LOADING...
CP Radhakrishnan: ఉప రాష్ట్రపతిగా ప్రమాణస్వీకారం చేసిన సీపీ రాధాకృష్ణన్‌ 
ఉప రాష్ట్రపతిగా ప్రమాణస్వీకారం చేసిన సీపీ రాధాకృష్ణన్‌

CP Radhakrishnan: ఉప రాష్ట్రపతిగా ప్రమాణస్వీకారం చేసిన సీపీ రాధాకృష్ణన్‌ 

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 12, 2025
10:59 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత కొత్త ఉప రాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్‌ శుక్రవారం ఉదయం 10 గంటలకు ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణం చేయించారు.ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా,రాజ్‌నాథ్ సింగ్,నితిన్ గడ్కరీ,ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా హాజరయ్యారు. అదేవిధంగా మాజీ రాష్ట్రపతులు,ప్రధానులు, ఉప రాష్ట్రపతులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్,ఉప రాష్ట్రపతులు జగదీప్ ధనఖడ్,వెంకయ్యనాయుడు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ నెల 9న జరిగిన ఉప రాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీయే కూటమి అభ్యర్థిగా ఉన్న సీపీ రాధాకృష్ణన్‌ జస్టిస్‌ బి. సుదర్శన్ రెడ్డిని 152 ఓట్ల మెజారిటీతో ఓడించి విజయం సాధించారు.

వివరాలు 

మహారాష్ట్ర గవర్నర్‌ గా రాజీనామా

ఎన్నిక ప్రక్రియ పూర్తయిన వెంటనే గురువారం ఆయన మహారాష్ట్ర గవర్నర్‌ పదవికి రాజీనామా చేశారు. దీని ద్వారా మహారాష్ట్ర గవర్నర్‌ బాధ్యతలు రాజ్యపతి ద్రౌపదీ ముర్ము ఆచార్య దేవవ్రత్ కి అప్పగించారు. ముందుగా జులై 21న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తొలి రోజు ఉప రాష్ట్రపతి జగదీప్ ధనఖడ్‌ తన రాజీనామా ప్రకటించడం తెలిసిందే. ఆ రోజున ఉదయమంతా రాజ్యసభ కార్యక్రమాలు సజావుగా నడిపించిన ఆయన, రాత్రి అనూహ్యంగా తన నిర్ణయాన్ని ప్రకటించారు. ఆయన ఆరోగ్య పరిస్థితుల కారణంగా పదవికి రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించినప్పటికీ, విపక్ష పార్టీలు జస్టిస్‌ యశ్వంత్ వర్మ అభిశంసన వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం తో జరిగిన విభేదాల కారణంగానే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆరోపించిన విషయం తెలిసిందే.