
Asia Cup 2025 : టీమిండియాలో అంచనాలకు మించి మార్పులు.. సూర్యకుమార్, బుమ్రా ఔట్.. గిల్, జైస్వాల్‌కి అవకాశం
ఈ వార్తాకథనం ఏంటి
ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్ డ్రా అనంతరం, భారత క్రికెట్ జట్టు తదుపరి దృష్టి ఆసియా కప్ 2025పైనే ఉంది. ఈ ప్రతిష్టాత్మక టోర్నీ సెప్టెంబర్ 9 నుంచి 28 వరకూ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో (UAE) జరగనుంది. ఈ నేపథ్యంలో టీమిండియాలో కీలక మార్పులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా సీనియర్ ఆటగాళ్లు సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రాలకు విశ్రాంతి ఇవ్వబోతున్నారనే వార్తల నేపథ్యంలో భారత జట్టు ఎంపికపై ఆసక్తికర చర్చ మొదలైంది.
వివరాలు
యువ ఆటగాళ్లకు అవకాశాలు
భారత్ గ్రూప్-Aలో పాకిస్థాన్, యూఏఈ, ఒమాన్ జట్లతో పాటు పోటీలో ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆసియా కప్ కోసం బీసీసీఐ సెలెక్టర్లు యువ ఆటగాళ్లకు అవకాశాలు కల్పించే దిశగా ముందుకు సాగుతున్నారు. ఇటీవల హర్నియా సర్జరీ చేయించుకున్న సూర్యకుమార్ యాదవ్ పూర్తి ఆరోగ్యంతో మైదానంలోకి రావడానికి ఇంకా సమయం అవసరమవుతుండటంతో, ఆయన ఈ టోర్నీకి దూరంగా ఉండే అవకాశమే ఎక్కువగా కనిపిస్తోంది. అదే విధంగా, పేస్ ఆస్త్రంగా నిలిచే బుమ్రా కూడా టీ20 వరల్డ్ కప్‌కు మేనేజ్‌మెంట్ ప్రాధాన్యత ఇస్తుండటంతో, ఆయనకూ విశ్రాంతి ఇచ్చే అవకాశాలున్నాయి.
వివరాలు
శ్రేయాస్ అయ్యర్‌కు కూడా మరోసారి అవకాశం దక్కే అవకాశం
ఈ పరిస్థితుల్లో టీ20 జట్టుకు నాయకత్వ బాధ్యతలు ఎవరిచే వహించబోతున్నారన్న ప్రశ్న సర్వత్రా ఆసక్తిని రేపుతోంది. ఈ నేపథ్యంలో శుభమన్ గిల్, యశస్వి జైస్వాల్, సాయి సుదర్శన్ లాంటి యువ బ్యాట్స్‌మెన్లు ఆసియా కప్ జట్టులో స్థిరపడే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అలాగే, సుదీర్ఘ గ్యాప్ తర్వాత తిరిగి ఫామ్‌లోకి వస్తున్న శ్రేయాస్ అయ్యర్‌కు కూడా మరోసారి అవకాశం దక్కే అవకాశముంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ నాయకత్వంలోని ఈ కొత్త పంథాలో సంజు శాంసన్,తిలక్ వర్మ,ధ్రువ్ జురెల్, రింకూ సింగ్ వంటి యువ ఆటగాళ్ల పేర్లు కూడా పరిగణనలో ఉన్నట్లు తెలుస్తోంది. వీరంతా ఇటీవలా మంచి ప్రదర్శనలు అందించడంతో,సెలెక్షన్ కమిటీ వీరిలో కొంతమందికి ఛాన్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నట్టు వార్తలు వెల్లువెత్తుతున్నాయి.
వివరాలు
అద్భుతమైన ప్రదర్శనలతో సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించిన వరుణ్ చక్రవర్తి
ఆల్‌రౌండర్ విభాగంలో హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ వంటి ఆటగాళ్లపై నమ్మకం చూపే అవకాశం ఉంది. పేస్ బౌలింగ్ విభాగంలో అర్షదీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, మహ్మద్ సిరాజ్ వంటి యువ బౌలర్లను ప్రాధాన్యతనిచ్చే అవకాశం ఉంది. స్పిన్నర్ల విభాగంలో కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తిలకు అవకాశం దక్కే అవకాశం ఉంది. ఇటీవల తిరిగి టీ20ల్లోకి వచ్చిన వరుణ్ చక్రవర్తి తన అద్భుతమైన ప్రదర్శనలతో సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు.
వివరాలు
ఆసియా కప్ కోసం భారత్ జట్టు:
బ్యాట్స్‌మెన్లు: యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్, శ్రేయాస్ అయ్యర్, తిలక్ వర్మ, రింకూ సింగ్. వికెట్ కీపర్లు: సంజు శాంసన్, ధ్రువ్ జురెల్. ఆల్ రౌండర్లు: హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్. బౌలర్లు: ప్రసిద్ధ్ కృష్ణ, అర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, మహ్మద్ సిరాజ్.