
Air India pilot: విమాన ల్యాండింగ్ తర్వాత విషాదం.. 28ఏళ్ల పైలట్ హఠాన్మరణం
ఈ వార్తాకథనం ఏంటి
ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్కు చెందిన 28ఏళ్ల పైలట్ అర్మాన్ గుండెపోటుతో మృతిచెందారు.
బుధవారం శ్రీనగర్ నుంచి ఢిల్లీకి వచ్చిన విమానాన్ని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో విజయవంతంగా ల్యాండ్ చేసిన అనంతరం ఆయన అస్వస్థతకు గురయ్యారు.
డిస్పాచ్ ఆఫీస్కు వెళ్లిన వెంటనే కుప్పకూలిపోవడంతో తోటి సిబ్బంది వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే మార్గమధ్యంలోనే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.
విమాన ప్రయాణ సమయంలోనే అర్మాన్ వాంతులు చేసుకున్నారని, ల్యాండింగ్ అనంతరం నీరసంగా ఉన్నట్టు సిబ్బంది వెల్లడించారు.
Details
పైలెట్ మృతి ఎయిరిండియా తీవ్ర దిగ్బ్రాంతి
అనంతరం గుండెపోటు రావడంతో సహోద్యోగులు తీవ్ర షాక్కు గురయ్యారు.
పైలట్ అర్మాన్కు ఇటీవలే వివాహం జరిగినట్టు సమాచారం. ఈ ఘటనపై ఎయిరిండియా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ, "అర్మాన్ ఆకస్మిక మరణం మమ్మల్ని శోకసంద్రంలోకి నెట్టింది.
వారి కుటుంబానికి తాము అన్ని విధాలుగా తోడుంటాం. దయచేసి గోప్యత పాటించండి, ఊహాగానాలను వ్యాప్తి చేయకూడదని ఒక ప్రకటనలో పేర్కొంది.
ఈ విషాద ఘటనతో పైలట్ల పని వేళలు, ఒత్తిడి మరోసారి చర్చనీయాంశమవుతోంది.