
Delhi Capitals: ఐపీఎల్‌లో దిల్లీ క్యాపిటల్స్ సూపర్ రికార్డు.. ఈ దూకుడు వెనక 'సైలెంట్' హీరోలెందరో..!
ఈ వార్తాకథనం ఏంటి
చైన్నై సూపర్ కింగ్స్ లాంటి అభిమానుల ఫాలోయింగ్ లేదు, రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ఉన్నంత ఫ్యాన్ బేస్ లేదు.
ముంబయి ఇండియన్స్ లాంటి స్టార్ ప్లేయర్ల సమాహారం కూడా లేదు. సన్ రైజర్స్ హైదరాబాద్ లా హిట్టర్లూ కూడా ఈ జట్టులో కనిపించరు.
అయినప్పటికీ, ఈ జట్టు ఒక అసాధ్యమైన ఘనతను సాధించింది.. ఈ సీజన్‌లో తొలి నాలుగు మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలు నమోదు చేసిన మొదటి జట్టుగా చరిత్ర సృష్టించింది.
అదే ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు. ఈ దూకుడు వెనక 'సైలెంట్' హీరోలెందరో..!
వివరాలు
ఐపీఎల్ 2025లో ప్రత్యేక స్థానం
ప్రస్తుతం ఐపీఎల్ సీజన్‌లో ఐదు మ్యాచ్‌లు ఆడని రెండు జట్లలో దిల్లీ క్యాపిటల్స్ ఒకటి,మరొకటి పంజాబ్ కింగ్స్.
వీరిద్దరూ నాలుగేసి మ్యాచ్‌లు మాత్రమే ఆడాయి.అయితే,పంజాబ్ ఓ మ్యాచ్‌లో ఓటమి చవిచూసింది.
కానీ దిల్లీ ఇప్పటికీ ఓటమిని ఎరుగకుండా వరుస విజయాలతో దూసుకెళ్తోంది.
గతమూడు సీజన్లలో ఒక్కసారి కూడా ప్లేఆఫ్స్‌కు దిల్లీ చేరలేదు. అయితే ఈసారి అదే ఫామ్ కొనసాగితే, టాపర్‌గా ప్లేఆఫ్స్‌కు వెళ్లే బలమైన జట్టుగా మారనుంది.
గతంలో డేవిడ్ వార్నర్,రిషభ్ పంత్ నాయకత్వంలో లీగ్ దశ దాటి ముందుకు వెళ్లలేకపోయిన ఈ జట్టు, 2020లో శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో ఫైనల్‌కు చేరి రన్నరప్‌గా నిలిచింది.
ఆ తరువాత అయ్యర్‌ను వదిలేసిన ఢిల్లీ ,మెగా వేలానికి ముందు రిషభ్ పంత్‌ను రిటైన్ చేసుకోలేదు
వివరాలు
నూతన నాయకత్వం - నూతన మార్గదర్శకం
పంత్‌ను మళ్లీ వేలంలో తీసుకుని కెప్టెన్‌గా నియమిస్తారనే వార్తలు వినిపించాయి. కానీ దిల్లీ మేనేజ్‌మెంట్ ఆ నిర్ణయాన్ని తీసుకోలేదు.
బదులుగా లఖ్నవూ సూపర్ జెయింట్స్ నుంచి విడుదలైన కేఎల్ రాహుల్‌ను సొంతం చేసుకుంది.
అయితే రాహుల్ కెప్టెన్సీ బాధ్యతల నుండి తాను పక్కకు తప్పుకుంటానని చెప్పడంతో,యువ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ ను కెప్టెన్ గా నియమించారు.
అక్షర్ పెద్దగా హడావుడి చేయని,స్ట్రాటజీకి ప్రాధాన్యం ఇచ్చే వ్యక్తిగా పేరుంది.
ఆరంభంలో జట్టును చూసి అభిమానుల్లో ఆశలు తక్కువగానే ఉండేవి.కానీ నాలుగు వరుస విజయాలతో దిల్లీ వారిని ఆశ్చర్యపరిచింది.
ఐపీఎల్ చరిత్రలో తొలి నాలుగు మ్యాచ్‌లను వరుసగా గెలిచిన తొలి జట్టుగా రికార్డు నెలకొల్పింది.
వివరాలు
యువ ప్రతిభపై నమ్మకం - విజయానికి బలం
ట్రిస్టన్ స్టబ్స్, కుల్‌దీప్, అక్షర్, పోరెల్ లాంటి ప్రధాన ఆటగాళ్లను రిటైన్ చేసి, మెగా వేలంలో మంచి ప్లేయర్లను తీసుకొని జట్టును సమతుల్యంగా తీర్చిదిద్దారు.
లఖ్నవూ,హైదరాబాద్,చెన్నై,బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌ల్లో దిల్లీ విజయాలు సాధించింది.
ఇవన్నీ బలమైన జట్లే.చాలామంది జట్లకుహోం గ్రౌండ్‌లో కూడా విజయాలు లభించని ఈ సీజన్‌లో, దిల్లీ మాత్రం తన రెండో హోం గ్రౌండ్ అయిన వైజాగ్‌లో బలంగా నిలిచింది.
ముఖ్యంగా లఖ్నవూపై చివరి వరకూ పోరాడి గెలిచిన తీరు అభినందనీయం.
యువ ఆటగాళ్లు అశుతోష్ శర్మ,విప్రజ్‌పై పెట్టిన నమ్మకాన్ని వారు నిలబెట్టుకున్నారు.
విప్రజ్ బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు.
గత సీజన్లలో బెంగళూరుకు మంచి ఆరంభాలు ఇచ్చిన డుప్లెసిస్,ఈసారి దిల్లీకి విజయాలు తీసుకువచ్చే దిశగా ఆడుతున్నాడు.
వివరాలు
కేఎల్ రాహుల్..
వయస్సు 40 దాటినా,దూకుడు తగ్గకపోవడం ప్రత్యేకత.
అక్షర్ పటేల్‌పై పెద్దగా అంచనాలు లేకపోవడం, అతనిపై ఒత్తిడి లేకుండా ఉండేలా చేసింది.
మేనేజ్‌మెంట్ నుండి పూర్తి మద్దతు ఉండడం అతనికి ఇంకొక బలమైన అస్త్రంగా మారింది.
భారత టీ20 జట్టుకు వైస్ కెప్టెన్‌గా ఉన్న అతడికి దిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్సీ దక్కడం తన ప్రతిభ నిరూపించుకునే అవకాశంగా మారింది.
బౌలర్‌గా ఉండటంతో తన బౌలింగ్ ప్లాన్ కచ్చితంగా అమలు చేస్తూ, ప్రత్యర్థి జట్లపై ఒత్తిడి తెస్తున్నాడు.
మిచెల్ స్టార్క్‌ను ముందుగా ప్రయోగించడం ద్వారా ప్రత్యర్థులపై మానసికంగా ఆధిపత్యం చాటుతున్నారు.
ప్రస్తుతం టాప్ 10 వికెట్ టేకర్స్ జాబితాలో స్టార్క్ 9 వికెట్లతో, కుల్‌దీప్ 8 వికెట్లతో నిలిచారు.
వివరాలు
దిల్లీ ఫ్యాన్స్ జోష్
ఇక జట్టులో మరో కీలక ఆటగాడిగా కేఎల్ రాహుల్ నిలుస్తున్నాడు.
ఛాంపియన్స్ ట్రోఫీ ఫామ్‌ను కొనసాగిస్తూ, తాజా బెంగళూరుపై మ్యాచ్‌లో తన ప్రతిభను మరోసారి చాటాడు.
బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ - మూడు విభాగాల్లోను సమగ్రంగా ప్రదర్శన ఇవ్వడంతో దిల్లీ ఫ్యాన్స్ జోష్ మీదున్నారు.