NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / #NewsBytesExplainer: సిక్కిం భారతదేశంలో ఒక రాష్ట్రంగా ఎలా మారింది?  
    తదుపరి వార్తా కథనం
    #NewsBytesExplainer: సిక్కిం భారతదేశంలో ఒక రాష్ట్రంగా ఎలా మారింది?  
    సిక్కిం భారతదేశంలో ఒక రాష్ట్రంగా ఎలా మారింది?

    #NewsBytesExplainer: సిక్కిం భారతదేశంలో ఒక రాష్ట్రంగా ఎలా మారింది?  

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 16, 2025
    05:39 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆకాశాన్ని తాకే హిమాలయ శిఖరాలతో,పచ్చని లోయల మధ్య ప్రశాంతతకు ప్రతిరూపంగా నిలిచిన సిక్కిం రాష్ట్రం,భారతదేశంలో భాగమై సరిగ్గా 50సంవత్సరాలు పూర్తయ్యాయి.

    1975 మే 16న ఈ హిమాలయ రాష్ట్రం భారత యూనియన్‌లో 22వ రాష్ట్రంగా చేరింది.సిక్కింకు భారతంలో విలీనం కావడం,భద్రతా పరంగా,భౌగోళిక రాజకీయ పరంగా ఎంతో ప్రాధాన్యం సంతరించుకున్న ఒక ముఖ్యమైన ఘట్టంగా చెప్పొచ్చు.

    కేవలం 7 వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఉన్నప్పటికీ,ఈ రాష్ట్ర విలీనంతో భారతదేశానికి భవిష్యత్తులో ప్రయోజనాలు పొందుతామని అప్పట్లో పాలకులు ఊహించకపోయినా,అది ఎంత మేలైన నిర్ణయమైందో నేడు స్పష్టమవుతోంది.

    ఎన్నో పర్యాటక ప్రదేశాల మద్దతుతో,ఒకప్పుడు చోగ్యాల్ రాజవంశం పాలనలో స్వతంత్ర రాజ్యంగా ఉన్న సిక్కిం,ఎలా భారతదేశంలో విలీనమైంది?ఈ విలీనంతో రెండు పక్షాలకూ ఏయే లాభాలు కలిగాయో పరిశీలిద్దాం.

    వివరాలు 

    చోగ్యాల్ పాలనపై ప్రజల్లో అసంతృప్తి

    1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం లభించినప్పుడు,సిక్కిం ఒక స్వతంత్ర రాజరిక రాజ్యంగా కొనసాగింది.

    అయితే బ్రిటిష్ సామ్రాజ్య ప్రభావం అక్కడ చాలా ఎక్కువగా ఉండేది. బ్రిటిష్ వారు దేశాన్ని విడిచి వెళ్లిన తర్వాత, సిక్కింకు తన భవిష్యత్ దిశను నిర్ణయించాల్సిన పరిస్థితి ఎదురైంది.

    ఆ నేపథ్యంలో 1950లో భారత్-సిక్కిం మధ్య ఒక ఒప్పందం కుదిరింది.ఈ ఒప్పందం ప్రకారం సిక్కింకు అంతర్గత పరిపాలన స్వతంత్రంగా ఉండగా,విదేశాంగ, రక్షణ,కమ్యూనికేషన్ వ్యవహారాలను భారత్ భాధ్యతగా తీసుకుంది.

    ఈ విధంగా సిక్కింకు ఒక రక్షణ కవచాన్ని భారత ప్రభుత్వం ఇచ్చినట్లయింది. అయినప్పటికీ, చోగ్యాల్ పాలనపై ప్రజల్లో అసంతృప్తి పెరిగింది.

    వివరాలు 

    1975 మే 16న భారత్‌లో విలీనమైన సిక్కిం 

    1970వ దశక ప్రారంభంలో సిక్కింలో రాజకీయ ఉద్రిక్తత పెరిగింది. ప్రజాస్వామ్య పరిపాలన కోసం, భారత్‌తో బలమైన అనుబంధం కోసం ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశారు.

    1974లో భారత్-సిక్కిం మధ్య మరికొన్ని ఒప్పందాలు కుదిరాయి. ఆ తరువాత 1975 ఏప్రిల్‌లో జరిగిన ప్రజాభిప్రాయ సేకరణలో, సిక్కింవాసులు భారతదేశంతో విలీనానికి మద్దతు ఇచ్చారు.

    దానికి అనుగుణంగా, సిక్కిం అసెంబ్లీ భారతదేశంలో విలీనానికి అనుకూలంగా తీర్మానం చేసింది.

    ఆ తర్వాత 1975 మే 16న 36వ రాజ్యాంగ సవరణ ద్వారా, సిక్కిం అధికారికంగా భారత యూనియన్‌లో 22వ రాష్ట్రంగా మారింది.

    వివరాలు 

    బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్ మధ్యలో సిక్కిం 

    సిక్కిం భారతదేశంలో విలీనమైన తర్వాత దేశ భద్రతా పరంగా అనేక కీలక ప్రయోజనాలు లభించాయి.

    సరిహద్దు భద్రత బలపడింది. సిక్కిం మ్యాప్‌ను పరిశీలిస్తే, ఇది ఉత్తరంలో చైనా (టిబెట్), పశ్చిమంలో నేపాల్, తూర్పున భూటాన్‌తో సరిహద్దులు కలిగి ఉంది.

    బంగ్లాదేశ్‌కు సమీపంగా ఉన్న ఈ భౌగోళిక స్థానం భారత్‌కు వ్యూహాత్మకంగా ఎంతో కీలకం.

    చైనాతో ఉన్న సరిహద్దు వివాదాల నేపథ్యంలో సిక్కిం ప్రాధాన్యత మరింత పెరిగింది.

    నాథులా, జెలెప్ లా వంటి కీలక హిమాలయ శ్రేణుల గుండా భారతదేశానికి ఆప్రవేశాలు లభించాయి.

    'చికెన్ నెక్' లేదా సిలిగురి కారిడార్ అనే పేరుతో పిలవబడే ఈ ప్రాంతం, బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్ మధ్యలో ఉంటుంది.

    వివరాలు 

    ఈ కారిడార్‌కు భద్రతా రక్షణగా సిక్కిం నిలవడమే మనకు ప్రధాన బలం

    ఇది భారత ప్రధాన భూభాగాన్ని ఈశాన్య రాష్ట్రాలతో కలిపే సన్నని పొడవైన మార్గం.

    దీని వెడల్పు కేవలం 25 కిలోమీటర్లలోపే ఉంటుంది. ఇటీవల బంగ్లాదేశ్ నేత యూనస్ చైనా పర్యటనలో ఈ ప్రాంతాల గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేయగా, నేపాల్ పర్యటనలోనూ ఈశాన్య రాష్ట్రాలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడు.

    ఇవన్నీ పక్కన పెడితే, ఈ కారిడార్‌కు భద్రతా రక్షణగా సిక్కిం నిలవడమే మనకు ప్రధాన బలంగా మారింది.

    వివరాలు 

    బలపడిన భారత్ ఉనికి

    చికెన్ నెక్ అనే ఈ సన్నని మార్గాన్ని శత్రు దేశాలు కత్తిరిస్తే,భారత ప్రధాన భూభాగానికి ఈశాన్య రాష్ట్రాల నుంచి సంబంధాలు తెగిపోతాయని వారు భావిస్తారు.

    కానీ సిక్కిం భారతదేశంలో విలీనం కావడం వల్ల, హిమాలయాల్లో భారత్ ఉనికి బలపడింది.

    సిలిగురి కారిడార్ భద్రతా పరంగా క్షీణించకుండా ఉండేలా చేశింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ కూడా చైనాతో దగ్గర అవుతూ భారత్‌కు వ్యతిరేకంగా మారుతోంది.

    చైనా మనపై దౌష్ట్య ధోరణిని కొనసాగిస్తూనే ఉంది. అలాంటి పరిస్థితుల్లో, సిక్కిం భారత భద్రతా కోసం రక్షణ కవచంలా నిలుస్తోంది.

    సిక్కింలో భారత సైన్యం అనేక కీలక స్థావరాలను నెలకొల్పింది. 17వ మౌంటెన్ డివిజన్ వంటి ముఖ్యమైన సైనిక విభాగాలు అక్కడ ఉన్నాయ్.

    వివరాలు 

    ఆదాయపు పన్ను నుంచి మినహాయింపు ఉన్న ఏకైక భారత రాష్ట్రం

    చుంగ్థాంగ్ ప్రాంతంలో భారత సైన్యం ఫార్వర్డ్ స్థావరాలను ఏర్పరచింది.ఇవి చైనా కదలికలపై నిఘా పెట్టడంలో,అత్యవసర పరిస్థితుల్లో స్పందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి.

    సిలిగురికారిడార్‌లోని సుక్నాలో త్రిశక్తి కార్ప్స్ ప్రధాన కార్యాలయం ఉండగా,సిక్కిం దాని పరిధిలోకి వస్తుంది.

    భారత్‌లో విలీనం వల్ల సిక్కింకు పొందిన లాభాలు కూడా ప్రత్యేకంగా ప్రస్తావించదగ్గవే.

    కేంద్ర ప్రభుత్వం మౌలిక వసతులు,విద్య,ఆరోగ్యం వంటి రంగాల్లో సిక్కింకు విస్తృత నిధులను కేటాయించి అభివృద్ధికి దోహదపడింది.

    పర్యాటకరంగం బాగా అభివృద్ధి చెందింది.భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 371ఎఫ్ ప్రకారం,సిక్కింకు ప్రత్యేక హోదా కల్పించబడింది.

    అంతేకాదు,1961 సిక్కిం సబ్జెక్ట్స్ రెగ్యులేషన్ ప్రకారం అక్కడి పౌరులకు,వారి వారసులకు ఆదాయపు పన్ను మినహాయింపు లభిస్తుంది.

    ఆదాయపు పన్ను నుంచి మినహాయింపు ఉన్న ఏకైక భారత రాష్ట్రంగా సిక్కిం నిలిచింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    సిక్కిం

    తాజా

    #NewsBytesExplainer: సిక్కిం భారతదేశంలో ఒక రాష్ట్రంగా ఎలా మారింది?   సిక్కిం
    Kaleshwaram: కాళేశ్వరం రిపోర్ట్‌ సిద్ధం.. కీలక నేతల విచారణ అవసరం లేదన్న కమిషన్ తెలంగాణ
    IMD: వచ్చే వారం కేరళలో అతి భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కేరళ
    Ponguru Narayana: రెవెన్యూ రికార్డుల అమలు,భూవివాదాల పరిష్కారానికి నక్షా కార్యక్రమం: నారాయణ  ఆంధ్రప్రదేశ్

    సిక్కిం

    లోయలోకి దూసుకెళ్లిన ఆర్మీ వాహనం.. 16మంది భారత జవాన్లు మృతి భారతదేశం
    సిక్కింలో భూకంపం, యుక్సోమ్‌లో 4.3 తీవ్రత నమోదు భూకంపం
    సిక్కింలో భారీ హిమపాతం, ఆరుగురు పర్యాటకులు మృతి; మంచులో చిక్కుకున్న 150మంది తాజా వార్తలు
    కోస్తా అంధ్ర సహా తూర్పు భారతాన్ని మరింత హడలెత్తించనున్న వేడిగాలులు  ఉష్ణోగ్రతలు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025