
Bcci: ఇంగ్లాండ్ టూర్ కోసం భారత జట్టు.. కెప్టెన్ గా శుభ్‌మాన్ గిల్, వైస్ కెప్టెన్‌గా పంత్?
ఈ వార్తాకథనం ఏంటి
భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ) శనివారం ఇంగ్లండ్‌తో జరగనున్న ఐదు టెస్టుల సిరీస్‌కు జట్టును ప్రకటించనుంది.
ఈ నేపథ్యంలో భారత టెస్ట్ కెప్టెన్ రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత, నూతన సారథిని ఎవరిని ఎన్నుకుంటారు అన్న దానిపై క్రికెట్ అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది.
కెప్టెన్సీ రేసులో యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్, స్టార్ బౌలర్ బుమ్రా పోటీలో ఉన్నారు.
అయితే తాజా సమాచారం ప్రకారం టెస్ట్ కెప్టెన్‌గా గిల్‌ను నియమించేందుకు బీసీసీఐ మొగ్గుచూపుతోందని తెలుస్తోంది.
గిల్, ఐపీఎల్ 2025లో గుజరాత్ టైటాన్స్‌ను ప్లేఆఫ్స్‌కు చేర్చిన ప్రదర్శన అతడికి ప్రయోజనకరంగా మారింది. బీసీసీఐ నుంచి దీనిపై అధికారిక ప్రకటన కొద్దిగంటల్లో వెలువడనుంది.
వివరాలు
వైస్ కెప్టెన్ గా రిషబ్ పంత్
ఆస్ట్రేలియా పర్యటనలో వైస్ కెప్టెన్‌గా ఉన్న జస్ప్రీత్ బుమ్రా కూడా కెప్టెన్సీ రేసులో ఉన్నా, అతడి ఫిట్‌నెస్ సంబంధిత అంశాల దృష్ట్యా తుది నిర్ణయం గిల్‌కు అనుకూలంగా తీసుకున్నట్టు తెలుస్తోంది.
బుమ్రా శరీర భారం నిర్వహణ, దీర్ఘకాలిక అందుబాటు అంశాలను బీసీసీఐ పరిశీలించినట్టు సమాచారం.
ఇక వైస్ కెప్టెన్ పదవికి రిషబ్ పంత్ పేరు పరిశీలనలో ఉంది. ఐపీఎల్‌లో పెద్దగా రాణించకపోయినా, టెస్ట్ ఫార్మాట్‌లో అతడు గత కొన్ని సంవత్సరాలుగా స్థిరంగా ఆడుతున్నాడు.
భవిష్యత్‌కు దృష్టిలో పెట్టుకొని సెలెక్టర్లు పంత్‌ను వైస్ కెప్టెన్‌గా ప్రకటించే అవకాశం కనిపిస్తోంది.
వివరాలు
మూడో స్థానంలో సాయి సుదర్శన్
రోహిత్ రిటైర్మెంట్‌తో అతడి స్థానాన్ని పూరించేందుకు యశస్వి జైస్వాల్‌తో కలసి కేఎల్ రాహుల్ ఓపెనర్‌గా బరిలోకి దిగనున్నాడు.
ఐపీఎల్ 2025లో అద్భుతంగా రాణించిన సాయి సుదర్శన్‌ను మూడో స్థానంలో ఆడనున్నాడు.
నాలుగో స్థానంలో గిల్ స్థానం ఖాయమవుతుందని తెలుస్తోంది. ఆ తర్వాతి స్థానాల్లో శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్, కరుణ్ నాయర్, సర్ఫరాజ్ ఖాన్‌లు చోటు దక్కించుకునే అవకాశాలున్నాయి.
వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ ధ్రువ్ జురేల్‌ను రిజర్వ్‌గా జట్టులో కొనసాగించనున్నారు.
వివరాలు
స్పిన్ యూనిట్‌కు రవీంద్ర జడేజా నేతృత్వం
బౌలింగ్ విభాగంలో స్పిన్ యూనిట్‌కు రవీంద్ర జడేజా నేతృత్వం వహించనున్నాడు.
వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్‌లకు కూడా అవకాశం ఉన్నట్లు సమాచారం.
పేస్ విభాగంలో జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్‌లు స్థిరమైన ఎంపికలుగా కనిపిస్తున్నారు.
మహ్మద్ షమీ ఫిట్‌నెస్‌పై ఇంకా సందేహాలుండటంతో, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాష్ దీప్, అర్ష్‌దీప్ సింగ్‌లలో ఇద్దరిని ఎంపిక చేసే అవకాశం ఉంది.