Page Loader
Delhi Air Quality: ఢిల్లీలో పొల్యూషన్ డేంజర్ బెల్స్.. దారుణంగా పడిపోయిన ఎయిర్ క్వాలిటీ లెవెల్స్
ఢిల్లీలో పొల్యూషన్ డేంజర్ బెల్స్.

Delhi Air Quality: ఢిల్లీలో పొల్యూషన్ డేంజర్ బెల్స్.. దారుణంగా పడిపోయిన ఎయిర్ క్వాలిటీ లెవెల్స్

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 22, 2024
01:04 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశ రాజధాని దిల్లీలో వాయు కాలుష్యం తీవ్రతరమవుతుందని సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ హెచ్చరించింది. ప్రస్తుతం, ఢిల్లీలోని ఎయిర్ క్యాలిటీ ఇండెక్స్ (AQI) 295కి పడిపోయింది. పలు ప్రాంతాల్లో AQI 320కి చేరడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా ఆనంద్ విహార్, బవానా, ద్వారక, జహంగీర్‌పురి, ముండ్కా, నరేలా, పట్‌పర్‌గంజ్, రోహిణి, షాదీపూర్, సోనియా విహార్, వజీర్‌పూర్ వంటి ప్రాంతాలు రెడ్ జోన్‌లో ఉన్నాయి. ఢిల్లీ నగరంలో పంట వ్యర్థాల దహనం, పారిశ్రామిక స్థావరాల నుంచి వెలువడే విషవాయువులతో గాలి కాలుష్యం మరింత అధికమవుతోంది. ఆనంద్ విహార్‌లో AQI 378, ఇందిరా గాంధీ విమానాశ్రయంలో 319, అలీపూర్‌లో 322, ద్వారకలో 324, బవానాలో 350, ధ్యాన్ చంద్ స్టేడియంలో 328గా నమోదైంది.

వివరాలు 

పొగమంచు కారణంగా వాయు కాలుష్యం

సెంట్రల్ వాచ్‌డాగ్ ప్రకటించిన గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (GRAP) రెండవ దశ, అక్టోబర్ 22 నుంచి ఢిల్లీలో అమలులోకి రానుంది. పొరుగు రాష్ట్రాలైన హర్యానా, ఉత్తరప్రదేశ్, పంజాబ్‌లలో కూడా కాలుష్యం పెరుగుతోందని నివేదికలు చెబుతున్నాయి. ముఖ్యంగా పొగమంచు కారణంగా వాయు కాలుష్యం స్థాయిలు అధికమవుతున్నాయి. IIT కాన్పూర్ ప్రొఫెసర్ SN త్రిపాఠి ఇటీవల చేసిన అధ్యయనంలో, గత వారంతో పోలిస్తే ఢిల్లీలో గాలి నాణ్యత మరింత దిగజారిందని పేర్కొన్నారు.