NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / లైఫ్-స్టైల్ వార్తలు / Dinosaur Eggs: కులదేవత అనుకుని తరతరాలుగా పూజిస్తున్నారు.. తర్వాత తెలిసింది అవి డైనోసార్ గుడ్లు అని
    తదుపరి వార్తా కథనం
    Dinosaur Eggs: కులదేవత అనుకుని తరతరాలుగా పూజిస్తున్నారు.. తర్వాత తెలిసింది అవి డైనోసార్ గుడ్లు అని
    తర్వాత తెలిసింది అవి డైనోసార్ గుడ్లు అని

    Dinosaur Eggs: కులదేవత అనుకుని తరతరాలుగా పూజిస్తున్నారు.. తర్వాత తెలిసింది అవి డైనోసార్ గుడ్లు అని

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Dec 22, 2023
    06:21 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఓ గ్రామంలో డైనోసార్ గుడ్లకు గ్రామస్తులు పూజలు చేశారు.వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఆ గ్రామంలోని కొన్ని రాళ్లను కుల దేవతలుగా భావించి తరతరాలుగా గ్రామస్థులు పూజలు చేస్తున్నారు.

    ఆ ఊరిని సందర్శించిన శాస్త్రవేత్తల బృందం, ఆ రాళ్లను పరీక్షించారు. అవి శిలాజాలుగా మారిన డైనోసార్‌ గుడ్లని తేల్చింది.

    దీంతో గ్రామస్తులు విస్తుబోయారు. ఇన్నాళ్లుగా తమకు తెలియకుండానే డైనోసార్‌ గుడ్లకు పూజలు చేశామని తెలుసుకుని అవాక్కయ్యారు. ఈ చిత్రమైన సంఘటన మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలో చోటు చేసుకుంది.

    డైనోసార్ ఫాసిల్స్ పార్క్ అభివృద్ధి పనులను పరిశీలించేందుకు సైంటిస్టుల బృందం మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లాలోని పడ్లియా గ్రామంలో సందర్శించింది.

    details

    'కాకడ్ భెరవ్'గా భావించి పూజిస్తారట

    డాక్టర్ మహేష్ ఠక్కర్, డాక్టర్ వివేక్ వి కపూర్, డాక్టర్ శిల్పాల అక్కడ వర్క్‌షాప్ నిర్వహించారు.

    వర్క్‌షాప్ సమయంలో వెస్టా పటేల్ అనే స్థానికుడు గుండ్రని రాళ్లను 'కాకడ్ భెరవ్'గా భావించి పూజిస్తామని సైంటిస్టుల బృందానికి వివరించాడు.

    'కాకడ్' అని పిలిచే ఈ రాళ్లను పొలాల సరిహద్దుల్లో పూజిస్తామని చెప్పుకొచ్చారు. సరిగ్గా అలాంటి రాళ్లే డైనోసార్ శిలాజాల పార్క్ ప్రాంగణంలో రెండున్నాయి.

    దీంతో వాటిని పరిశీలించేందుకు పొలాల వద్దకు వెళ్లి పరీక్షించగా అవి డైనోసార్ గుడ్లని నిర్థారణ అయ్యింది.

    అవి శిలాజాలుగా మారిన డైనోసార్‌ గుడ్లని నిపుణులు స్పష్టం చేయడంతో గ్రామస్థులు ఆశ్చర్యపోయారు.

    Details

    2011లో డైనోసార్‌ శిలాజాల జాతీయ పార్కు ఏర్పాటు 

    కుల దేవతలుగా భావించే ఈ గుండ్రని రాళ్లను స్థానిక ప్రజలు పూజా ఆచారాల్లో వినియోగిస్తారు. ఈ రాళ్లను తరతరాలుగా పూజిస్తున్నామన్నారు.

    సుమారు 18 సెంటీమీటర్ల వ్యాసం కలిగిన ఈ డైనోసార్‌ గుడ్లకు కొబ్బరికాయలను నైవేద్యంగా పెట్టేవారట.

    ఆ గ్రామం ఉన్న ప్రాంతం నర్మదా వ్యాలీ ప్రాంతమని, లక్షల సంవత్సరాల క్రితం డైనోసార్లు ఈ ప్రాంతంలో జీవించి ఉన్నట్లు సైంటిస్టులు వివరించారు.

    ఇదే ప్రాంతంలో గతంలోనూ 256 డైనోసార్‌ గుడ్లను కనుగొన్నారు. వాటిని పరిరక్షించేందుకు ఈ జిల్లాలో 2011లో డైనోసార్‌ శిలాజాల జాతీయ పార్కును సైతం ఏర్పాటు చేశారు.

    తాజాగా డైనోసార్‌ గుడ్లు లభించిన ప్రాంతానికి పురావస్తు అధికారులు చేరుకుని వాటిని స్వాధీనం చేసుకున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మధ్యప్రదేశ్

    తాజా

    Jaish-e-Mohammed: జైషే మహ్మద్ ఎలా పుట్టింది? దాని పేరు ప్రతిసారి ఎందుకు మారుతూనే ఉంది? జైషే మహ్మద్
    Pakistan Team: కొత్త కోచ్ మైక్ హెస్సన్ రాగానే పాకిస్థాన్ క్రికెట్ జట్టులో మళ్లీ డ్రామా షురూ పాకిస్థాన్
    Warangal Railway Station: ఆధునిక సౌకర్యాలతో సుందరంగా మారిన వరంగల్ స్టేషన్‌ వరంగల్ తూర్పు
    Stock market: నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. సెన్సెక్స్‌ 271, నిఫ్టీ 74 పాయింట్ల చొప్పున నష్టం  స్టాక్ మార్కెట్

    మధ్యప్రదేశ్

    హిందీ రాష్ట్రాల్లో సీఎం అభ్యర్థిని ప్రకటించకుండానే ఎన్నికలకు బీజేపీ  బీజేపీ
    మధ్యప్రదేశ్‌: 12ఏళ్ల బాలికపై అత్యాచారం.. ఒంటిపై బట్టలు లేకుండా, రక్తంతో రొడ్డుపై..  అత్యాచారం
    మధ్యప్రదేశ్ అత్యాచారం : ఆటోలో బాలిక రక్తపు మరకలు, సాయం కోసం 8 కి.మీ నడక అత్యాచారం
    అసెంబ్లీ ఎన్నికలపై ప్రధాని మోదీ ఫోకస్.. 6రోజులు నాలుగు రాష్ట్రాల్లో సుడిగాలి పర్యటన నరేంద్ర మోదీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025