ICC Rankings: ఐసీసీ ర్యాంకులొచ్చేశాయ్.. అదరగొట్టిన భారత్, న్యూజిలాండ్ క్రికెటర్లు
ఈ వార్తాకథనం ఏంటి
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో భారత్, న్యూజిలాండ్ తలపడిన సంగతి తెలిసిందే.
ఈ పోరులో కివీస్‌ను ఓడించిన టీమిండియా ట్రోఫీని కైవసం చేసుకుంది. ఈ విజయంతో పాటు ఐసీసీ ర్యాంకింగ్స్‌లోనూ (ICC Rankings) ఫైనల్‌కు చేరుకున్న జట్లు భారీగా పురోగమించాయి.
ముఖ్యంగా, నిర్ణయాత్మక మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ సాధించి జట్టు గెలుపుకు కీలక పాత్ర పోషించిన రోహిత్ శర్మ (756 పాయింట్లు) రెండు స్థానాలు మెరుగుపరచుకొని టాప్-3లోకి ప్రవేశించాడు.
వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో శుభమన్ గిల్ (784 పాయింట్లు) అగ్రస్థానంలో కొనసాగుతుండగా, పాక్ స్టార్ బ్యాటర్ బాబర్ అజామ్ (770) రెండో స్థానాన్ని నిలబెట్టుకున్నాడు.
వివరాలు
టాప్ -10 బౌలర్లలో ఇద్దరు భారత ఆటగాళ్లు
ఫైనల్లో తక్కువ స్కోరుకే పరిమితమైన విరాట్ కోహ్లీ (736) ఒక స్థానాన్ని కోల్పోయి ఐదో స్థానానికి చేరుకున్నాడు.
ఇక ఇటీవల జరిగిన మ్యాచ్‌ల్లో కీలక పరుగులు చేసిన కేఎల్ రాహుల్ (638) ర్యాంకింగ్‌లో దిగజారి ప్రస్తుతం 16వ స్థానానికి చేరాడు.
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో అద్భుత ప్రదర్శన కనబరిచిన న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ (657) ఏకంగా ఆరు స్థానాలు మెరుగుపరచుకొని రెండో స్థానానికి ఎగబాకాడు.
భారత చైనామన్ స్పెషలిస్ట్ కుల్దీప్ యాదవ్ (650) మూడు స్థాయిల పైకి ఎగబాకి మూడో స్థానంలో నిలిచాడు.
వివరాలు
ఆల్‌రౌండర్ల జాబితా.. టాప్-10లో రవీంద్ర జడేజా
శ్రీలంక స్పిన్నర్ మహీశ్ తీక్షణ (680) ప్రథమ స్థానాన్ని ఆక్రమించాడు. భారత ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా (616) మూడు స్థానాలు మెరుగుపరచుకొని పదో ర్యాంక్‌ను దక్కించుకున్నాడు.
ఇక వన్డే ఆల్‌రౌండర్ల జాబితాలో కూడా రవీంద్ర జడేజా మాత్రమే టాప్-10లో నిలిచాడు.
ప్రస్తుతం అతడు 220 పాయింట్లతో పదో స్థానంలో కొనసాగుతున్నాడు, అఫ్గాన్ ఆల్‌రౌండర్ అజ్మతుల్లా ఒమర్జాయ్ (296) అగ్రస్థానంలో ఉన్నాడు.