LOADING...
Shubman Gill : ఆసియా కప్ ముందు శుభమన్ గిల్‌కు షాక్.. టోర్నమెంట్ నుంచి ఔట్!
ఆసియా కప్ ముందు శుభమన్ గిల్‌కు షాక్.. టోర్నమెంట్ నుంచి ఔట్!

Shubman Gill : ఆసియా కప్ ముందు శుభమన్ గిల్‌కు షాక్.. టోర్నమెంట్ నుంచి ఔట్!

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 28, 2025
03:26 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆసియా కప్ 2025 ప్రారంభానికి ముందే భారత జట్టు వైస్ కెప్టెన్ శుభమన్ గిల్ అస్వస్థతకు గురయ్యాడు సమాచారం ప్రకారం, అతనికి వైరల్ ఫీవర్ ఏర్పడినట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 9 నుంచి 28 వరకు యూఏఈలో ఆసియా కప్ జరగనుంది. భారత్ తన తొలి మ్యాచ్ సెప్టెంబర్ 10న యూఏఈతో, ఆ తర్వాత సెప్టెంబర్ 14న పాకిస్థాన్‌తో ఆడనుంది. ఈ పరిస్తితుల్లో గిల్ కోలుకుని మళ్లీ జట్టులో చేరుతాడని భావిస్తున్నారు.

దలీప్ ట్రోఫీ  

దలీప్ ట్రోఫీ నుంచి గిల్ ఔట్ 

వైరల్ ఫీవర్ కారణంగా శుభమన్ గిల్ దులీప్ ట్రోఫీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఈ టోర్నమెంట్‌లో అతన్ని నార్త్ జోన్ జట్టుకు కెప్టెన్గా ఎంపిక చేయగా, అనారోగ్యం కారణంగా అతను ఆహ్వానాన్ని స్వీకరించలేకపోయాడు. గిల్ స్థానంలో అంకిత్ కుమార్ నార్త్ జోన్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపడతారు. టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం, ప్రస్తుతం గిల్ కోలుకుంటున్నాడని, అతని బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ లో పెద్ద సమస్యలు లేవని తెలిపారు. త్వరలోనే అతను ప్రాక్టీస్ మొదలు పెడతాడని అంచనా వేస్తున్నారు.

ఆసియా కప్ 

ఆసియా కప్‌లో గిల్ వైస్ కెప్టెన్ 

గిల్ పూర్తిగా కోలుకుని ప్రాక్టీస్ మొదలు పెట్టగానే, అతను భారత జట్టు వైస్ కెప్టెన్గా ఆసియా కప్ 2025లో పాల్గొంటాడు. ఈసారి టోర్నమెంట్ టీ20 ఫార్మాట్లో జరుగుతుంది. సమాచారం ప్రకారం, భవిష్యత్తులో గిల్‌ను టీ20 జట్టు కెప్టెన్‌గా కూడా భావించవచ్చని బీసీసీఐ చూస్తోంది. ప్రస్తుతానికి, సూర్యకుమార్ యాదవ్ భారత టీ20 జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. గాయం కారణంగా రిషబ్ పంత్ ఈసారి ఆసియా కప్‌లో ఆడడం లేదు. వికెట్ కీపర్లుగా జట్టులో సంజు శాంసన్, జితేష్ శర్మను ఎంపిక చేశారు. ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా కూడా జట్టులో ఉన్నాడు. ఆసియా కప్‌లో భారత్ గ్రూప్ Aలో ఉంది.ఈ గ్రూప్‌లో పాకిస్తాన్,యూఏఈ,ఒమన్ జట్లు ఉన్నాయి. మరోవైపు గ్రూప్ Bలో బంగ్లాదేశ్,శ్రీలంక,హాంగ్ కాంగ్,అఫ్గానిస్తాన్ ఉన్నాయి.

ఆసియా కప్ 

ఆసియా కప్ కోసం భారత జట్టు 

సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభమన్ గిల్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివం దూబే, అక్షర్ పటేల్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), జస్ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, సంజు శాంసన్ (వికెట్ కీపర్), హర్షిత్ రాణా, రింకూ సింగ్.