
Honeymoon Murder: 'హనీమూన్ ఇన్ షిల్లాంగ్'.. మేఘాలయ హత్యకేసు వెండితెరపైకి!
ఈ వార్తాకథనం ఏంటి
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన మేఘాలయ 'హనీమూన్ హత్య' కేసు త్వరలో సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ కేసును ఆధారంగా చేసుకొని బాలీవుడ్ దర్శకుడు ఎస్పీ నింబావత్ 'హనీమూన్ ఇన్ షిల్లాంగ్' పేరుతో చిత్రాన్ని తెరకెక్కించేందుకు సిద్ధమయ్యారు. ఈ ప్రాజెక్టుకు మృతుడు రాజా రఘువంశీ కుటుంబసభ్యుల నుంచి సంపూర్ణ అనుమతి లభించిందని ఆయన వెల్లడించారు. కుటుంబం అనుమతితోనే సినిమా రాజా రఘువంశీ సోదరుడు సచిన్ మాట్లాడుతూ మన సోదరుడి మరణం వెనుక ఉన్న నిజాన్ని ప్రజల ముందుకు తీసుకురావాలన్న ఉద్దేశంతోనే ఈ సినిమాకు ఇచ్చాం. సినిమాలో చూశాక ఎవరు నిజాయితీగా ఉన్నారు? ఎవరు దోషులు? అన్నదే స్పష్టమవుతుందని చెప్పారు.
Details
ఇలాంటివి పునరావృతం కాకూడదన్న సందేశంతో
దర్శకుడు ఎస్పీ నింబావత్ మాట్లాడుతూ భవిష్యత్తులో ఇటువంటి దారుణమైన ఘటనలు మరన్ని జరగకూడదనే ఉద్దేశంతో ఈ చిత్రాన్ని రూపొందించబోతున్నాం. ఇప్పటికే స్క్రిప్ట్ పూర్తయింది. షూటింగ్లో 80 శాతం భాగం మధ్యప్రదేశ్లోని ఇండోర్లో, మిగిలిన 20 శాతం మేఘాలయలో జరగనుందని వివరించారు. అయితే ఇందులో నటించబోయే నటీనటుల వివరాలను మాత్రం వెల్లడించలేదు. అమీర్ ఖాన్ పై వచ్చిన వార్తలకి ఫుల్స్టాప్ ఇదిలా ఉండగా, ఈ హత్యకేసును ఆధారంగా చేసుకుని బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ సినిమా తీయనున్నారనే వార్తలు ఇటీవల వెలుగులోకి వచ్చాయి. కానీ ఆయన్ను సంబంధించి వచ్చిన ఈ వార్తలను ఆయన తేలిగ్గా ఖండించారు.
Details
ఘటన క్రమాన్ని తలచుకుంటే
ఇందౌర్కు చెందిన రాజా రఘువంశీ ఒక ప్రముఖ ట్రాన్స్పోర్ట్ వ్యాపార కుటుంబానికి చెందినవాడు. మే 20న హనీమూన్ కోసం నూతన వధూవరులు మేఘాలయకు ప్రయాణమయ్యారు. కొద్ది రోజుల తరువాత వారు గల్లంతవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురై పోలీసులకు సమాచారం అందించారు. 11 రోజుల పాటు ఆచూకీ లభించకపోయిన రాజా మృతదేహం చివరికి మేఘాలయలోని సోహ్రా వద్ద ఓ లోతైన లోయలో, జలపాతం సమీపంలో గుర్తించారు. శరీరంపై తీవ్రంగా గాయాలు ఉండటంతో ఇది హత్యగా పోలీసులు నిర్ధారించారు. అనంతరం నిందితురాలు సోనమ్ జూన్ 7న ఉత్తరప్రదేశ్లోని గాజీపుర్లో కనిపించింది. ఆమెను అరెస్ట్ చేసి విచారించగా భర్తను తన ప్రియుడు రాజ్ కుశ్వాహాతో కలిసి హత్య చేసినట్టు తేలింది.