5 ఓవర్లలో 231 పరుగులకు అలౌటైంది. భారత్ బౌలర్లలో జహీర్ ఖాన్, నెహ్రా, మునాఫ్ పటేల్, హర్భజన్, యువరాజ్ సింగ్ తలా రెండేసి వికెట్లు తీ శారు.
76 పరుగుల తేడాతో పాక్ పై విజయం
ఆడిలైడ్ అదరగొట్టిన భారత్ 2015లో ప్రపంచకప్‌లో భారత్, పాక్ మధ్య ఆరో మ్యాచ్ జరిగింది. ఆస్ట్రేలియాలోని అడిలైడ్ వేదికగా జరిగిన మ్యాచులో భారత్ 76 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 300 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ (107), శిఖర్ ధావన్(73), సురేష్ రైనా(74) కీలక ఇన్నింగ్స్ లు ఆడారు. ఇక లక్ష్య చేధనలో పాక్ 224 పరుగులకే కుప్పకూలింది. షమీ 4 వికెట్లతో పాక్ బ్యాటర్ల నడ్డి విరిచాడు.
140 పరుగులతో విజృంభించిన రోహిత్
శతకొట్టిన రోహిత్ 2019 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ తో జరిగిన మ్యాచులో రోహిత్ శర్మ (140) శతకంతో విజృంభించాడు. కోహ్లీ 77 పరుగులతో రాణించాడు. దీంతో భారత్ నిర్ణీత ఓవర్లు ముగిసేరికి 336 పరుగులు చేసింది. ఈ లక్ష్య చేధనలో పాక్ 40 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. అనంతరం వర్షం పడటంతో మ్యాచుకు అంతరాయం ఏర్పడింది. దీంతో డక్‌వర్త్ లూయిస్ ప్రకారం భారత్ 89 పరుగుల తేడాతో గెలుపొందింది.