
MI vs DC : ఢిల్లీ క్యాపిటల్స్‌కి బిగ్ షాక్ ఇచ్చిన బీసీసీఐ.. 10 శాతం జరిమానా..
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్ 2025 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ప్రయాణం ముగిసింది.ప్లేఆఫ్స్ ఆశలు అడియాశలుగా మిగిలిపోయాయి.
బుధవారం ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన నిర్ణాయక పోరులో ముంబయి ఇండియన్స్ చేతిలో ఓటమిపాలై టోర్నీ నుంచి ఢిల్లీ నిష్క్రమించింది.
ఈ ఓటమితో ప్లేఆఫ్స్ చేరుకోని బాధ సరిపోదన్నట్టు, బీసీసీఐ నుంచి మరో ఎదురుదెబ్బ ఎదురైంది. ఢిల్లీ పేసర్ ముకేశ్ కుమార్‌పై జరిమానా విధిస్తూ అధికారిక ప్రకటన వెలువడింది.
ఆట నిర్వహణ నియమాలను ఉల్లంఘించినందుకు ముకేశ్‌పై చర్యలు తీసుకున్నారు.
మ్యాచ్ ఫీజులో 10 శాతం కోత విధించడంతో పాటు, అతడి ప్రవర్తన ఖాతాలో ఒక డీమెరిట్ పాయింట్ నమోదు చేశారు.
వివరాలు
ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.2 ప్రకారం ముకేశ్ పై చర్యలు
ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.2 ప్రకారం.. అంటే మ్యాచ్ సమయంలో ఉపయోగించే వస్తువులు,దుస్తులు,లేదా గ్రౌండ్‌కు సంబంధించిన పరికరాలను ధ్వంసం చేయడం వంటి చర్యల పరంగా.. ముకేశ్ లెవల్ 1 ఉల్లంఘన చేసినట్టు తేలింది.
ఈ విషయాన్ని ఐపీఎల్ పాలక మండలి అధికారికంగా ప్రకటించింది. మ్యాచ్ రిఫరీ తీసుకున్న నిర్ణయాన్ని ముకేశ్ స్వయంగా అంగీకరించాడని పేర్కొన్నారు.
అయితే, ముకేశ్ ఏ వస్తువును ధ్వంసం చేశాడన్న వివరాలు మాత్రం అధికారికంగా వెల్లడించలేదు.
అయితే మ్యాచ్‌లో అతడు ఎక్కువగా పరుగులు ఇచ్చిన విషయం మాత్రం స్పష్టంగా కనిపించింది.
నాలుగు ఓవర్ల బౌలింగ్‌లో అతడు రెండు వికెట్లు తీసినప్పటికీ, 48 పరుగులు సమర్పించుకోవడం గమనార్హం.
వివరాలు
అద్భుత హాఫ్ సెంచరీ చేసిన సూర్యకుమార్ యాదవ్
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 180 పరుగులు చేసింది.
మిడిల్ ఆర్డర్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ అత్యద్భుతంగా ఆడి 43 బంతుల్లో ఏడు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 73 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.
ఢిల్లీ బౌలర్లలో ముకేశ్ రెండు వికెట్లు తీసినా,చమీరా,ముస్తాఫిజుర్ రెహ్మాన్,కుల్దీప్ యాదవ్‌లు తలో ఒక వికెట్ తీసారు.
అనంతరం లక్ష్య ఛేదనలో ఢిల్లీ పూర్తిగా విఫలమైంది.
వివరాలు
121 పరుగులకే ఆలౌట్
18.2 ఓవర్ల వ్యవధిలో మొత్తం 121 పరుగులకే ఆలౌట్ అయ్యారు. బ్యాటింగ్ విభాగంలో సమీర్ రిజ్వీ (39 పరుగులు) కొంత ప్రతిభ కనబర్చినా, కేఎల్ రాహుల్ (11) ఫాఫ్ డుప్లెసిస్ (6) మాత్రం తీవ్రంగా నిరాశపరిచారు.
ముంబై బౌలింగ్ విభాగంలో జస్ప్రీత్ బుమ్రా, మిచెల్ సాంట్నర్ చెరో మూడు వికెట్లు తియ్యగా బౌల్ట్, దీపక్ చాహర్, విల్ జాక్స్, కర్ణ్ శర్మల ఖాతాల్లో తలో వికెట్ చొప్పున నమోదైంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ముకేశ్ కి10 శాతం జరిమానా
Mukesh Kumar fined 10% of his match fees and handed one demerit point. pic.twitter.com/HEvyQGhe3F
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 22, 2025