LOADING...
BCCI: విరాట్ కోహ్లీ అండ్ కో.రూ.150-200 కోట్లు.. బీసీసీఐ రూ.125 కోట్లకు పైగా నష్టపోవచ్చు.. కారణం ఏంటంటే..
విరాట్ కోహ్లీ అండ్ కో.రూ.150-200 కోట్లు.. బీసీసీఐ రూ.125కోట్లకు పైగా నష్టం

BCCI: విరాట్ కోహ్లీ అండ్ కో.రూ.150-200 కోట్లు.. బీసీసీఐ రూ.125 కోట్లకు పైగా నష్టపోవచ్చు.. కారణం ఏంటంటే..

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 27, 2025
09:08 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత పార్లమెంట్‌ ఆన్‌లైన్ గేమింగ్‌పై నియంత్రణ విధించే బిల్‌ను ఆమోదించింది. ఈ బిల్లు ద్వారా డబ్బులతో ముడిపడిన ఆన్‌లైన్ గేమింగ్ నిర్వహణపై నిషేధం విధించబడింది. అంటే,అన్ని రకాల మనీ గేమ్స్‌పై కొత్తగా నిషేధం విధించబడింది. ఈ పరిణామం వల్ల,కొద్ది రోజులుగా భారత క్రికెట్ బోర్డు స్పాన్సర్‌గా వ్యవహరిస్తున్న ఫాంటసీ స్పోర్ట్స్ ప్లాట్‌ఫామ్ డ్రీమ్11 వైదొలిగింది. ఆసియా కప్ మరికొన్ని రోజుల్లో ప్రారంభమయ్యే వేళ, బీసీసీఐకి కొత్త స్పాన్సర్‌ను త్వరగా నిర్ణయించుకోవాల్సి ఉంది. లేకపోతే, ఆసియా కప్‌లో స్పాన్సర్ లేకుండా ఆడాల్సి వస్తుంది. ఇప్పటికే డ్రీమ్11 వైదొలుగుదల కారణంగా బీసీసీఐ దాదాపు రూ.125కోట్ల వరకు నష్టపోయే అవకాశం ఉంది. ఈప్రభావం కేవలం బోర్డు పైనే కాకుండా ఆటగాళ్లకూ ఈ ఎఫెక్ట్ తప్పదంటూ వార్తలు వస్తున్నాయి.

వివరాలు 

ఎంపీఎల్‌కు ప్రమోట్ చేస్తున్న విరాట్ 

రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, కేఎల్ రాహుల్, పాండ్య సోదరులు డ్రీమ్ 11తో కాంట్రాక్ట్‌లో ఉన్నారు. కెప్టెన్ శుభమన్ గిల్, మహ్మద్ సిరాజ్, యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, రింకు సింగ్, సౌరభ్ గంగూలీ మై11 సర్కిల్‌తో ఒప్పందం చేసుకున్నారు. విరాట్ కోహ్లీ ఎంపీఎల్‌కు ప్రమోట్ చేస్తున్నారు. మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ కూడా విన్‌జోతో ఎండార్స్‌మెంట్‌లో ఉన్నారు. అయితే, ఒక్కొక్కరికి ఫీజులు వేర్వేరు ఉంటాయి. క్రీడా వర్గాల ప్రకారం.. కోహ్లీ కాంట్రాక్ట్ ప్రకారం సంవత్సరానికి రూ.12 కోట్ల వరకు పొందుతారు. రోహిత్, ధోనీ సుమారు రూ.7 కోట్ల ఫీజు పొందుతారు. యువ క్రికెటర్లకూ కనీసం రూ.కోటి తక్కువ కాకుండా దక్కుతోంది.

వివరాలు 

ఐపీఎల్ ఫ్రాంచైజీలపై ప్రభావం 

భారత ఆటగాళ్లందరు కలిపి, ఈ కాంట్రాక్ట్‌ల ద్వారా రూ.150 కోట్ల నుంచి రూ.200 కోట్ల వరకు ఆదాయం పొందుతున్నారు. . ఇప్పుడు నిషేధం నేపథ్యంలో వీరిపై ప్రభావం పడనుంది'' అని క్రికెట్ వర్గాలు పేర్కొన్నాయి. ఈ ప్రభావం కేవలం బీసీసీఐ,ఆటగాళ్లకు మాత్రమే కాదు,ఐపీఎల్ ఫ్రాంచైజీలకు కూడా ఉంటుంది. ఉదాహరణకు,కేకేఆర్,లఖ్‌నవూ సూపర్ జెయింట్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ వంటి జట్లకు గేమింగ్ యాప్‌లు స్పాన్సర్‌గా ఉన్నాయి. కొంతమంది ఆటగాళ్ల ఎండార్స్‌మెంట్ కాంట్రాక్ట్లు పరిమిత పరిమాణంలో ఉన్నప్పటికీ, ఆదాయంలో భారీ ప్రభావం చూపనుంది. ఉదాహరణకు: సిరాజ్, వాషింగ్టన్ సుందర్, వీరు మూడు బ్రాండ్‌లతో ఒప్పందం చేసుకున్నారు, అందులో మై11 సర్కిల్ కూడా ఉంది. ఈ కాంట్రాక్ట్ రద్దయితే, వీరి ఆదాయంలో 33 శాతం నష్టం జరుగుతుందని భావిస్తున్నారు.