Page Loader
Yashasvi Jaiswal: ఎడ్జ్‌బాస్టన్‌లో రోహిత్ శర్ రికార్డును బద్దలుకొట్టిన యశస్వి జైస్వాల్ 
ఎడ్జ్‌బాస్టన్‌లో రోహిత్ శర్ రికార్డును బద్దలుకొట్టిన యశస్వి జైస్వాల్

Yashasvi Jaiswal: ఎడ్జ్‌బాస్టన్‌లో రోహిత్ శర్ రికార్డును బద్దలుకొట్టిన యశస్వి జైస్వాల్ 

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 03, 2025
01:04 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ టెస్ట్ క్రికెట్‌లో మరోసారి తన బ్యాట్ పవర్ ను చూపించాడు. ఇంగ్లండ్ తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో తొలి రోజు అతడు అద్భుతమైన ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా సాగుతున్నఈ టెస్టులో జైస్వాల్ 107బంతుల్లో 87పరుగులు చేసి భారత్‌కు శుభారంభాన్ని ఇచ్చాడు. ఈ ఇన్నింగ్స్‌లో అతడు 13చక్కటి బౌండరీలతో మెరిశాడు.ఈ ఇన్నింగ్స్‌తో పాటు జైస్వాల్ ఒక కీలకమైన రికార్డును సొంతం చేసుకున్నాడు. అతడు ఇప్పుడు సౌతాఫ్రికా,ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా వంటి SENA దేశాల్లో ఓపెనర్‌గా ఐదు అర్ధ సెంచరీలు చేసిన భారత క్రికెటర్‌గా నిలిచాడు. ఇప్పటివరకు రోహిత్ శర్మ ఖాతాలో ఇలాంటివి నాలుగు మాత్రమే ఉండేవి,జైస్వాల్ కేవలం 21 టెస్టుల్లోనే ఈ ఘనతను సాధించటం విశేషం.

వివరాలు 

టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు దిగిన భారత్ 

ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. అయితే ఆరంభంలోనే ఓపెనర్ కేఎల్ రాహుల్ కేవలం 2 పరుగులకే క్రిస్ వోక్స్ పెవిలియన్‌కు పంపాడు. ఆ తర్వాత జైస్వాల్‌కు కరుణ్ నాయర్ తోడయ్యాడు. నాయర్ 31 పరుగులు చేసి బ్రైడన్ కార్స్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. జైస్వాల్ మాత్రం ధాటిగా ఆడి తన అర్ధసెంచరీని పూర్తి చేశాడు. సెంచరీకి చేరువయ్యే దశలో ఉండగానే, లంచ్ బ్రేక్‌కు ముందు ఒక వైడ్ బంతిని కట్ చేయబోయి బెన్ స్టోక్స్ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు.

వివరాలు 

ఎడ్జ్‌బాస్టన్‌లో అత్యధిక స్కోరు సాధించిన భారత ఓపెనర్ గా జైస్వాల్ రికార్డు 

ఈ ఇన్నింగ్స్‌తో యశస్వి జైస్వాల్ ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్ మైదానంలో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన భారత ఓపెనర్‌గా రికార్డు నెలకొల్పాడు. ఇప్పటి వరకు ఈ గౌరవం 1974లో 77 పరుగులు చేసిన సుధీర్ నాయిక్ పేరిట ఉండగా, జైస్వాల్ ఇప్పుడు 87 పరుగులతో ఆ రికార్డును అధిగమించాడు. అలాగే సునీల్ గవాస్కర్ 1979లో 68, 61 పరుగులు చేయగా, పుజారా 2022లో 66పరుగులు చేశారు. ఇక జైస్వాల్ టెస్ట్ కెరీర్‌లో 2000 పరుగుల మైలురాయికి చేరేందుకు కేవలం 10పరుగుల దూరంలో ఉన్నాడు. భారత దిగ్గజ క్రికెటర్లలో వీరేంద్ర సెహ్వాగ్, రాహుల్ ద్రావిడ్ ఈ ఘనతను 40ఇన్నింగ్స్‌లలో సాధించారు. జైస్వాల్ కూడా అదే స్థాయిలో చేరాలంటే రెండో ఇన్నింగ్స్‌లో కనీసం 10పరుగులు చేయాల్సి ఉంటుంది.

వివరాలు 

తొలి టెస్టులో సెంచరీతో అదరగొట్టిన జైస్వాల్ 

జైస్వాల్ తొలి టెస్టులోనూ మెరిశాడు. లీడ్స్ వేదికగా జరిగిన టెస్టులో అతడు 159 బంతుల్లో 101 పరుగులు చేశాడు. అయితే రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 4 పరుగులకే ఔట్ అయ్యాడు. అంతేకాక, ఆ మ్యాచ్‌లో ఫీల్డింగ్ సమయంలో నాలుగు క్యాచ్‌లుడ్రాప్ చేసి, జట్టుకు తీవ్ర నష్టం కలిగించాడు. రెండో టెస్టులో భారత కెప్టెన్ శుభ్ మన్ గిల్ కూడా తన బ్యాటింగ్ మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. వరుసగా రెండో టెస్టులో సెంచరీ కొట్టి కెప్టెన్‌గా సత్తా చాటాడు. ప్రస్తుతం గిల్ 109 పరుగులతో క్రీజులో ఉన్నాడు. భారత్ 5 వికెట్లు కోల్పోయి 291 పరుగులు చేసింది. అతనితో పాటు రవీంద్ర జడేజా 39 పరుగులతో క్రీజులో ఉన్నాడు.