Earthquake: చెన్నైలో భూప్రకంపనలు..భయంతో జనాలు పరుగులు
ఈ వార్తాకథనం ఏంటి
తమిళనాడు రాజధాని చెన్నైలో భూప్రకంపనలు సంభవించినట్టు సమాచారం.
చెన్నైలోని అన్నా రోడ్డులో హఠాత్తుగా జనాలు భయంతో పరుగులు పెట్టారు. భూకంపం వచ్చిందంటూ ఐదు అంతస్తుల భవనంలో పనిచేస్తున్న ఉద్యోగులు ఒక్కసారిగా బయటకు వచ్చారు.
ఈ ఘటనతో అన్నా రోడ్డులో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది.అయితే, దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
నిజంగా భూకంపం సంభవించిందా? లేదా అసత్య వార్తలు వ్యాపించాయా? అనే అంశంపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
శుక్రవారం ఉదయం నేపాల్, పాకిస్థాన్, ఉత్తర భారతదేశం ప్రాంతాల్లో కూడా భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి.
బీహార్‌లోని పాట్నాలో ప్రకంపనలు నమోదయ్యాయి, ఫ్యాన్లు ఊగిపోవడంతో ప్రజలు భయంతో రోడ్లపైకి పరుగులు తీశారు.
వివరాలు
నేపాల్‌లో భూకంపం
అదేవిధంగా, పశ్చిమ బెంగాల్, సిక్కిం, మధ్యప్రదేశ్‌లోనూ భూమి కంపించిందని తెలుస్తోంది.
అయితే, ఇప్పటి వరకు ఆస్తి లేదా ప్రాణ నష్టంపై ఎలాంటి అధికారిక సమాచారం అందలేదు. ఎవరికీ గాయాలు కలగలేదని సమాచారం.
నేపాల్‌లోని సింధుపాల్‌చోక్ జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున 2.35 గంటలకు 6.1 తీవ్రతతో భూకంపం సంభవించింది.
అలాగే, అదే రోజున తెల్లవారుజామున పాకిస్థాన్‌లో కూడా భూప్రకంపనలు నమోదయ్యాయి.
రిక్టర్ స్కేల్‌పై 4.5 తీవ్రత గల ఈ భూకంపం ఉదయం 5.14 గంటలకు సంభవించిందని గుర్తించారు. భూమి 10 కి.మీ లోతులో కంపించిందని భూగర్భ పరిశోధకులు గుర్తించారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
అన్నా నగర్ లో రోడ్లపైకి వచ్చిన జనం
சென்னையில் நில அதிர்வா? - சாலைக்கு வந்த மக்கள்#Chennai | #Nandanam | #earthquake | #people pic.twitter.com/2zJf0PNYeP
— Polimer News (@polimernews) February 28, 2025